Top story; మీతో డీల్ కోసం రష్యాను వదులుకోం.. ట్రంప్‌కు జైశంకర్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ…!

అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాటల్లోని అంశాలే మోడీ సర్కార్ తేల్చుకోవాల్సిన లెక్కలు. మొత్తం ఐదు అంశాలున్నాయి.

Post Published By: dialnews
Updated : 6 February 2026, 1:07 PM IST

అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాటల్లోని అంశాలే మోడీ సర్కార్ తేల్చుకోవాల్సిన లెక్కలు. మొత్తం ఐదు అంశాలున్నాయి. వాటిలో మొదటిది అధ్యక్షుడు ట్రంప్ తన ప్రకటనలో భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తుందని చెప్పడం. దీనిపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. భారత రిఫైనరీలకు చమురు సరఫరాపై ఎటువంటి ఆదేశాలు అందలేదని నివేదికలు చెబుతున్నాయి. అటు రష్యా కూడా భారత్ చమురు కొనుగోళ్లను ఆపేస్తున్నట్టు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం మిత్ర దేశాన్ని పక్కనపెడితే మోడీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వస్తాయి. సో.. మ్యాగ్జిమం ఆ సాహసం చేయకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ట్రంప్ కార్యవర్గాన్ని జైశంకర్ ఎలా ఒప్పిస్తారు అన్నది అసలు ప్రశ్న. ఇక రెండోది సున్నా టారిఫ్స్. తమ వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలను సున్నాకు తగ్గిస్తుందని ట్రంప్ చెప్పాడు. కానీ, భారత్‌పై 18శాతం సుంకాలు కొనసాగిస్తూ తమ వస్తువులపై జీరో టారిఫ్స్ అంటే ఎలా కుదురుతుంది? ఒకవేళ అందుకు మోడీ ప్రభుత్వం ఓకే చెబితే ఈ డీల్‌పై విమర్శలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలోనూ అగ్రరాజ్యంతో తేల్చుకోవాల్సిందే.

యాంకర్: ఇక మూడో అంశం 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల లక్ష్యం. వచ్చే కొద్ది కాలంలో భారత్ తమ నుండి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని అమెరికా పేర్కొంది. ప్రస్తుతం భారత్-అమెరికా వార్షిక వాణిజ్యం 140 బిలియన్ డాలర్ల లోపే ఉంది. ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కాలపరిమితి ఎంత? అనేది తెలియాల్సి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆపేసి అమెరికా, వెనిజులా నుంచి కొనుగోలు చేసినా అది అసాధ్యం. నిజానికి.. ఏటా విదేశాల నుంచి మన దిగుమతుల విలువ 900 బిలియన్ డాలర్లమేర ఉంటుంది. అందులో 500 బిలియన్ డాలర్లు అంటే సగానికి పైగా అమెరికా నుంచే చేసుకోవాలని చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదు. సో.. ఈ విషయంలో క్లారిటీ వస్తేనే ట్రేడ్ డీల్ ఫైనల్ అవుతుంది. ఇక నాలుగో అంశం మేధో సంపత్తి హక్కులు, డేటా చట్టాలు. అమెరికా సంస్థలు భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలంటే కఠినమైన మేధో సంపత్తి హక్కుల రక్షణ కోరుతున్నాయి. దీనివల్ల భారతీయ ఔషధ రంగానికి, ముఖ్యంగా తక్కువ ధరలో దొరికే జెనరిక్ మందులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ లక్కలు కూడా తేల్చువాల్సిందే. చివరిదైన అసలు పాయింట్ వ్యవసాయ ఉత్పత్తులు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో అన్నింటికంటే క్లిష్టమైనది, సున్నితమైనది వ్యవసాయ రంగం. భారత్‌లో దాదాపు 50శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉండటంతో, ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అమెరికా తన పౌల్ట్రీ, పాడి ఉత్పత్తులు, ధాన్యాలకు భారత మార్కెట్‌లో పెద్దపీట వేయాలని కోరుతోంది. అమెరికా నుండి తక్కువ ధరకే చికెన్ లెగ్స్ లేదా పాల ఉత్పత్తులు భారత్‌లోకి వస్తే, స్థానిక రైతులు, డైరీ ఫారాలు తీవ్రంగా నష్టపోతాయి. అమెరికాలో వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు చాలా ఎక్కువ, అందుకే వారి ధరలతో మన రైతులు పోటీ పడలేరు. అమెరికాలో ఆవులకు మేతగా 'రక్తం, మాంసం' కలిపిన మిశ్రమాన్ని ఇస్తుంటారు. భారత్ దీన్ని అంగీకరించదు. భారత్ తన రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర, ఉచిత విద్యుత్ వంటివి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని అమెరికా అంటుంది. అమెరికా తన కార్పొరేట్ రైతులకు వేల కోట్ల డాలర్ల సబ్సిడీలు ఇస్తూ, పేద రైతులున్న భారత్‌ను ప్రశ్నించడం ఏంటని భారత్ వాదిస్తోంది. ఈ విషయంలో తేల్చుకోవాల్సనవి చాలానే ఉన్నాయి. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. వ్యవసాయ, పాడి రంగానికి పూర్తి రక్షణ ఉంటుందని తేల్చి చెప్పారు కూడా. ఈ క్రమంలోనే తాజా డీల్‌పై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు.

అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ చాలావరకు టారిఫ్స్ తగ్గించనుందని గ్రీర్ తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని దిగుమతులపై ఈ ఒప్పందంలో భారత్‌కు కొంత నియంత్రణ, మినహాయింపులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆ దిగుమతులేంటి అనేవి నిర్ణయించేందుకు కలిసి పని చేస్తున్నామని చెప్పారు. అంటే.. ఇరుదేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లకు సంబంధించిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదన్నమాట. ఈ విషయంలో జైశంకర్ కీలక చర్చ జరిపి ఉండొచ్చు. ఇలా చాలా విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవడం, ఇవ్వడం జైశంకర్ అమెరికా పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. మార్కో రూబియో, స్కాట్ బెసెంట్‌తో సమావేశాల్లో ఇప్పటికే ఈ విషయాలపై చర్చించి ఉంటారని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిక్కుముడులు విప్పడంలో విజయంసాధిస్తే హిస్టారికల్ డీల్ ఫైనల్ అయినట్టే. వీటిలో ఏ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోయినా కథ మొదటికొచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

 

Published : 
  • 6 February 2026, 1:07 PM IST