పాన్ ఇండియా ఇమేజ్ లో ఇరుక్కుంటే, బయట పడటం అంత తేలిక కాదు. బాహుబలి తర్వాత హిట్ కోసం ప్రభాస్ చాలా నిద్రలేని రాత్రులే గడిపాడు.. తర్వాతే కల్కీ, సలార్ లాంటి హిట్లు పడ్డాయి... రామ్ చరణ్ ఇంకా త్రిబుల్ ఆర్ తర్వాత హిట్ కోసం, పరిక్షలు రాస్తూనే ఉన్నాడు.. హిట్ కోసం గాయాలతోనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కట్ చేస్తే ఇలాంటి ఇబ్బందుల్లేకుండా బయట పడింది మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే. రాజమౌళి లాంటి దర్శకుడితో త్రిబుల్ ఆర్ లాంటి హిట్ పడ్డాక, ఏ మూవీ చేసినా హిట్ మెట్టెక్కడం కష్టం. ఆరేంజ్ లో రాజమౌళి తన హీరోల రేంజ్ పెంచేస్తాడు.. ఆ స్తాయిని మించేలా తర్వాత సినిమాలు లేక, రాకే అంతా ఫ్లాపులతో డీలా పడటం కామనైంది.. అలాంటి కామన్ జర్నీలోంచి దేవరగా సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బయట పడ్డాడు ఎన్టీఆర్.. కాని తన దారిలో నడివబోయి మరో పాన్ ఇండియా హీరో బొక్కబోర్లా పడేలా ఉన్నాడా? టాక్సిక్ గ్లింప్స్ అదిరింది.. టాక్సిక్ మూవీ టీజర్ పేలింది.. కాని ఎన్టీఆర్ కి దక్కిన అద్రుష్టం హీరో యష్ కి దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.. ఎందుకు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగానే పాన్ ఇండియా హీరోలకి నిద్రలేకుండాచేస్తున్నాడా? ఇది వింటానికి కాస్త అతి శయోక్తిలానే అనిపించొచ్చు..కాని ప్రభాస్ , బన్నీ,చరణ్, యష్, ఇలా ఏ పాన్ ఇండియా హీరోతో పోల్చినా, ఎన్టీఆర్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. అంతటికి తన స్ట్రాటజీనే కారనమా? అలా అద్రుష్టం కలిసొచ్చిందా? రీజన్ ఏదైనా, తన విజన్ ని కాపీ కొట్టడబో, తన దారిలో నడవటమో మంచిదనే నిర్ణయానికి చాలా మంది పాన్ ఇండియా హీరోలు వచ్చారు. వస్తున్నారు.అల్లు అర్జున్ పుష్పరాజ్ గా రెండు పాన్ ఇండియా హిట్లు పట్టాక కూడా, ఎన్టీఆర్ ని వేటాడుతున్నాడు. తన కథలు, తనదర్శకులు, తన హీరోయిన్లు, ఇలా తన స్ట్రాజీనో, తన కంటెంట్ నో బన్నీ ఫాలో అవుతున్నాడనే విషయం, ఆల్ మోస్ట్ చాలా మందికి క్లారిటీ వస్తోంది.. ఆఖరికి వార్ 2 లాంటి సినిమా ఫెల్యూర్ ఫేస్ చేసినా, అక్కడా ఎన్టీఆర్ కి అద్రుష్టమే కలిసొచ్చిందనే మాట వినిపిస్తోంది
దీనంతటికి దేవరనే కారణం. అదొక్కటే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటమే కాదు, పాన్ ఇండియా లెవల్లో ఒక జోనర్ మూవీలో హిట్ పడ్డాక,మరో దర్శకుడితో మరో జోనర్ లో హిట్ మెట్టెక్కిన ఏకైక హీరో ఎన్టీఆరే.. బాహుబలి తర్వాత, హిట్ కోసం ప్రభాస్ ఆల్ మోస్ట్ ఆరు నుంచి ఏడేల్లు వేయిట్ చేయాల్సి వచ్చింది. చరణ్ ఆచాయ్య, గేమ్ ఛేంజర్ తో ఫ్లాప్ మీద ఫ్లాప్ తోడీ డీలా పడాల్సి వస్తోంది.పెద్ది తో గట్టెక్కితే చాలనే పరిస్తితి.. ఐతే ఇప్పుడీ డిస్కర్షన్ రావటానికి రీజన్ కేజీయఫ్ ఫేం రాకీ భాయ్. తనే యష్.. కేజీయఫ్ రెండు భాగాలతో తనకి పాన్ ఇండియా రాకీ భాయ్ గా పేరొచ్చింది. కాని ఆతర్వతే ఎలా తన కెరీర్ డిజైన్ చేసకోవాలో తెలియని పరిస్తితి.. అలాంి టైంలో టాక్సిక్ మూవీ చేశాడు. తీరా చూస్తే ఇది దారి తప్పిన రాఖీ బాయ్ అనేలా ఉంది. అదే గెడ్డం, అదే జుట్టు, అదే లుక్కు.. ఆఖరికి అదే అనిపించేలా క్యారెక్టరైజేషన్.
టాక్సిక్ గ్లింప్స్, టాక్సిక్ టీజర్ రెండూ కూడా రాఖీ భాయ్ పాత్రకి, కేజీయఫ్ సినిమాకు కంటిన్యూటీగా ఉందే తప్ప.. కొత్త మూవీలా అనిపించట్లేదు. ఆవిషయంలో ఇటు ప్రభాస్ దారిలో కాని, అటు ఎన్టీఆర్ దారిలో కాని యష్ వెళ్లాడనలేం. కాని రామాయణం తో పాటు, ఇప్పుడు తను కమిటైన కొత్త మూవీ విషయంలో ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడట యష్. నిజానికి రామాయణం లో రావణుడి పాత్ర వేసేందుకు తను సిద్దపడిందే, జై లవకుశ ప్రేరణతో అని ఒక ఇంటర్వూలో అనే వరకు, తనదిమ్యాన్ ఆఫ్ మాసెస్ దారే అన్న సంగతి హైలెట్ కాలేదు.. ఏదేమైాన పాన్ ఇండియా మూవీ స్ట్రాటజీస్ లో ఎన్టీఆర్ రూటే సెపరేటు.