కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు.. విచారణకు టైమ్ కావాలన్న ‘మా’ అధ్యక్షుడు..!

ఈ మధ్య మంచు కుటుంబంలో వివాదాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు మంచు మోహన్ బాబు, విష్ణు. తిరుపతిలోని ప్రముఖ మోహన్ బాబు యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారం

Post Published By: dialnews
Updated : 9 February 2026, 9:15 AM IST

ఈ మధ్య మంచు కుటుంబంలో వివాదాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు మంచు మోహన్ బాబు, విష్ణు. తిరుపతిలోని ప్రముఖ మోహన్ బాబు యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫీజుల విషయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకునే క్రమంలో జరిగినట్లు చెబుతున్న ఈ కిడ్నాప్ కేసులో.. యూనివర్సిటీ సీఈవో, సినీ నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయనను మూడో నిందితుడిగా అంటే A-3గా చేర్చిన పోలీసులు, ఈ నెల 5న 41A నోటీసులు ఇచ్చి, మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. అసలు ఈ వివాదానికి మూలం యూనివర్సిటీలో ఫీజుల పెంపు, ఇతర అడ్మినిస్ట్రేషన్ పరమైన సమస్యలే అని తెలుస్తోంది.

దీనిపై ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను కొంతమంది కారులో ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా పెను దుమారం రేపింది. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అంటే A-1 అయిన వర్సిటీ పీఆర్వో సతీష్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నోటీసులపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఆయన పోలీసులను కోరినట్లు సమాచారం. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానని ఆయన రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారు? ఆయనకు సమయం ఇస్తారా లేక మళ్లీ నోటీసులు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఇదే కేసులో మోహన్ బాబు పేరును A-2గా చేర్చినప్పటికీ.. ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని సమాచారం. కేవలం విష్ణుకు మాత్రమే నోటీసులు రావడం, మిగిలిన వారి అరెస్టులు జరుగుతుండటంతో ఈ కేసు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యూనివర్సిటీ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. మొత్తానికి తిరుపతి కేంద్రంగా మొదలైన ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి 15 తర్వాత మంచు విష్ణు విచారణకు హాజరైతే, ఆయన పోలీసులకు ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది ఉత్కంఠగా మారింది. అటు పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో వేచి చూడాలి.

Published : 
  • 9 February 2026, 9:15 AM IST