డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన పుట్ట మహేష్ వ్యవహారాలపై టిడిపి అధిష్టానం పూర్తిగా దృష్టి పెట్టింది. అసలు ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఏం జరుగుతోంది ., నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎంపీ ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు టిడిపి పెద్దలు.ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కార్యాలయంలో ఇప్పటికీ టీఆర్ఎస్ వాసన లేనని రూడీగా తెలిసింది.బి ఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు దగ్గరి బంధుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
MP పుట్టా మహేష్ యాదవ్ తమ్ముడు డాక్టర్ రవికుమార్ తలసానికి స్వయానా అల్లుడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేస్తున్న సమయంలో రూ. 1000 కోట్లకు పైగా గొర్రెల స్కాంలో ఈడి అభియోగాలు మోపింది.తలసాని మంత్రిగా ఉన్నప్పుడు పిఏలుగా హరీష్, అభిమన్యు పనిచేశారు. గొర్రెల స్కామ్ కేసులో తలసాని వద్ద పిఏగా పనిచేసిన హరీష్ ని కూడా , ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి.తలసాని పిఎగా పనిచేసిన హరీష్ ప్రస్తుతం ఎంపీ మహేష్ యాదవ్ దగ్గర పిఎస్ గా పనిచేస్తున్నారు. అలాగే తలసాని వద్ద పనిచేసిన మరో పిఏ అభిమన్యు అడిషనల్ పీఎస్ గా ఏలూరు కార్యాలయంలో పనిచేస్తున్నారు. అలాగే హరీష్ తమ్ముడు రాకేష్ ఎంపీ మహేష్ యాదవ్ పిఏగా ఏలూరు కార్యాలయంలో పనిచేస్తున్నారు. టిడిపి ఎంపీ మహేష్ యాదవ్ ఎక్కువకాలం దుబాయ్ లోనే ఉంటారు.
మిగిలిన సమయం అంతా హైదరాబాదులో గడుపుతారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్ళినా కూడా మహేష్ వాళ్ళని కలవరని పార్టీలోనే చెప్తుంటారు. ఎంపీ ఏలూరులో ఎవరికి అందుబాటులో లేకపోవడంతో పిఏలు హరీష్, రాకేష్, అభిమన్యులే ఎంపీ కార్యాలయాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎంపీకి, స్థానిక నాయకులకు మధ్య ముగ్గురు పెద్ద అడ్డుగోడలా మారిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఈ ముగ్గురి వల్ల తమకు పనులు జరగటంలేదని టిడిపి నాయకులు, క్యాడరు బాహాటంగానే మాట్లాడుతున్నారు.
ఎంపీ మహేష్ యాదవ్ అప్పుడప్పుడు ఏలూరు వచ్చి వెళ్తుండడంతో వీరి ముగ్గురే హవా సాగిస్తున్నారని టిడిపి హైకమాండ్ కి ఇప్పటికే లేఖలు వెళ్లాయి. అంతేకాదు ఈ ముగ్గురు ఏలూరు ఎంపీ కాన్స్టెన్సీలో బల్ల కింద వ్యవహారాలు బాగానే చక్కబెడుతున్నారని ఓపెన్ గాని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈమధ్య పోలవరం నియోజకవర్గంలో ప్రవేట్ వ్యక్తుల కు చెందిన భూముల వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారాయని ఎంపీ పీఏలు ,ఆయన కార్యాలయం తెర వెనుక పాత్ర పోషించిందని బాగా వినిపిస్తోంది.
ఎంపీ కార్యాలయానికి వస్తే తమకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని మహేష్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్ట మహేష్ పిఎస్ వెల్లంకి హరీష్ వల్ల ఎన్నికల సమయంలో కష్టపడిన ముఖ్య నేతలు ఇటీవల ఎంపీకి దూరమయ్యారు.తెలంగాణ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ యాదవ్ పేరు కీలకంగా మారడంతో .. ఆయన కార్యాలయం పనితీరుపై కూడా ఏపీ ప్రభుత్వం ఆరా తీయగా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎంపీ వ్యవహారాలన్నీ ఏపీ తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వ్యాపారాలు, వ్యవహారాలు, పిఎస్ , పిఏ ల పాత్ర పై కూడా అటు టిడిపి, ఇటు పోలీసులు దృష్టి పెట్టారు.https://www.youtube.com/watch?v=Y-lo5AD6pOY