Top story: కొండా ఫ్యామిలీలో రచ్చ రచ్చ.. కూతురిపై రెచ్చిపోయిన సురేఖ.. నీ వల్లే నా బతుకు ఇలా అయింది..!

తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ ‘కొండా ఫ్యామిలీ’కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రచ్చ లేపిన కొండా సురేఖ.. తాజాగా తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ బర్తరఫ్ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లో ఎంత సంచలనం

Post Published By: dialnews
Updated : 7 September 2026, 10:30 PM IST

తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ ‘కొండా ఫ్యామిలీ’కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రచ్చ లేపిన కొండా సురేఖ.. తాజాగా తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ బర్తరఫ్ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లో ఎంత సంచలనం సృష్టించిందో, ఇటు కొండా కుటుంబంలో అంతకంటే పెద్ద పొలిటికల్ భూకంపాన్నే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరంగల్ పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం.. కొండా సురేఖ మంత్రి పదవి పోవడానికి మరెవరో కాదు, ఆమె సొంత కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలే కారణమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ తీవ్ర పరిణామంతో ఇప్పుడు కొండా కుటుంబంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని, తల్లి-కూతుళ్ల మధ్య గట్టిగా గొడవ జరిగిందని ప్రచారం సాగుతోంది. అసలు ఏం జరిగింది..?

కథలోకి వెళ్తే.. కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇటీవల నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఓ సభలో కొన్ని అత్యంత తీవ్రమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ రేఖ దాటి సీఎం ఫ్యామిలీపైనే ఇలాంటి కామెంట్స్ చేయడం కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వాన్ని, సీఎం ప్రతిష్టను దిగజార్చేలా సొంత పార్టీ మంత్రి కూతురే మాట్లాడటాన్ని రేవంత్ రెడ్డి అస్సలు సహించలేదు. వెనుకా ముందు ఆలోచించకుండా కఠిన నిర్ణయం తీసుకుని, కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు.

అంటే.. రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని మంత్రి పదవి దాకా వచ్చిన కొండా సురేఖ.. కేవలం తన కూతురు చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్లే చేజేతులా మంత్రి కుర్చీని పోగొట్టుకోవాల్సి వచ్చింది. మంత్రి పదవి ఊడిపోవడంతో కొండా సురేఖ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పరిణామం కొండా నివాసంలో తల్లి, కూతుళ్ల మధ్య పెద్ద గొడవకు దారితీసిందని ఇన్సైడ్ టాక్. "రాజకీయాల్లో ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో కనీస జ్ఞానం లేకుండా సీఎం ఫ్యామిలీని టార్గెట్ చేసి నా పదవి ఊడేలా చేస్తావా?" అంటూ కొండా సురేఖ తన కుమార్తె సుస్మితపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వరంగల్ లీడర్లు చెప్పుకుంటున్నారు.

కష్టపడి సంపాదించుకున్న రాజకీయ మైలేజ్, కేబినెట్ హోదా ఇలా ఒక్క రోజులో బూడిదలో పోసిన పన్నీరు కావడాన్ని సురేఖ అస్సలు తట్టుకోలేకపోతున్నారట. భర్త కొండా మురళి కూడా ఈ విషయంలో కూతురి ప్రవర్తనను తప్పుపట్టినట్లు, దీంతో కుటుంబంలో తీవ్రమైన అశాంతి, అంతర్గత విభేదాలు మొదలయ్యాయని సమాచారం. నిన్నటి దాకా వరంగల్ లో తిరుగులేని లీడర్లుగా వెలిగిన ఈ ఫ్యామిలీ.. ఇప్పుడు సొంత ఇంటి లొల్లిని సర్దుబాటు చేసుకోలేక సతమతమవుతోంది. కూతురు చేసిన పొలిటికల్ బ్లండర్ మిస్టేక్ వల్లే కొండా సురేఖ మంత్రి పదవి పోవడమే కాకుండా, కొండా ఇంట అంతర్గత యుద్ధానికి కారణమైంది. ఈ వివాదం తర్వాత కొండా సురేఖ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కూతురిపై ఉన్న కోపంతో ఆమెను పాలిటిక్స్‌కు దూరం పెడతారా? అనేది చూడాలి.

Published : 
  • 7 September 2026, 10:30 PM IST