Top story: కవిత ప్లాన్‌ మాములుగా లేదుగా… బీఆర్ఎస్‌ను అందుకే టార్గెట్‌ చేస్తోందా…? గులాబీ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాలు…!

తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత...బీఆర్ఎస్‌ను టార్గెట్‌ను చేశారా ? గులాబీ పార్టీ నుంచి వచ్చామన్న ముద్రను పొగొట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? ఇప్పటికే కేటీఆర్‌, హరీశ్‌పై విమర్శలు చేసిన కవిత.

Post Published By: dialnews
Updated : 28 April 2026, 10:06 AM IST

తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత...బీఆర్ఎస్‌ను టార్గెట్‌ను చేశారా ? గులాబీ పార్టీ నుంచి వచ్చామన్న ముద్రను పొగొట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? ఇప్పటికే కేటీఆర్‌, హరీశ్‌పై విమర్శలు చేసిన కవిత...ఇక నుంచి గులాబీ పార్టీ, కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా వ్యవహరించబోతున్నారా ? ఇప్పడిదే రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ గా మారింది.టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రూట్‌ మార్చేశారు. నిన్నటి వరకు మాజీ మంత్రులు, సోదరుడు కేటీఆర్‌, బావ హరీశ్‌రావుపై విమర్శలు, ఆరోపణలు చేశారు. హరీశ్‌రావును అయితే గుంటనక్కతో పోల్చారు. కేటీఆర్‌ను అనరాని మాటలు అన్నారు. అయితే ఎక్కడా కూడా తండ్రి కేసీఆర్‌ను ఒక్క మాట అనలేదు. ఆయన చుట్టూ చేరిన వారినే దొంగలతో పోల్చారు. పార్టీ పెట్టిన తర్వాత పూర్తి ట్రాక్‌ ఛేంజ్‌ చేశారు కవిత. తండ్రి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కవిత...ఇప్పుడు కేసీఆర్‌నే రాజకీయంగా ఇరుకున పెడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేయని ఆరోపణలు, విమర్శలు...కవిత చేస్తుండటం...రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్‌ను టార్గెట్‌ చేయడం వెనుక కవిత అంతిమలక్ష్యం ఏంటన్నది అంతుచిక్కడం లేదు.

బీఆర్ఎస్‌ ముద్ర, ఆ పార్టీ నీడ నుంచి బయటపడేందుకు కవిత ప్రయత్నాలు షురూ చేశారు. ఈ కారణంతోనే బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబం ఎప్పటికైనా ఒకటే అన్న విమర్శల నుంచి బయట పడటానికే...కేసీఆర్‌ తప్పొప్పులను ఎత్తి చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. తన బలం ఏంటో...రాజకీయంగా ఎవరికి ప్రమాదం ఉందో విమర్శలు చేశారని అంటున్నారు. కుటుంబం కంటే తనకు ప్రజలే ముఖ్యమని...వారి సంక్షేమం కోసం పోరాటం చేస్తాననేలా కవిత కామెంట్స్‌ చేస్తున్నారు. తనకు రాజకీయ పార్టీ ముఖ్యమని...తండ్రి, సోదరుడు, కుటుంబం ముఖ్యం కాదంటూ తన ప్రసంగం ద్వారా తేల్చిచెప్పారు. కేసీఆర్‌ కూతురుగా కాకుండా పార్టీ అధ్యక్షురాలిగా రాజకీయాల్లో ఎదగాలని కవిత డిసైడ్‌ అయ్యారు. గులాబీ బాస్‌ తప్పులను ఎత్తి చూపితే...రాజకీయంగా బలపడతామనే నిర్ణయానికి కవిత వచ్చినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ను స్థాపించిన తర్వాత కవిత...పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేశారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎలాగో రారు. దీంతో ఆమె బీఆర్ఎస్‌ శ్రేణులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్‌ కేడర్‌, కింది స్థాయి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్‌లో గుర్తింపు దక్కని నేతలు...ఇప్పటికే కవితకు టచ్‌లోకి వెళ్లినట్లు టీఆర్ఎస్‌ నేతలు చెబుతున్నారు. వీలయినంత ఎక్కువ మంది బీఆర్ఎస్‌ నేతలను తమ పార్టీలోకి లాగాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ నేతలకు నమ్మకం కలిగించాలంటే...కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తేనే సాధ్యమవుతుందని డిసైడ్ అయ్యారట కవిత. తనకు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అన్ని సమానమే అనేలా...అందరిపైనా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 
  • 28 April 2026, 10:06 AM IST