మరో ఎన్టీఆర్.. మరో ప్రభాస్.. లేదంటే మరో రామ్ చరణ్..?

పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసింది కన్నడ స్టార్ యష్... తర్వాత బన్నీ, ఆతర్వాత త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్.

Post Published By: dialnews
Updated : 7 February 2026, 4:36 PM IST

పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసింది కన్నడ స్టార్ యష్... తర్వాత బన్నీ, ఆతర్వాత త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్. మధ్యలో కాంతారాతో రిషబ్ షెట్టి కూడా దుమ్ముదులిపాడు.. కాకపోతే అది డివోషనల్ డ్రామా.. కాబట్టే మాస్ హీరోలుగా ఎన్టీఆర్, ప్రభాస్ లు దూసుకెళుతుంటే, బన్నీ అదే వేగాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.. చరన్ మాత్రం బొక్కబోర్లా పడ్డాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఎన్టీఆర్ కి వార్ 2 తో కలిసిరాకున్నా, పాన్ ఇండియా లెవల్లో తన ఇమేజ్ కి ఢోకా లేదు. ఎందుకంటే డ్రాగన్ కి ప్రీరిలీజ్ బిజినెస్ ఆఫర్స్ చూస్తుంటే, అదే 500 కోట్లు మించేలా ఉంది. ప్రభాస్ అయితే ఫ్లాపులు, హిట్లకు అతీతుడైపోయాడు. ఎటొచ్చి బన్నీ అండ్ కో మాత్రమే పాన్ ఇండియా లెవల్లో స్థిరంగా మార్కెట్ ని షేక్ చేసే సీన్ ఎంత అని పరీక్షించుకుంటున్నారు. అందులో టాక్సిక్ తో యష్ కూడా చేరాడు.. ఇక్కడ సమస్య ఏంటంటే, తను ప్రభాస్, ఎన్టీఆర్ లా గెలిచి మార్కెట్ లో నిలుస్తాడా? చరణ్ లా ఓడి దాడి లో వెనకబడతాడా? టాక్సిక్ టీజర్ ప్రీరిలీజ్ బిజినెస్ తోపాటు వస్తున్న హైప్ తో ఏం తేలింది?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో రెండు హిట్లు కొట్టి ఉండొచ్చు.. పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ తో పోలిస్తే రెండంటే తక్కువే. ఎందుకంటే ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు రెబల్ స్టార్ ఎకౌంట్లో పడ్డాయి.. కాని ఇక్కడ ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ దే పై చేయి అయ్యింది. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటమే కాదు, త్రిబుల్ ఆర్ తర్వాత దేవర హిట్ తో నార్త్ లో చాలా ఈజీగా మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ సాహోతో పర్లేదనిపించి మల్లీ హిట్ కొట్టేందుకు సలార్, కల్కీ వరకు వేయిట్ చేయాల్సి వచ్చింది. సో పాన్ ఇండియా లెవల్లో పెద్ద దర్శకుల సాయం లేకుండా సోలోగా ఏదైనా చేయగలం అనిపించుకుంది మాత్రం ఎన్టీఆర్, ప్రభాసే.. ఇంకా బన్నీ ప్రూవ్ చేసుకోలేదు. కేవలం పుష్ఫరాజ్ గా సుకుమార్ పుణ్యామాని రెండు పాన్ ఇండియా హిట్లు వచ్చాయి.

తన సాయం లేకుండా మరో దర్శకుడి తో పాన్ ఇండియాని షేక్ చేస్తేనే బన్నీ కూడా ఎన్టీఆర్, ప్రభాస్ కేటగిరిలో చేరుతాడు. ఈవిషయంలో రామ్ చరణ్ మాత్రం బొక్కబోర్లా పడ్డాడు.త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి దేవర హిట్టైంది. కాని అదే త్రిబుల్ ఆర్ చేసిన చరణ్ కి మాత్రం ఆచార్య షాక్ ఇచ్చింది. గేమ్ ఛేంజ్ డిజాస్టర్ ఆఫ్ ద ఇయర్ గా మారింది.ఇప్పుడొస్తున్న పెద్ది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందనేంత అంచనాలు లేవు. కనీసం చరణ్ ని గట్టెక్కిస్తే చాలనేంతగా పరిస్థితి మారింది.. ఇప్పుడు ఈ హీరోలందరి తో పోలికలు, ఈ చర్చకి కారణం కన్నడ స్టార్ యష్ . తను కూడా కేజీయఫ్ రెండు భాగాలతో ప్రశాంత్ నీల్ పుణ్యామాని పాన్ ఇండియాని షేక్ చేశాడు. ఇప్పుడు మరో దర్శకురాలు సాయంతో టాక్సిక్ మూవీ చేస్తున్నాడు.ఇది పాన్ ఇండియాని షేక్ చేస్తేనే ఎన్టీఆర్, ప్రభాస్ కేటగిరిలోకి యష్ చేరే ఛాన్స్ఉంది. కాకపోతే ఈ సినిమా తెలుగు రైట్స్ ని 120 కోట్లు పెట్టి దిల్ రాజు కొనటం చూస్తుంటే, ఇది ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వెయ్యికోట్ల వరదకి ఛాన్స్ఉన్నట్టే. దిల్ రాజు టేస్ట్ మీద నమ్మకంతో పాటు 120 కోట్ల రైట్స్ కేవలం తెలుగు ఏరియాకే అంటే చాలా పెద్ద న్యూసే...

Published : 
  • 7 February 2026, 4:36 PM IST