1000 కోట్ల OPENINGS.. 1359 కోట్ల గ్యాంబ్లింగ్..?

వారణాసి మూవీకి వెయ్యికోట్ల ఓపెనింగ్స్ వస్తే ఎలా ఉంటుందనే, అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. 1300కోట్ల బడ్జెట్ ని మొదటి రోజే ఓపెనింగ్స్ తో వారణాసి రాబడుతుందనుకుంటే, ఈలోపే ఓటీటీ రైట్స్ రూపంలో వెయ్యికోట్ల రికార్డు కన్ఫామ చేసింది.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 7:50 PM IST

వారణాసి మూవీకి వెయ్యికోట్ల ఓపెనింగ్స్ వస్తే ఎలా ఉంటుందనే, అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. 1300కోట్ల బడ్జెట్ ని మొదటి రోజే ఓపెనింగ్స్ తో వారణాసి రాబడుతుందనుకుంటే, ఈలోపే ఓటీటీ రైట్స్ రూపంలో వెయ్యికోట్ల రికార్డు కన్ఫామ చేసింది. కేవలం అఫీషియల్ ఎనౌన్స్ మెంటే మిగిలింది.. ఇలాంటి టైంలో సడన్ గా ఈ సినిమా బడ్జెట్ 1500 కోట్లో, అన్ లిమిటెడ్ బడ్జెట్టో కాదు, 1359 కోట్లనే నెంబర్ బయటికొచ్చింది.. కట్ చేస్తే వారణాసికి వరల్డ్ వైడ్ గా 150 కోట్ల నెట్ వసూళ్లు ఓపెనింగ్స్ గా వస్తాయనే మాట,తూటా లా పేలుతోంది.. ఇదే నిజంగా షాకింగ్ న్యూస్.. పాన్ వరల్డ్ లెవల్లో మన సినిమా విడుదలౌతోంది.. 55 వేల థియేటర్స్ లో వారణాసి దుమ్ముదులిపుతుందనుకుంటే, సడన్ గా 150 కోట్ల షేర్ ఓపెనింగ్సే వస్తాయనటం చూస్తుంటే, ఇదో బిగ్ బ్రేకింగ్ కాదు షాకింగ్ న్యూస్...ఇదే మింగుడు పడని విషయం అనుకుంటే, దీనికి తోడు, ఈమూవీని 1359 కోట్ల గ్లాంబ్లింగ్ అంటున్నారు.. దానర్ధం ఏంటి? హాలీవుడ్ రిపోర్టర్లకు ఇంటర్వూలిచ్చి రాజమౌళి నిజంగా వారణాసి మూవీ క్రేజ్ ని పలుచన చేస్తున్నాడా?

వారణాసి మూవీ మీద రాజమౌలి, మహేశ్ బాబుకి ఎంతగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో కాని... అందుకు వందల, వేల రెట్లు అంచనాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకున్నాయి.. ఎంతసేపు హాలీవుడ్ సినిమాలు మన మార్కెట్ ని శాసించటమే కాని, మన సినిమాలేవి వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసిన దాఖలాల్లేవు.. అలాంటి వండరే వారణాసి మూవీతో సాధ్యం కాబోతోందని అంతా ఆశపడుతున్నారు.అయితే ఇలాంటి టైంలో వారణాసి బడ్జెట్ లెక్కలు షాక్ ఇస్తున్నాయి.. దాంతో పాటు మరో అంచనా ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది. ఇక బడ్జెట్ విసయానికొస్తే, భారీ పెట్టుబడితో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే అయినప్పటికీ, ఈ మూవీ బడ్జెట్ 1300 కోట్లు కాదు, 1500 కోట్లు అంతకంటే కాదు... అన్ లిమిటెడ్ బడ్జెట్ అని నిర్మాత అన్నాడు.

తీరాచూస్తే వారనాసి అసలు బడ్జెట్ 150 మిలియన్లని జక్కన్నే తేల్చాడు. దాన్ని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే, 1359 కోట్లని తెలుస్తోంది. అంటే ప్రియాంక చోప్రా చెప్పింది నిజమని తేలింది. ఇది అసలు సమస్యే కాదు... 1359 కోట్లతో వారణాసి వస్తోందంటే, వరల్డ్ వైడ్ గా అదేం చిన్న నెంబర్ కాదు. కాని ఓపెనింగ్స్ 1000 కోట్లొస్తాయని అంచనా వేస్తుంటే, 150 కోట్ల షేర్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ గా వస్తాయనటమే షాక్ ఇస్తోంది.వారణాసి ఓటీటీ రైట్సే 1000 కోట్లు దాటుతున్న వేల, 1000 కోట్ల ఓపెనింగ్స్ అంచనాలు తప్పుకాదు.. కాని 150 కోట్ల ఓపెనింగ్సే వస్తాయనటం ఖచ్చితంగా నెగెటివ్ ప్రచారమే.

ఔను 55 వేల థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోయే సినిమా, అందులోనూ వందకోట్ల మందిని రీచ్ అవటమే టార్గెట్ గా పెట్టుకున్న మూవీకి, మొదటి రోజు ఓపెనింగ్స్ 150 కోట్లు వస్తాయనటం షాకింగ్ గా ఉంది.ఎందుకంటే, బాహుబలి, త్రిబుల్ ఆర్ తోనే 200 కోట్ల పైనే ఓపెనింగ్స్ ని రుచి చూశాడు రాజమౌళి. పాన్ ఇండియాతోనే ఆ నెంబర్ ని చూసేసిన రాజమౌళికి, పాన్ వరల్డ్ మూవీ కి 150 కోట్లే ఓపెనింగ్స్ గా వస్తాయంటే నమ్మశక్యంగా లేదు. దీనికి తోడు వారణాసి 1359 కోట్ల గ్యాంబ్లింగ్ అని కూడా నేషనల్ మీడియా అంటోంది... అంతా లోకల్, నేషనల్ మీడియాను కాదని, అమెరికన్ రిపోర్టర్లకు రాజమౌళి హై ప్రయారిటీ ఇవ్వటం వల్లే, ఈ నెగెటివ్ టాక్ ఎటాక్ కి కారణం అంటున్నారు.

Published : 
  • 16 February 2026, 7:50 PM IST