బౌలర్లు, బ్యాటర్ల ఫ్లాప్ షో ….సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తు…!

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అహ్మదాబాద్ పిచ్.. ప్రత్యర్థి కెప్టెన్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. సౌతాఫ్రికా 187 పరుగులే చేయడంతో భారత్ విజయం ఖాయమని డిసైడపోయారు..

Post Published By: dialnews
Updated : 23 February 2026, 5:07 PM IST

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అహ్మదాబాద్ పిచ్.. ప్రత్యర్థి కెప్టెన్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. సౌతాఫ్రికా 187 పరుగులే చేయడంతో భారత్ విజయం ఖాయమని డిసైడపోయారు... కట్ చేస్తే పవర్ ప్లేలోనే ముగ్గురు ఔట్.. 100 లోపే 8 వికెట్లు... వెరసి 2024 వరల్ కప్ ఫైనల్ ఓటమికి సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకోగా.. భారత్ సెమీస్ రేసులో వెనుకబడింది.టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గ్రూప్ స్టేజ్‌లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా సూపర్ 8 రౌండ్‌ను ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్ , బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ నిరాశపరిచింది. ఫలితంగా సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఛేజింగ్ పిచ్‌పై పవర్ ప్లేలోనే ముగ్గురు సఫారీ బ్యాటర్లు ఔటయ్యారు.

ఈ నేపథ్యంలో కనీసం 150 పరుగులైనా స్కోరు చేస్తుందా అనుకున్నారు. అయితే డేవిడ్ మిల్లర్, బ్రెవిస్ సఫారీ ఇన్నింగ్స్ ను మలుపు తిప్పారు. వీరి జోడీ నాలు గో వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు జోడించింది. బ్రెవిస్ 29 బంతు ల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు భారీ షాట్ల తో విరుచుకుపడ్డ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులకు వెనుదిరిగాడు.తర్వాత స్టబ్స్ కూడా భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టబ్స్ 24 బంతుల్లో 44 సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో బు మ్రా 3, అర్షదీప్ 2, వరుణ్ చక్రవర్తి 1, దూబే 1 వికెట్ తీశారు. ఛేజింగ్‌లో ఇషాన్ కిషన్ డకౌటవగా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా పవర్ ప్లేలోనే ఔటయ్యారు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.తర్వాత శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా ఏదైనా విధ్వంసం సృష్టిస్తారేమోనని అభిమానులు ఎదురుచూసారు. దానికి తగ్గట్టే హార్థిక్ ఒక సిక్సర్ కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించాడు. కానీ సౌతాఫ్రికా బౌలర్ల వ్యూహం ఫలించి ఒత్తిడి పెరిగింది. దీంతో హార్థిక్ వేగంగా ఆడే క్రమంలో ఔటవగా.. రింకూ సింగ్ డకౌటయ్యాడు. చివరికి భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యెన్సన్ 4 , కేశవ్ మహారాజ్ 3 ,కార్బిన్ బోస్చ్ 2 వికెట్లు తీశారు.

Published : 
  • 23 February 2026, 5:07 PM IST