Top Story:అమెజాన్ పై ఇరాన్ అటాక్, ఐటీపై మిస్సైల్ గురి… షేక్ అవుతోన్న ప్రపంచం…!

ప్రపంచం ఊహించని విపత్తు మొదలైందా? ఇరాన్ యుద్ధం ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని తాకిందా..? అంటే అవుననే అంటున్నాయి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒక్కసారిగా

Post Published By: dialnews
Updated : 25 March 2026, 11:15 AM IST

ప్రపంచం ఊహించని విపత్తు మొదలైందా? ఇరాన్ యుద్ధం ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని తాకిందా..? అంటే అవుననే అంటున్నాయి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బహ్రెయిన్‌లో జరిగిన భీకర డ్రోన్ దాడితో ఇంటర్నెట్ ప్రపంచం అంధకారంలోకి వెళ్లిపోయింది. అంతేకాదు.. ఇప్పటిదాకా తటస్థంగా ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయన్న వార్తలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.

అసలు బహ్రెయిన్‌లో ఏం జరిగింది? అమెజాన్ సర్వర్లు ఎందుకు ఆగిపోయాయి? సౌదీ ఎందుకు యుద్ధంలోకి వస్తోంది? ఒక్కసారి చూద్దాం. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలు మరియు డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అనుకూల గ్రూపులు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడి ప్రభావం నేరుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ పై పడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వందలాది వెబ్‌సైట్లు, యాప్స్ పని చేయడం ఆగిపోయాయి. ఇది కేవలం భౌతిక దాడే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి జరిగిన 'డిజిటల్ స్ట్రైక్' అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెకన్ల వ్యవధిలోనే అమెజాన్ నెట్‌వర్క్ డిస్రప్ట్ అవ్వడం చూస్తుంటే.. ఇరాన్ సైబర్, డ్రోన్ వ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనితో.. దుబాయ్, సౌదీ, కువైట్ దేశాల్లోని బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పోర్టల్స్, డెలివరీ యాప్స్ పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పటిదాకా యుద్ధానికి దూరంగా ఉన్న గల్ఫ్ దిగ్గజాలు సౌదీ అరేబియా, యూఏఈ ఇప్పుడు తమ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ చేస్తున్న వరుస క్షిపణి దాడులు తమ భద్రతకు ముప్పుగా మారతాయని ఈ దేశాలు భావిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. అమెరికా నేతృత్వంలోని కూటమిలో చేరి ఇరాన్‌పై ఎదురుదాడికి దిగాలని ఈ రెండు దేశాలు యోచిస్తున్నాయి. ఒకవేళ సౌదీ, యూఏఈ గనుక యుద్ధంలోకి దిగితే.. ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ఇది మహా సంగ్రామంగా మారడం ఖాయం. మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అనే వార్తలు కంగారు పెడుతున్నాయి. సౌదీ యుద్ధంలోకి వస్తే ప్రపంచ చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ధర ఆకాశాన్ని తాకగా, తాజా పరిణామాలతో పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది.

అటు డిజిటల్ సర్వర్లు డౌన్ అవ్వడం, ఇటు యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకడం చూస్తుంటే.. ఇరాన్ గురి పెడితే ఏ ఒక్కటి సేఫ్ కాదు అనే విషయం ప్రపంచానికి స్లోగా క్లారిటీ వస్తుంది. అమెజాన్ సర్వర్లు మళ్ళీ ఎప్పుడు కోలుకుంటాయి? సౌదీ దాడికి దిగితే ఇరాన్ రియాక్షన్ ఏంటి? యుద్ధం ఇంకా ఎటు వైపు వెళ్తుంది? అనేది ప్రపంచం భయపడుతోంది. అమెరికా సైనిక సమాచారం మరియు గల్ఫ్ దేశాల డిఫెన్స్ డేటా ఈ సర్వర్లలోనే ఉంటుందని, అందుకే ఇరాన్ అనుకూల గ్రూపులు వీటిని టార్గెట్ చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

భౌతిక యుద్ధం కంటే సైబర్ యుద్ధమే ప్రమాదకరంగా మారింది. అమెజాన్ తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ సర్వర్లను కూడా ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకితే.. చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. అదే జరిగితే భారత్ లాంటి దేశాల్లో పెట్రోల్ ధరలు ఊహించని స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. మిస్సైల్స్ తో మాత్రమే కాదు.. సర్వర్లను డౌన్ చేసి అమెరికాను డిజిటల్ యుగంలో వెనక్కి నెట్టాలని ఇరాన్ ప్లాన్ చేసినట్లు వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి.

Published : 
  • 25 March 2026, 11:15 AM IST