దూబే ధనాధన్… నెదర్లాండ్స్ పై భారత్ విజయం…!

టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ ను భారత్ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి సూపర్ 8 స్టేజ్ కు ముందు ఓటమి లేకుండా ఫుల్ జోష్ తో సిద్ధమైంది.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 12:17 PM IST

టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ ను భారత్ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి సూపర్ 8 స్టేజ్ కు ముందు ఓటమి లేకుండా ఫుల్ జోష్ తో సిద్ధమైంది. చివరి మ్యాచ్ లో మాత్రం నెదర్లాండ్స్ అనుకున్న దానికంటే భారత్ కు గట్టిపోటీనే ఇచ్చింది. మొదట బౌలింగ్ లో వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచింది. తర్వాత ఛేజింగ్ లో కొద్దిసేపు మెరుపులు మెరిపించగా భారత్ బౌలర్లు చివర్లో కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో ఊహించినట్టుగానే రెండు మార్పులు జరిగాయి. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు రెస్ట్ ఇచ్చి అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభిషేక్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో కూడా డకౌటయ్యాడు. ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ పర్వాలేదనిపిస్తే సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడలేకపోయాడు.

ఈ దశలో శివమ్ దూబే జట్టును ఆదుకున్నాడు. విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా కూడా 3 భారీ సిక్స్‌లు భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఈ రెండు భాగస్వామ్యాలు ఈ మ్యాచ్‌లో కీలకంగా మారాయి. కాగా శివమ్ దూబే ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లున్నాయి. దూబే మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో వెనుదిరిగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది.

తర్వాత ఛేజింగ్ లో నెదర్లాండ్స్ కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వికెట్లు కోల్పోతున్నా భారీ షాట్లు ఆడుతూ కాసేపు అలరించాడు. లీడ్ , కాచెట్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినప్పటకీ నెదర్లాండ్స్ పూర్తి ఓవర్లు ఎటాకింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా 19వ ఓవర్లో హార్థిక్ పాండ్యాను నెదర్లాండ్స్ బ్యాటర్ నోత్ కోర్స్ ఉతికారేశాడు. అయితే అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో నెదర్లాండ్స్ 7 వికెట్లకు 176 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు.

Published : 
  • 19 February 2026, 12:17 PM IST