Top story:వార్ ఎఫెక్ట్… మన తెలుగు స్టేట్స్ పై ఈ రేంజ్ లో ఉంటుందా…?

రెండు దేశాల మధ్య యుద్ధం అంటే.. ఆ రెండు దేశాలకే కాదు, ఆ దేశాల మీద డైరెక్ట్ గా, ఇండైరేక్ట్ గా ఆధారపడిన ఎన్నో దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇ

Post Published By: dialnews
Updated : 11 March 2026, 9:23 AM IST

రెండు దేశాల మధ్య యుద్ధం అంటే.. ఆ రెండు దేశాలకే కాదు, ఆ దేశాల మీద డైరెక్ట్ గా, ఇండైరేక్ట్ గా ఆధారపడిన ఎన్నో దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అండ్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ఇండియా మీద దారుణంగా పడుతోంది. ఇండియా మీద అంటే.. రోడ్డు మీద తిరిగే భారీ వాహనాల నుంచి మన వంట గది వరకు ఎక్కడో జరిగే వార్ ఎఫెక్ట్ చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయని మన లెక్క. కానీ కనపడకుండా రొయ్య, కోడిగుడ్డు, చేప ఇలా ప్రతీ ఒక్కటి ఎఫెక్ట్ అవుతాయి. అసలు ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.

గల్ఫ్ దేశాలకు " రైస్ బౌల్” గా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఊహించని దెబ్బ కొట్టింది. ఇక్కడి నుండి ఎక్స్పోర్ట్ అయ్యే బియ్యం, రొయ్యలు, గుడ్లు మరియు పండ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వేల కోట్ల రూపాయల వ్యాపారంపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రంగం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలకు గల్ఫ్ మరియు యూరోప్ దేశాలు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ధరల పతనం కారణంగా.. యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో, లోకల్ మార్కెట్ లో రొయ్యల ధర కేజీకి 40 నుండి 60 రూపాయల వరకు పడిపోయింది.

ఎర్ర సముద్రం మార్గంలో దాడుల భయంతో షిప్పింగ్ కంపెనీలు తమ ట్రాన్స్పోర్ట్ నిలిపివేశాయి. దీనివల్ల ఏపీ రేవుల్లో సుమారు 2,500 కోట్ల రూపాయల విలువైన ఆక్వా ఉత్పత్తులు నిలిచిపోయాయి. అలాగే గుడ్డు ధర భారీగా పడిపోతుంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుండి గల్ఫ్ దేశాలకు రోజూ లక్షలాది గుడ్లు ఎగుమతి అవుతాయి. యుద్ధం వల్ల విమాన, నౌకాయాన సర్వీసులు దెబ్బతినడంతో ఎగుమతులు 70% తగ్గాయి. దీనితో.. ఎగుమతి కావాల్సిన గుడ్లన్నీ లోకల్ ఎగ్ మార్కెట్ కు తిరిగి రావడంతో.. గుడ్డు ధర.. ఉత్పత్తి వ్యయం కంటే దారుణంగా పడిపోయింది. 3.50 నుంచి 4.00 రూపాయలు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.

అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యానవన పంటలు భారీగా ఎఫెక్ట్ అయ్యాయి. రాయలసీమలో అనంతపురం, కడప నుండి అరటి, దానిమ్మ, చీని కాయలు భారీగా దుబాయ్, ఖతార్ వంటి దేశాలకు వెళ్తుంటాయి. దీని కారణంగా ఈ రైతులు భారీగా నష్టపోతున్నారు. గతంలో టన్ను అరటి 20 వేల రూపాయలు పలికితే, ఇప్పుడు అది 8,000 నుండి 10,000కి పడిపోయింది. రవాణా సౌకర్యాలు లేక కోతకు సిద్ధంగా ఉన్న పండ్లు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి. అలాగే, తెలంగాణ, ఆంధ్రా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 40% వరకు తగ్గాయి.

వార్ ఎఫెక్ట్ తో షిప్పింగ్ కంపెనీలు 'వార్ రిస్క్ సర్ఛార్జ్' పేరుతో కంటైనర్ ధరలను 3 రెట్లు పెంచేశాయి. దీనివల్ల ఎగుమతిదారులు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు. మన దేశానికి కావాల్సిన, యూరియా, పొటాష్ వంటి ఎరువులు అధికంగా ఇరాన్, పరిసర దేశాల నుండి దిగుమతి అవుతాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే, రాబోయే సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడి ధరలు పిచ్చ పిచ్చగా పెరిగే అవకాశం ఉంది.

Published : 
  • 11 March 2026, 9:23 AM IST