తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ వ్యక్తిగత, రాజకీయ జీవితం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా చెన్నై సెయింట్ జార్జ్ కోటలో ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ అందరినీ షాక్‌కి గురిచేసింది. సీఎం విజయ్ జాతీయ జెండా ఎగరేస్తుంటే.. విఐపి గ్యాలరీలో, అదీ నేరుగా విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభల పక్కన కూర్చుని స్టార్ హీరోయిన్ త్రిష చేసిన హడావుడి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు త్రిష త్వరలోనే తన ఇల్లు ఖాళీ చేసి విజయ్ ఇంటి పక్కకే మారబోతోందా? అటు భార్య సంగీత విడాకుల పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం వెనుక రహస్యం ఏంటి? విజయ్ పార్టీ తరపున త్రిష తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేయబోతోందా?
అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. ముఖ్యమంత్రిగా విజయ్‌కి ఇది మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. ఈ చారిత్రాత్మక క్షణంలో అందరి కళ్లూ త్రిషపైనే పడ్డాయి. తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి వచ్చిన త్రిషను ప్రోటోకాల్ ప్రకారం.. నేరుగా సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్క సీట్లోనే కూర్చోబెట్టారు. అక్కడ విజయ్ తండ్రితో త్రిష ఎంతో క్లోజ్‌గా మాట్లాడటం, విజయ్ సీఎం హోదాలో వెళ్తుంటే ఎంతో గర్వంగా సెల్యూట్ చేయడం చూస్తుంటే.. వీళ్ల బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని, త్రిషను విజయ్ ఫ్యామిలీ కూడా పూర్తిగా ఓన్ చేసుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న మే నెలలో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష.. ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ మెంబర్‌లా పేరెంట్స్ పక్కన కూర్చోవడం కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ ఫ్యామిలీ సాన్నిహిత్యానికి బలమైన కారణం మరొకటి కూడా వినిపిస్తోంది. త్రిష త్వరలోనే చెన్నైలోని తన పాత నివాసాన్ని మార్చేసి.. ముఖ్యమంత్రి విజయ్ నివసించే ప్రాంతానికి అత్యంత సమీపంలోకి, అంటే విజయ్ ఇంటి పక్కనే కొత్త ఇంట్లోకి కాపురం మార్చబోతున్నట్లు చెన్నై ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన లీగల్ అగ్రిమెంట్స్, ఇంటీరియర్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. విజయ్ నిత్యం రాజకీయాలు, పాలనతో బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. ఆయనకు, ఆయన కుటుంబానికి మరింత అండగా ఉండేందుకే త్రిష ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదే సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితంలో మరో భారీ ట్విస్ట్ వచ్చింది. గతంలో విజయ్, త్రిషల సాన్నిహిత్యం కారణంగానే విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేసిందంటూ చెంగల్పట్టు కోర్టులో కేసు నడిచింది. కానీ, రీసెంట్‌గా సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై.. తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది, దీనికి విజయ్ లాయర్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కోర్టు ఈ కేసును క్లోజ్ చేసింది. అయితే ఇది కాంప్రమైజ్ ఆ? లేక విజయ్ సీఎం అయ్యారు కాబట్టి ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతినకూడదని తీసుకున్న నిర్ణయమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయినప్పటికీ, భవిష్యత్తులో పరిస్థితులు మారితే, అవసరమైతే త్రిషను విజయ్ లీగల్‌గా పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆగస్ట్ 15న త్రిష చూపించిన ఈ యాక్టివ్‌నెస్ వెనుక కేవలం పర్సనల్ లైఫ్ మాత్రమే కాదు.. పక్కా పొలిటికల్ ప్లాన్ కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యమంత్రి విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం తరపున త్రిషను డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి దించేందుకు రంగం సిద్ధం చేశారట. రాబోయే ఉపఎన్నికల్లో తాను గెలిచిన రెండవ స్థానం అయిన.. తిరుచ్చి ఈస్ట్ ను వదులుకుని.. ఆ నియోజకవర్గం నుండి త్రిషను అభ్యర్థిగా సీఎం విజయ్ స్వయంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. తిరుచ్చిలో విజయ్ ఫ్యాన్స్ బలం చాలా ఎక్కువ, అక్కడ త్రిష లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని నిలబెడితే విజయం ఖాయం. అందుకే త్రిషను ఇప్పటినుంచే సీఎం విజయ్ తన ఫ్యామిలీతో పాటు, ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నారనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కన త్రిష కూర్చోవడం, సంగీత విడాకుల కేసు క్లోజ్ అవ్వడం, త్రిష ఇల్లు మారడం.. ఇవన్నీ చూస్తుంటే కోలీవుడ్ రాజకీయాల్లో ఏదో పెద్దదే జరగబోతోందని అర్థమవుతోంది.