Top story: ఈసారి గురి తప్పదు…! ఇరాన్ తర్వాత US టార్గెట్ పాకిస్తాన్ తులసి గబ్బార్డ్ హింట్.. పాక్ గేమ్ ఓవర్

హార్ముజ్ జలసంధి విషయం మిత్ర దేశాలను సాయంకోరి భంగపడ్డ ట్రంప్‌కు ఇప్పుడు సొంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్‌పై కొనసాగిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని విపక్ష డెమొక్రాట్లే కాకుండా, ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్

Post Published By: dialnews
Updated : 20 March 2026, 4:30 PM IST

హార్ముజ్ జలసంధి విషయం మిత్ర దేశాలను సాయంకోరి భంగపడ్డ ట్రంప్‌కు ఇప్పుడు సొంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్‌పై కొనసాగిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని విపక్ష డెమొక్రాట్లే కాకుండా, ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ నాయకులు కూడా తప్పుబడుతున్నారు. ట్రంప్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికే ఈ యుద్ధం కోసం అమెరికా సుమారు 16.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం, యుద్ధంలో ఇరాన్ పౌరులతో పాటు అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికా అధ్యక్షుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ సీన్‌లోకి నిఘా విభాగం అధిపతి తులసి గబ్బార్డ్ వచ్చారు. ఆమె చేసిన ప్రకటనే ఇప్పుడు ట్రంప్‌ సర్కార్ మెడకు చుట్టుకుంటోంది.

ఇరాన్‌తో యుద్ధం వేళ సెనెట్ విచారణలో ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి చేసిన వ్యాఖ్యలే ఇవి.అమెరికాకు అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటని గబ్బార్డ్ పేర్కొన్నారు. ఈ దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ వార్‌హెడ్‌లు రెండింటినీ మోయగల అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని ఆమె వెల్లడించారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్తాన్‌లు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్‌లతో కూడిన అనేక రకాల కొత్త, అధునాతన, సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు, అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2025 జూన్‌లో అమెరికా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని, పునర్‌నిర్మాణానికి టెహ్రాన్ చేసిన ప్రయత్నాలేవీ తాము గమనించలేదనికూడా నిఘా అధిపతి క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీనే ఇటు ట్రంప్ అటు పాకిస్తాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందిప్పుడు.

ట్రంప్ విదేశాంగ విధానంలో ఇరాన్ అతిపెద్ద శత్రువు. ఆ దేశం అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదన్న కారణంతోనే దాడులు చేస్తున్నట్టు చెప్పాడు. అయితే, తులసి గబ్బార్డ్ మాత్రం అమెరికాకు ఇరాన్ ప్రత్యక్ష ముప్పు కాదని వ్యాఖ్యానించారు. తులసి గబ్బార్డ్ మొదటి నుంచీ పాక్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అల్-ఖైదా వంటి సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని, అమెరికాకు అసలైన ముప్పు అక్కడి నుంచే ఉందని స్పష్టం చేస్తున్నారు. కానీ, ట్రంప్ తన విదేశాంగ విధానంలో పాకిస్తాన్‌తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా గబ్బార్డ్ ఉంటే, పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించడం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు కత్తి మీద సాములా మారింది. తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలు ట్రంప్‌కు ఒకవైపు భారత్ వంటి మిత్రదేశాలతో సంబంధాలు బలపడటానికి సహకరిస్తాయి. .

తులసి గబ్బార్డ్ తన తాజా నివేదికలో పాకిస్తాన్ తన క్షిపణి వ్యవస్థను ఆధునీకరిస్తోందని, ముఖ్యంగా అమెరికాను తాకగలిగే సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్‌ను ప్రధాన ముప్పుగా చూసిన US, ఇప్పుడు పాకిస్తాన్ వైపు దృష్టి సారించడం ఆ దేశానికి పెద్ద దెబ్బ. గబ్బార్డ్ మొదటి నుంచీ "ఇస్లామిక్ తీవ్రవాదం" పట్ల చాలా కఠినంగా ఉంటున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే అల్-ఖైదా, ISIS వంటి సంస్థల వల్ల అమెరికాకు ముప్పు పొంచి ఉందని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ గనుక ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఆపకపోతే, అమెరికా నుండి వచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేయడం, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ ఫోర్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను మళ్ళీ గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్‌లోకి నెట్టేలా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గబ్బార్డ్ నివేదికల ఆధారంగా.. పాకిస్తాన్ సైన్యానికి ఇచ్చే సాంకేతిక సహకారాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది.

భారత సంతతి నేత అయిన తులసి గబ్బార్డ్ భారత్‌కు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఉదాహరణకు పహల్గాం వంటి దాడులు అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతున్నారు. దీనివల్ల దక్షిణాసియాలో అమెరికా తన ప్రాధాన్యతను పాకిస్తాన్ నుంచి పూర్తిగా భారత్ వైపు మళ్లిస్తుంది. ఇది పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఒంటరిని చేసేస్తుంది. ప్రస్తుతం ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసిన తర్వాత, అమెరికా పాకిస్తాన్‌పై దృష్టి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఆశాజనకంగా లేదు. ఈ సమయంలో అమెరికా వాణిజ్య పరమైన ఆంక్షలు విధిస్తే ఆ దేశం దివాలా తీసే ప్రమాదం ఉంది. తులసి గబ్బార్డ్ ఆలోచనా విధానం చూస్తుంటే, పాకిస్తాన్ తన ఉగ్రవాద అనుకూల విధానాలను మార్చుకోకపోతే, ట్రంప్ హయాంలో ఆ దేశం కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Published : 
  • 20 March 2026, 4:30 PM IST