T20 ప్రపంచ కప్ 2026. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ పోరు జరగబోతోంది. సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్, సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీలో సూర్య తన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. గంభీర్ కోచింగ్‌లో టీమ్ అగ్రెసివ్‌గా ఉంది. ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ప్రకారం.. అభిషేక్ ఫామ్‌లో లేనందున, ఫైనల్‌లో రింకూ సింగ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు.
బుమ్రా, పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు టీమ్ ఇండియాకు ప్రధాన ఆయుధాలు. ఇక, సాంట్నర్ కెప్టెన్సీలో కివీస్ చాలా ప్రశాంతంగా, పక్కా ప్లాన్‌తో ఆడుతోంది. ఈ టోర్నీలో అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఊపుమీదున్నాడు. అతన్ని త్వరగా అవుట్ చేయడం భారత్‌కు కీలకం. కివీస్ జట్టులో డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్ వంటి బలమైన ఆల్ రౌండర్లు ఉన్నారు.
అహ్మదాబాద్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. హర్షా భోగ్లే, ఆకాష్ చోప్రా వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. "ఇది కేవలం బ్యాట్ vs బాల్ పోరు మాత్రమే కాదు, ఇది మైండ్ గేమ్. భారత్ ఫేవరెట్ అయినప్పటికీ, ఒత్తిడిని జయించే విషయంలో న్యూజిలాండ్ ఎప్పుడూ ప్రమాదకరమే.