Top story: అమెరికాకు నెతన్యాహు మైండ్ బ్లోయింగ్ కౌంటర్.. మా వెనుక భారత్ ఉంది.. చూసుకుందాం రా..!

అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రపంచాన్ని శాసిస్తున్నామనే అహంకారంతో ఊగిపోయే సూపర్ పవర్ అమెరికాకు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నడిరోడ్డుపై నిలబెట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Post Published By: dialnews
Updated : 7 July 2026, 4:27 PM IST

అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రపంచాన్ని శాసిస్తున్నామనే అహంకారంతో ఊగిపోయే సూపర్ పవర్ అమెరికాకు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నడిరోడ్డుపై నిలబెట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "మాకు అమెరికా ఒక్కటే కాదు.. అంతకుమించిన మహా శక్తివంతమైన దేశం అండగా ఉంది" అంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైట్ హౌస్‌ను షేక్ చేస్తున్నాయి. వైట్ హౌస్‌లో తమకు అత్యంత ఆప్తుడైన డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పటికీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన హెచ్చరికలపై నెతన్యాహు ఒక్కసారిగా గర్జించారు. ఇంతకీ నెతన్యాహుకు అంత ధైర్యం ఎక్కడిది?

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఇరాన్ దేశంతో రహస్యంగా శాంతి చర్చలు జరుపుతోంది. ఈ చర్చలపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ బద్ధ శత్రువైన ఇరాన్‌తో అమెరికా చేతులు కలపడం ఏంటని ఇజ్రాయెల్ నేతలు ఓపెన్‌గానే విమర్శలు గుప్పించారు. దీనిపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు. "ఇజ్రాయెల్‌కు ప్రపంచంలో మిగిలి ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికా మాత్రమే. అలాంటి మమ్మల్ని విమర్శించడం మానేసి, మా చర్చలను ఇజ్రాయెల్ గౌరవించాలి" అంటూ ఒక రకమైన హెచ్చరిక జారీ చేశారు. అంటే.. "మేం చెబితే మీరు వినాలి.. లేదంటే మీకు ఎవరూ లేరు" అనే రేంజ్‌లో అమెరికా బిల్డప్ ఇచ్చింది.

అమెరికా అంతలా అహంకారం చూపిస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? నెతన్యాహు ఊరుకుంటారా? అస్సలు ఛాన్సే లేదు. ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఫాక్స్ న్యూస్' ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ విషయంపై నోరు విప్పారు. జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఆయన సూటిగా తిరస్కరించారు. "వైట్ హౌస్ చరిత్రలోనే డొనాల్డ్ ట్రంప్ మాకు అత్యంత గొప్ప స్నేహితుడు, ఆ మాటపై నేను ఇప్పటికీ పూర్తిగా కట్టుబడి ఉన్నాను.. కానీ జేడీ వాన్స్ చెప్పే ప్రతి మాటతో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు" అంటూ నెతన్యాహు ముఖం మీదే చెప్పేశారు. అక్కడితో ఆగకుండా.. "ఇజ్రాయెల్‌కు అమెరికా ఒక్కటే మిత్రుడు కాదు.. మాకు ప్రపంచంలో వేరే బలమైన స్నేహితులు కూడా ఉన్నారు" అంటూ అసలు బాంబు పేల్చారు.

నెతన్యాహు ఆ వేదికపై గర్వంగా ప్రస్తావించిన ఆ పేరు మరేదో కాదు.. మన 'భారతదేశం'. నెతన్యాహు ఏమన్నారంటే.. "మాకు ఒక దేశం మంచి స్నేహితుడు, దాని పేరు భారతదేశం. దాని జనాభా ఎంతో తెలుసా.. అక్షరాలా 140 కోట్ల మంది. అక్కడి ప్రజల నుండి మాకు అసాధారణమైన, అపారమైన మద్దతు లభిస్తోంది. నా ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసి చూస్తే.. భారతీయులు మాకు ఇస్తున్న సపోర్ట్ ఒక పెద్ద వరదలా కనిపిస్తుంది" అంటూ నెతన్యాహు ప్రపంచ దేశాల ముందే భారత్‌ను ఆకాశానికెత్తేశారు. అంతర్జాతీయ మీడియా ఎంతగా ఇజ్రాయెల్‌ను బద్నాం చేయాలని చూసినా, భారత్ లాంటి దేశాలు తమ వెనుక కొండలా నిలబడ్డాయని అమెరికాకు బుద్ధి చెప్పారు.

కేవలం మద్దతు మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ స్వయం సమృద్ధిని కూడా నెతన్యాహు గుర్తు చేశారు. ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉందన్న విషయాన్ని ఆయన ప్రపంచానికి గుర్తు చేశారు. తమ టెక్నాలజీ మరియు మిలిటరీ పవర్ ఎంత స్ట్రాంగో చెప్తూ.. "ప్రపంచంలో ఉన్న ఎంతోమంది అగ్రనేతలు నాకు స్వయంగా ఫోన్ చేస్తున్నారు. బయటకు సోషల్ మీడియా మరియు పబ్లిక్ ఒపీనియన్ భయంతో వారు మమ్మల్ని విమర్శిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంగా మాత్రం మా మిలిటరీ వ్యూహాలు, మా AI మరియు సైబర్ టెక్నాలజీని తమకు నేర్పించమని అడుగుతున్నారు" అంటూ ఇజ్రాయెల్ రేంజ్ ఏంటో నెతన్యాహు క్లియర్ కట్‌గా వివరించారు. అమెరికా తలుచుకుంటే ఇజ్రాయెల్ ఒంటరి అయిపోతుంది అనుకుంటే అది పొరపాటే! 140 కోట్ల మంది భారతీయుల అండ తమకు ఉందంటూ నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌ను మార్చేస్తున్నాయి.

Published : 
  • 7 July 2026, 4:27 PM IST