ఓపెనర్ ఎవరు…? కపిల్ సపోర్ట్ అతడికేనా…?

ఒక కుర్రాడు వరుసగా డకౌట్ అవుతుంటే.. విమర్శకులు అతన్ని జట్టు నుంచి తీసేయమంటున్నారు. కానీ, భారత క్రికెట్ చరిత్రను మార్చిన ఒక లెజెండ్ మాత్రం, 'అతన్ని ఆడించాల్సిందే' అని గట్టిగా చెప్తున్నారు.

Post Published By: dialnews
Updated : 7 March 2026, 5:53 PM IST

ఒక కుర్రాడు వరుసగా డకౌట్ అవుతుంటే.. విమర్శకులు అతన్ని జట్టు నుంచి తీసేయమంటున్నారు. కానీ, భారత క్రికెట్ చరిత్రను మార్చిన ఒక లెజెండ్ మాత్రం, 'అతన్ని ఆడించాల్సిందే' అని గట్టిగా చెప్తున్నారు. ఆ లెజెండ్ ఎవరో కాదు, కపిల్ దేవ్. 2026 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 'డకౌట్' అయ్యాడు. సెమీఫైనల్ వరకు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో, మాజీ క్రికెటర్లలో "అభిషేక్ బదులు రింకూ సింగ్‌ను తీసుకోవాలి" అనే డిమాండ్ పెరిగింది.

ఢిల్లీలో జరిగిన ఒక గోల్ఫ్ ఈవెంట్‌లో కపిల్ దేవ్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మకు పూర్తి మద్దతు ప్రకటించారు. జట్టు యాజమాన్యం ఆటగాడిని నమ్మాలి. అన్నిటికంటే ముఖ్యంగా అభిషేక్ తనను తాను నమ్మాలి.""నేను ఆడగలను, ఆడతాను అని అతనికి ఆ నమ్మకం ఉండాలి.""ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్ చాలు, హీరో అవ్వడానికి అని భుజం తట్టాడు. అభిషేక్ శర్మకు మొదటి బంతి నుంచే సిక్సర్లు కొట్టే సత్తా ఉందని, అది టీమిండియాకు అతిపెద్ద బలం అని కపిల్ నమ్ముతున్నారు.

1983లో తను ఎలాగైతే అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశారో, అభిషేక్ కూడా ఫైనల్‌లో అలాగే చెలరేగుతాడని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కపిల్ దేవ్ మాత్రమే కాదు, రవిశాస్త్రి కూడా అభిషేక్‌కు మద్దతుగా నిలిచారు. "తను తన బెస్ట్ ఇన్నింగ్స్‌ను ఫైనల్ కోసం దాచిపెట్టాడు" అని వారు నమ్ముతున్నారు. ఒక లెజెండరీ కెప్టెన్ నుంచి ఇలాంటి మద్దతు రావడం వల్ల అభిషేక్ శర్మ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది కేవలం ఆట గురించి కాదు, ఒక సీనియర్ తన జూనియర్‌కు ఇచ్చే 'నైతిక బలం'. కపిల్ దేవ్ చెప్పినట్టు, ఒక్క గొప్ప ఇన్నింగ్స్ మొత్తం కెరీర్‌ను మార్చేస్తుంది.

Published : 
  • 7 March 2026, 5:53 PM IST