బ్రేకింగ్: తిరువూరు ఎమ్మెల్యే సస్పెండ్…?

గత కొన్ని రోజులుగా చెలరేగిపోతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. నేడు తిరువూరు నియోజకవర్గం ఇంచార్జిగా మైలావరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను నియమించారు చంద్రబాబు.

Post Published By: Vencateshg
Updated : 29 September 2024, 10:30 AM IST

గత కొన్ని రోజులుగా చెలరేగిపోతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. నేడు తిరువూరు నియోజకవర్గం ఇంచార్జిగా మైలావరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను నియమించారు చంద్రబాబు. సోమవారం వసంత కృష్ణ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఒక నెల రోజులు పాటు నియోజకవర్గం బాధ్యతలు చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

తదుపరి నిర్ణయం నియోజకవర్గం కార్యకర్తలు తో చర్చించిన అనంతరం తీసుకునే అవకాశం ఉంది. కొలికపూడి తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సిఎం రెండు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. శనివారం నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులు చంద్రబాబుని వెళ్లి కలవగా... తనకు అన్ని విషయాలు తెలుసు అని త్వరలోనే నిర్ణయం తీసుకుంటా అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Published : 
  • 29 September 2024, 10:30 AM IST