ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీకు.... పార్టీలో పెద్ద పోస్ట్ ఇచ్చా. ఎమ్మెల్సీ పదవినిచ్చా. మంత్రిని చేస్తానని హామీ ఇచ్చా. నీకు ఇన్ని చేస్తే.... నన్ను తిడుతున్న వాళ్లను కనీసం కౌంటర్ చేయవు. తిరుమల లడ్డు విషయంలో పార్టీ విధానాన్ని చెప్పవు. ఆడవాళ్ళ బట్టల గురించి.... చీరల గురించి మాత్రం సందేశాలిస్తూ వీడియోలు పెడతావ్. ఈ మాట అన్నది ఎవరో కాదు. ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ స్వయంగా తన చిన్న అన్న ,ఎమ్మెల్సీ నాగబాబుని పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో నిలదీస్తూ అన్న మాటలు ఇవి.
అధికారంలోకి రాకముందు…అన్నిటికీ నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాగబాబు కూటమి అధికారంలోకి వచ్చి ఎంఎల్సీ అయ్యాక ఎందుకో మౌనంగా ఉంటున్నారు. పార్టీకి సంబంధించిప్రతి ఇష్యూ మీద మాట్లాడాల్సిన సమయంలో…మనకెందుకులే అని గమ్మునా ఉంటున్నారు. తిరుమల లడ్డు నెయ్యి పై గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని తప్పుపడుతూ వైసిపి సోషల్ మీడియాలో భారీ ప్రచారమే చేస్తుంది. లడ్డు నెయ్యిలో జంతుకళేబరాల కొవ్వు కలిసిందంటూ పవన్ అప్పట్లో సంచలన ప్రకటన చేశాడు. సీబీఐ చార్జిషీట్లో లడ్డులో జంతువుల కొవ్వు లేదని నివేదిక రావడంతో.... వైసిపి పవన్ మాటల్ని ఎండగడుతూ ప్రచారం చేస్తుంది. దీనిపై జనసేన నేతలు ఒక్కరు కూడా స్పందించలేదు.
ప్రతి దానికి సోషల్ మీడియాలో చెలరేగిపోయే నాగబాబు, జనసేన అధ్యక్షుడైన సొంత తమ్ముడిపై మీడియాలో ప్రచారం జరుగుతుంటే కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. అందుకే పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ మీటింగ్ లో సొంత అన్నపై విరుచుకుపడ్డాడు.సాధారణంగా జనరల్ బాడీ సమావేశం అంటేరెగ్యులర్‌గా జరిగేదే… కొత్త ఏముంటుందని అందరూ భావించారు.రాష్ట్రంలో జరుగుతున్న కీలక అంశాలపై పవన్ చర్చిస్తారని అంచనా వేసుకుని,మంచి జోష్‌తో, హుషారుగా నేతలంతా సమావేశానికి వచ్చారు.కానీ సమావేశం మొదలైనప్పటి నుంచే పరిస్థితి మారిపోయింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదు..అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా..అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నట్టు అని మొదలెట్టారు పవన్ ..మీటింగ్‌లో అతి తక్కువ మందే వుండడంతోప్రతి ఒక్కరినీ పేరుపేరునా సంబోధిస్తూనే A నుంచి Z వరకు అనాల్సిన మాటలన్నీసూటిగా అనేశారు పవన్.ఈ సమావేశంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, పవన్ చిన్న అన్న మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు.
మీటింగ్ తో మనకు సంబంధం లేదులే అన్నట్లుగాఎప్పటిలాగే కాళ్ల మీద కాళ్లు వేసుకునిదర్జాగా కూర్చున్నారు. కాసేపటికి నాగబాబు వంతు వచ్చింది.ఏ ఎక్స్యూజ్‌లు లేకుండాఆయనను కూడా కడిగిపారేశారు పవన్.నాగబాబు గారండి…అంటూ మొదలుపెట్టి, మీకు ఆడవాళ్ల వస్త్రధారణపై రియాక్ట్ అయ్యే సమయం ఉంటుంది కానండి…తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై మాట్లాడే సమయం లేదా అండి ?అంటూ ప్రశ్నించారు. నిజానికి నాగబాబు…కూటమి అధికారంలోకి వచ్చే వరకు ఫుల్‌గా యాక్టివ్‌గా ఉండేవారు.ఏ ఇష్యూ వచ్చినా…వెంటనే కుండ పగలుకొట్టినట్టు రియాక్ట్ అయ్యేవారు.ఆ రియాక్షన్ సంచలనంగా మారే స్థాయిలో ఉండేది.
లాభమా… నష్టమా… అన్నది పక్కన పెడితే…ఇష్యూ ఉంటే… నాగబాబు ట్వీట్ ఉండాల్సిందే అన్నట్టుగాఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించేవారు.కానీ అధికారంలోకి వచ్చి…ఎంఎల్సీ అయ్యాక మాత్రం…పూర్తిగా సైలెంట్ అయ్యిపోయారు. పదవి వచ్చేసింది కదా... మనకెందుకులే వివాదాలు అనుకున్నారేమో రాష్ట్ర పరిణామాలపై…పొలిటికల్ హ్యాపెనింగ్స్‌పై…పార్టీ పరంగా ఎక్కడా నోరు మెదపడం లేదు.ఇలా సైలెంట్‌గా ఉన్న నాగబాబు…ఇటీవల ఓ విషయంలో హైలైట్ అయ్యారు.సినీ నటుడు శివాజీ,యాంకర్ అనసూయపై చేసిన మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపైతీవ్రంగా స్పందించారు.
ఇలా…మహిళల వస్త్రధారణపై బలంగా స్పందించిన నాగబాబు…రాష్ట్రంలో ఇన్ని కీలక పరిణామాలు జరుగుతున్నా…తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయంగా రచ్చరేపుతున్నా…మనకేమీ పట్టనట్టుగామౌనంగా ఉండడం…చివరకు…పవన్ ఆగ్రహానికి కారణమైంది. పవన్ తో అక్షంతలు పడ్డాక 24 గంటలు దాటకుండానే.... సనాతన ధర్మ పరిరక్షణపై వైసీపీని టార్గెట్ చేస్తూ వీడియో వదిలారు నాగబాబు.
తమ్ముడు చెప్తే కానీ రియాక్ట్ కాడ. ఏదైనా మాట వీళ్ళ అనుబంధం అని పార్టీలో లీడర్లు అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అయినప్పటికీ మంత్రి పదవి రాకపోవడం వల్లనే నాగబాబు చినుకు వహించారని, అందుకే మౌనంగా ఉంటున్నారని పార్టీలోనే మరో టాక్ నడుస్తోంది.