Top story: విజయ్… మీరేమిట్లు ?

శవ్యాప్తంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పేరు మార్మోగుతోంది. తమిళనాడులో ద్రవిడ దిగ్గజ పార్టీలను ఓడించిన ఆయనకే దక్కుతోంది. విజయ్ గెలుపు వెనుక బలమైన కారణమేంటి ? సామాజికవర్గం అండదండలు ఆయనకు ఉన్నాయా? ఇంతకీ విజయ్ కులం ఏంటి?

Post Published By: dialnews
Updated : 8 May 2026, 10:10 AM IST

దేశవ్యాప్తంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పేరు మార్మోగుతోంది. తమిళనాడులో ద్రవిడ దిగ్గజ పార్టీలను ఓడించిన ఆయనకే దక్కుతోంది. విజయ్ గెలుపు వెనుక బలమైన కారణమేంటి ? సామాజికవర్గం అండదండలు ఆయనకు ఉన్నాయా? ఇంతకీ విజయ్ కులం ఏంటి? అనేదానిపై ఇప్పటికే గూగుల్‌లో వెతుకుతున్నారు నెటిజన్స్.తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్...ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన గెలుపుతో పాటు, ఇప్పుడు గూగుల్‌లోనూ, సోషల్ మీడియాలోనూ విజయ్ కులం ఏమిటి అనే ప్రశ్నపై నెటిజన్లు విపరీతంగా శోధిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గూగుల్‌లో పదే పదే విజయ్ కులం గురించి సెర్చ్ చేశారు నెటిజన్స్. ఈ విషయంలో విద్యావంతులైన యువత ఒక నాయకుడి సిద్ధాంతాల కంటే పుట్టుకకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరినీ ఒక వర్గానికి కట్టేయడం ప్రస్తుత సమాజంలో పరిపాటిగా మారింది.

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో విజయ్ పేరు సెర్చ్ చేయగానే వస్తున్న ఫలితాలు, ప్రజల్లో ఉన్న కులం పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేస్తోంది. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి, కేవలం రక్తసంబంధిత మూలాల కోసం వెతుకుతున్నారు. కేవలం ఎన్నికల ఫలితాల రోజున సుమారు 80 లక్షల సార్లు ఆయన కులం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు అంచనా. దేశంలో ఒక వ్యక్తి సాధించిన విజయం కంటే, ఆ విజయం వెనుక ఉన్న సామాజిక వర్గంపై ఆసక్తి చూపడం పాత అలవాటే. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది.విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి... నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విజయ్ దళిత సామాజిక వర్గానికి చెందినవారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

తన పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలోనూ, సిద్ధాంతాల పరంగానూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పెరియార్ వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించడమే ఏకైకం కారణం. పాఠశాల యాజమాన్యం మొదట్లో కులం స్థానంలో తమిళం అని రాయడాన్ని అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం ఏదో ఒక కులాన్ని నమోదు చేయాలని వారు పట్టుబట్టారు. అయితే, చంద్రశేఖర్ వెనక్కి తగ్గలేదు. ఒకవేళ మీరు నా కొడుకు కులాన్ని తమిళంగా గుర్తించకపోతే, నేను పాఠశాల ముందు నిరసన చేపడతానని ఆయన హెచ్చరించారు. ఆయన పట్టుదలకు తలొగ్గిన యాజమాన్యం చివరకు అంగీకరించింది. అప్పటి నుండి విజయ్ ప్రాథమిక విద్యా ధృవీకరణ పత్రాల నుండి నేటి వరకు అన్ని ప్రభుత్వ రికార్డులలో కులం స్థానంలో తమిళం అనే కొనసాగుతోంది.

విజయ్ తన సర్టిఫికెట్‌లో కులం కాలమ్ దగ్గర నో క్యాస్ట్ అని ఉంది. ఇది ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం కాదు. దశాబ్దాల కిందట ఆయన పేరెంట్స్ వేసిన మొదటి అడుగు. మానవత్వం ఉంటే చాలని నమ్మిన కుటుంబం నుంచి వచ్చారు విజయ్. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ కాగా... తల్లి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తమిళనాడులోని రామేశ్వర ప్రాంతానికి చెందిన సంపన్న వెల్లాలర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. గూగుల్‌లో క్రైస్తవుడని కనిపించడానికి ఇదే అసలు కారణం. విజయ్ దళితుడు కాదన్నది అసలు నిజం. విజయ్ జోసెఫ్ వెల్లాలార్ కమ్యూనిటీకి చెందినవాడు. వెల్లాలార్ కమ్యూనిటీ అనేది తమిళనాడు, కేరళ, శ్రీలంకలోని ఉత్తర-తూర్పు ప్రాంతాలలో నివసించే పురాతన భూస్వామ్య, వ్యవసాయ కమ్యూనిటీ. వేలన్మై అంటే వ్యవసాయం చేసేవారుగా పిలుస్తారు. అత్యున్నత సామాజికవర్గాలలో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ఈ కమ్యూనిటీ వారు తమిళనాడు జనాభాలో దాదాపు 33 శాతం మంది ఉన్నారని ఓ అంచనా. వెల్లాలార్ కులం లోతుల్లోకి వెళ్తే.. వెల్లాలర్ అంటే వెల్ అంటే ఈటె, అలర్ అంటే సాగుదారుడు. ఆ రెండు తమిళ పదాల నుండి వచ్చినట్టు చెబుతారు. వీరు సాంప్రదాయంగా భూస్వాములు, సాగుదారులు అన్నమాట. మొత్తానికి.. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన విజయ్.. ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిన కుల జాడ్యాన్ని ఎలా తుడిచివేస్తారనేది వేచి చూడాలి.

Published : 
  • 8 May 2026, 10:10 AM IST