సుప్రీం చెప్పినా తగ్గేదే లే… టారిఫ్‌లు 10% నుంచి 15%కి పెంపు…!

''సుప్రీం కోర్టు లేదు సున్నుండ లేదు. ఒకడు చెప్పింది నేను వినను.. నేను చెప్పిందే ప్రతీ ఒక్కడూ వినాలి. మీరు ఒక దారి మూసేస్తే నేను ఇంకో దారిలో టారిఫ్‌లు వేస్తా''

Post Published By: dialnews
Updated : 23 February 2026, 3:12 PM IST

''సుప్రీం కోర్టు లేదు సున్నుండ లేదు. ఒకడు చెప్పింది నేను వినను.. నేను చెప్పిందే ప్రతీ ఒక్కడూ వినాలి. మీరు ఒక దారి మూసేస్తే నేను ఇంకో దారిలో టారిఫ్‌లు వేస్తా'' ప్రస్తుతం ఈ రేంజ్‌ పీక్స్‌ పిచ్చిలో ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అన్ని దేశాల మీద ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను అమెరికన్‌ సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ దెబ్బతో కాస్త వెనక్కి తగ్గుతాడు అనుకుంటే.. ఆ టారిఫ్‌లను ఇప్పుడు 15 శానికి పెంచి ప్రపంచ దేశాలను మరోసారి షాక్‌కు గురి చేశాడు.ప్రపంచ దేశాలపై విధించిన 10 శాతం సుంకాలను 15 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. ట్రంప్ ప్రకటించిన ఈ సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

ఈ తీర్పుతో అసహనానికి గురైన ట్రంప్‌.. అంతకు ముందు ఉన్న యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్, జాతీయ భద్రత సుంకాలను 10 శాతానికి పెంచాడు. ఇప్పుడు వాటిని 15 శాతానికి పెంచుతున్నట్టు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టాడు. “అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన అమెరికా వ్యతిరేక, హాస్యాస్పదమైన తీర్పును క్షుణ్నంగా, లోతుగా సమీక్షించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అధ్యక్షుడిని అయ్యే వరకూ అమెరికాను దోచుకున్న ప్రపంచ దేశాలపై వేసిన 10% టారిఫ్‌ను 15 శాతానికి పెంచుతున్నాను. ఇది తక్ష ణమే అమల్లోకి వస్తుంది. కొన్ని నెలల్లో న్యాయ, చట్ట పరమైన మరిన్ని కొత్త టారిఫ్‌లను మా ప్రభుత్వం అమల్లోకి తెస్తుంది' అని ట్రంప్ పోస్ట్‌ చేశాడు. పేర్కొన్నారు.

అమెరికా వాణిజ్య చట్టం-1974లోని సెక్షన్ 122ప్రకారం ఆ దేశ అధ్యక్షుడికి ప్రపంచంలోని ఏ దేశంపై అయినా గరిష్ఠంగా 15 శాతం వరకు దిగు మతి సుంకాలు విధించే అధికారం ఉంది. ఈ వెసులుబాటును పూర్తిగా విని యోగించుకుంటూ సుంకాలను 15 శాతానికి పెంచాడు. ఇక ఇదే చట్టంలోని 201, 301 సెక్షన్లు, టారిఫ్‌ల చట్టంలోని 338వ సెక్షన్, వాణిజ్య విస్తరణ చట్టం-1962లోని సెక్షన్ 232 కింద కూడా సుంకాలు విధించేందుకు అవకాశం ఉంది. అయితే అవి అధ్యక్షుడి విచక్షణాధికారం మేరకు గంపగుత్తగా వేయడానికి వీల్లేదు. ఒక అధ్యయనం చేయించి.. నిర్ణీత ఉత్పత్తులతో దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలకు ఇబ్బంది అని తేల్చి.. అందుకు అనుగుణంగా సుంకాలు వేయవచ్చు. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. మరికొన్ని నెలల్లో కొత్తగా సుంకాలు వేస్తామని ట్రంప్ చేసిన ప్రకటన.. ఈ చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం అధ్యయనాలు, చర్యలు చేపట్టేందుకేనని అమెరికా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

భారత్ సహా మొత్తం ప్రపంచ దేశాల దిగుమతులపై అమెరికా సుంకాలు 15 శాతంగా ఉండనున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న, చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశాలన్నింటికీ కూడా ప్రస్తుతానికి ఇదే వర్తించనుంది. ఒప్పందంలో టారిఫ్ శాతం ఎంత ఉన్నా కూడా.. ప్రస్తుతం తాత్కాలికంగా 15% సుంకాలకు మారుతాయని వైట్ హౌజ్ ప్రకటించింది. అంటే భారత వస్త్రాలపై పాత సుంకాలు 7-9 శాతం వరకు ఉండగా ఇప్పుడు అవి 15 శాతంగా ఉంటాయి. అయితే ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 50%, పలు రకాల వాహన విడిభాగా లపై ఉన్న 25 శాతం ప్రత్యేక టారిఫ్‌లు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి.

 

Published : 
  • 23 February 2026, 3:12 PM IST