Top story: చైనాకు ఇక దబిడిదిబిడే.. మోదీ మార్క్‌ రేర్‌ మ్యాగ్నెట్‌ గేమ్…!

భారత్‌ ఆశలకు.. కోట్ల మంది కలలకు ఊతం ఇచ్చేలా.. భవిష్యత్‌ అడుగులు వేగం పుంజుకునేలా.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది.

Post Published By: dialnews
Updated : 3 February 2026, 3:15 PM IST

భారత్‌ ఆశలకు.. కోట్ల మంది కలలకు ఊతం ఇచ్చేలా.. భవిష్యత్‌ అడుగులు వేగం పుంజుకునేలా.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ లక్ష్యంగా కనిపించింది ఈసారి బడ్జెట్. ఇందులో రేర్ ఎర్త్ మినరల్స్‌కు పెద్దపీట వేయడం.. ఆసక్తి రేపుతోంది. దేశీయంగా ఖనిజ వనరుల వెలికితీతను వేగవంతం చేసేందుకు.. కేంద్రం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక మిషన్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యం ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో.. పట్టును పెంచుకునేందుకు ఏపీతో పాటు మరో ఒడిశా, కేరళ, తమిళనాడును ఎంచుకుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేసి మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ప్రోత్సహించనున్నారు.

ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనికోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక మైనింగ్ మిషన్‌ను ఏర్పాటు చేయబోతోంది. వెలికితీతకే పరిమితం కాకుండా, వ్యర్థాల నుంచి ఖనిజాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించే అవకాశం రేర్‌ ఎర్త్ మినరల్స్‌కు ఉంది. దీంతో భారత్‌ అలర్ట్ అయింది. అంతర్జాతీయంగా జియోపాలిటిక్స్‌లో రేర్ ఎర్త్ ఖనిజాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాలు కీలకంగా మారాయ్‌. ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. దాదాపు 90శాతం ఉత్పత్తి అక్కడి నుంచే. దీంతో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు.. భారత్ కూడా రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ, అయస్కాంతాల తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది.

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్‌.. ఏఐ, సెమీకండక్టర్లు , ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో టాప్‌కు చేరుకోవాలంటే సాఫ్ట్‌వేర్ నైపుణ్యం మాత్రమే సరిపోదు. వీటికి బ్యాక్‌బోన్‌గా నిలిచే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. దీనికోసమే బడ్జెట్‌లో కీలక కేటాయింపులు జరిపింది కేంద్రం. ప్రస్తుతం అరుదైన ఖనిజాల సరఫరాలో చైనాలాంటి దేశాల ఆధిపత్యం ఎక్కువ. విదేశీ ఆధారిత పరిస్థితిని తగ్గించి దేశీయంగా సరఫరాను స్థిరపరచడమే ఇప్పుడు భారత్ లక్ష్యం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి.. భూమి లోపల అతి తక్కువ మోతాదులో లభించే లోహ మూలకాలు. ఇవి మొత్తం 17రకాల లోహ మూలకాలుగా ఉంటాయ్‌. ఇవి భూమిలో నిక్షిప్తమై ఉన్న అరుదైన, ప్రత్యేక లక్షణాలున్న ఎలిమెంట్స్. ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రూపంలో మార్పు చెందుతాయ్‌. మోడ్రన్ ఇండస్ట్రీని ఏలుతూ.. ఫ్యూచర్‌ రాజకీయాలను, ఆధిపత్యాన్ని డిసైడ్ చేసే మినరల్స్ ఇవి. స్మార్ట్‌ఫోన్స్‌ నుంచి సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, శాటిలైట్‌లు, సోలార్ ప్యానెల్స్‌, విండ్ టర్బైన్స్‌, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌, కమ్యూనికేషన్ సిస్టమ్‌, డ్రోన్స్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌.. మరీ ముఖ్యంగా రక్షణ రంగంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూఅయస్కాంత నిల్వలు ఉన్నాయ్‌. ఇది ప్రపంచంలో ఐదో స్థానం అయినా.. ఉత్పత్తిలో కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. రేర్‌ ఎర్త్ ఆక్సైడ్‌ నిల్వలను దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయ్‌. ఐతే రేర్ ఎర్త్ మినరల్స్‌ ప్రపంచాన్ని శాసించే పరిస్థితులు కనిపిస్తున్న వేళ.. ఈ పరిణామాలు భారత్‌కు ఆర్థికంగా వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఏదో రోజు వీటిని అడ్డుపెట్టుకొని చైనా బెదిరించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో.. పూర్తిగా చైనా మీదే ఆధారపడుతోంది భారత్‌. 2023లో 26వేల మెట్రిక్‌ టన్నులు దిగుమతి చేసుకోగా.. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. అవసరాన్ని అడ్డుపెట్టుకొని గేమ్స్ ఆడొద్దు.. ఖనిజాలను ఆయుధాలుగా మార్చొద్దంటూ ఆ మధ్య ప్రధాని మోదీ కూడా చైనాకు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్‌లో రేర్ ఎర్త్ మినరల్స్‌కు పెద్దపీట వేయడం వెనక.. చైనాకు చెక్ పెట్టాలనే వ్యూహం ఉంది.

Published : 
  • 3 February 2026, 3:15 PM IST