Top Story: ఇలా ఆడితే కష్టమే… కప్పు కొట్టాలంటే ఇండియా…ఈ లోపాలు సరిదిద్దుకోవాల్సిందే…!

కొన్ని గంటల్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. సూపర్ 8 వరకు ఒక్క మ్యాచ్ మినహా అన్ని గెలుచుకుంటూ వచ్చిన ఇండియా,ఎందుకో తడబడుతుంది.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 8:30 PM IST

కొన్ని గంటల్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. సూపర్ 8 వరకు ఒక్క మ్యాచ్ మినహా అన్ని గెలుచుకుంటూ వచ్చిన ఇండియా,ఎందుకో తడబడుతుంది. మ్యాచ్ లన్ని కింద మీద పడి గెలుస్తుంది తప్ప.... కొన్ని లోపాలు టీం ని వెంటాడుతూనే ఉన్నాయి. అవి కనక ఇప్పుడు సరిదిద్దుకోకపోతే... కప్పు కొట్టడం చాలా కష్టం.గ్రూప్ దశలో భారత్ బాగా ఆడినా, లోపాలు అనేకం వెంటాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్ శర్మ ఒక్క మ్యాచ్‌లో బాగా ఆడినా, మిగతా వాటిలో తేలిపోయాడు.

ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించినా, వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పర్వాలేదనిపిస్తున్నా, హార్ధిక్ పాండ్యా మరింత బాగా ఆడాల్సి వుంది. ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌, మరో బౌలర్ విల్ జాక్స్ నుంచి భారత బ్యాటర్లకు ముప్పు తప్పదు. సంజూ శాంసన్ పుంజుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

తిలక్ వర్మ మరో ప్లస్ పాయింట్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విషయంలో ఇంకా తడబడుతూనే ఉన్నాం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బలమైన పునాది వేయగలిగితే, మొదటి 10 ఓవర్లు నిలబడి ఆడగలిగితే.... ఇక మన వాళ్ళని కొట్టేవాళ్ళు ఉండరు. శివం దుబే ఆడించాలో అర్థం కాని పరిస్థితి. బౌలింగ్లో శివం దూబే ఏ రకంగాను ఉపయోగపడటం లేదు. అతని బదులు రింకు సింగ్, కుల్దీప్ అయితే బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. శివం దుబే బ్యాటింగ్ జట్టుకి ఉపయోగపడటం లేదు. బౌలింగ్ అంతంత మాత్రమే. ఇక వరుణ్ చక్రవర్తి విపరీతంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. డెత్ ఓవర్స్ బౌలింగ్ విషయంలో కూడా భారత్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

ఇక రెగ్యులర్ బౌలింగ్ కూడా ఉండాల్సినంత బలంగా లేదు. బుమ్రా పవర్‌ప్లేలో కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్‌ వేయాలి....జోష్‌ బట్లర్‌, ఫిల్‌ సాల్ట్‌, హ్యారీ బ్రూక్‌ వికెట్లను మ్యాచ్‌ ప్రారంభంలో తీయగలిగితే ఇంగ్లాండ్‌ వెన్ను విరిచినట్టు అవుతుంది. మన ఫీల్డింగ్ కూడా చాలా ఘోరంగా తయారైంది. ఈజీ క్యాచ్‌లను కూడా జారవిడుస్తున్నారని విండీస్‌ మ్యాచ్‌లోనే అర్థమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 క్యాచ్ లు వదిలేసారు. అందులో ఒక ఐదు మరీ సిల్లీ క్యాచ్లు కూడా.
మొత్తానికి ముంబై వాంఖడే స్టేడియం లో జరిగే ఇండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్‌ పోరు హోరాహోరిగా సాగడం ఖాయంగా .బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండూ జట్లూ బలంగా కనిపిస్తుండటంతో, సెమీఫైనల్ కచ్చితంగా హై టెన్షన్ మ్యాచ్ అవుతుంది.

Published : 
  • 4 March 2026, 8:30 PM IST