PBKS Vs RCB: విరాట్ వర్సెస్ ధావన్.. నేడు మొహాలీలో పరుగుల బిజిలీ

గురువారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో ఇది 27వ మ్యాచ్. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు చెన్నైతో తలపడింది.

Post Published By: narender Thiru
Updated : 20 April 2023, 11:51 AM IST

PBKS Vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో గురువారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో ఇది 27వ మ్యాచ్. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు చెన్నైతో తలపడింది.

ఈ మ్యాచులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఫాఫ్ డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు అద్భుత ప్రదర్శనతో 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరికి బెంగళూరు అతి తక్కువ తేడాతో టార్గెట్‌ని రీచ్ కాలేక ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి పుంజుకోవడానికి ఆర్సీబి ఆసక్తి చూపుతోంది.

మరోవైపు, పంజాబ్ కింగ్స్ మునుపటి మ్యాచ్‌లో తమ కెప్టెన్ ధావన్ లేనప్పటికీ లక్నో జట్టును ఓడించి ఆకట్టుకుంది. సికందర్ రజా, కెప్టెన్ సామ్ కరన్‌లు జట్టుకు విజయం చేకూర్చారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి మరో మంచి ప్రదర్శన కనబర్చాలని పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇది ​​ఉత్కంఠభరితమైన మ్యాచ్ కావాలి అని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

 

Published : 
  • 20 April 2023, 11:51 AM IST