2027లో డబుల ధమాకా..? ఒకే ఏడాదిలో 2 సినిమాలు…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. జస్ట్ ఇమాజిన్ రెండేల్లుగా మహేశ్ బాబు సినిమాలేదు.

Post Published By: dialnews
Updated : 27 February 2026, 6:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. జస్ట్ ఇమాజిన్ రెండేల్లుగా మహేశ్ బాబు సినిమాలేదు. అలాంటిది ఒకే ఏడాది మహేశ్ బాబు రెండు సినిమాలతో దాడి చేస్తే ఎలా ఉంటుంది.. అదే వచ్చే ఏడాది జరగబోతోంది. సమ్మరే కాదు, దీపావలి కూడా తనదే అయ్యేలా ఉంది. ఒక వైపు వారణాసిలో మూడు పాత్రలతో మూడు లోకలు, నాలుగు కాలాల్లో టైం ట్రావెల్ చేయబోతున్నాడు. కట్ చేస్తే వారణాసి తర్వాత గన్ పట్టుకుని గూడ ఛారిగా వేట షురూ చేసేందుకు మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు. మొన్నటి వరకు సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ తోపాటు, కొత్త యంగ్ దర్శకుడి మేకింగ్ లో తన సినిమా అన్నారు. కట్ చేస్తే, రాజమౌలి వల్ల సమర్పించుకున్న రెండే ళ్ల టైంని, మరోలా బ్యాలెన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి కాంబినేషన్ ని రిపీట్ చేయాలనుకుంటున్న సుకుమార్, ఆల్రెడీ మహేశ్ కి చెప్పిన స్టోరీ లైన్ ని స్క్రిప్ట్ గా మార్చాడా? చరణ్, మహేశ్ బాబు ఇలా ఇద్దరి సినిమాలకు సంబంధించిన కథలు సిద్దమయ్యాయా? ఐనా 2027లో నిజంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు డబుల్ ధమాఖా సాధ్యమా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు 2024 లో గుంటూరు కారంతో వెండితెరమీద దుమ్ముదులిపాడు. త్రివిక్రమ్ కథాలోపాలుఎలా ఉన్నా, తన మ్యానరిజమ్, పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ నే కాదు, కామన్ ఆడియన్స్ని కూడా ఫిదా చేశాడు. కాని అలాంటి సూపర్ మాస్ పెర్పామెన్స్ వచ్చి రెండేళ్లవుతోంది. మరో ఏడాది అంటే 2027 వరకు సూపర్ స్టార్ సునామీని వెండితెరమీద చూడటం కష్టం..ఎందుకంటే 2027 మార్చ్ లోనే తన ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి రాబోతోంది. అప్పటి వరకు అంటే ఆల్ మోస్ట్ మూడేళ్లు తన ఫ్యాన్స్ తనని మిస్ అయినట్టే. ఆ ఇబ్బందినే, డబుల్ ధమాకా ఆఫర్ తో దూరం చేయబోతున్నాడు సూపర్ స్టార్. అంటే ఒకే ఏడాది రెండు సినిమాల రిలీజ్ లతో సూపర్ సునామీకి ప్లాన్చేశాడు. మూడేళ్లు ఒకే మూవీకి ఇలా కేటాయించి రావాల్సా వచ్చింది. అంతా రాజమౌళికోసమే..

తన కథ, తన మేకింగ్ మీదున్న నమ్మకం వల్లే ఇలా తన డేట్స్ జక్కన్నకిచ్చాడు. 14 నెలల షూటింగ్ అయిపోయింది. ఇంకా 5నెలల షూటింగ్ తో వారణాసి షూటింగ్ పూర్తి కాబోతోంది. అంటే మోస్ట్ లీ జూలై, ఆగస్ట్ లోగా ప్యాచ్ వర్క్ తో సహా వారణాసి షూటింగ్ పూర్తవ్వొచ్చు... అందులో డబుల్ ధమాకా ఏముందనే డౌట్లొద్దు.. ఎందుకంటే సుకుమార్ ఫైనల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది.సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సుకుమార్ ప్లాన్ చేసిన జేమ్స్ బాండ్ జోనర్ మూవీ, కేవలం అంటే కేవలం 8 నెలల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. కేవలం షూటింగ్ ని వేగంగా పూర్తి చేయటమే కాదు, వేగంగా రిలీజ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుంది. 2027లో వారణాసి మూవీనే కాదు,మరో సినిమా కూడా రిలీజ్ అవబోతోంది.అదే సుకుమార్ మేకింగ్ లో మహేశ్ చేయబోయే ప్రాజెక్ట్..

జూన్ లో ప్రాజెక్ట్ ని లాంచ్ చేసి, ఆగస్ట్ నుంచే షూటింగ్ మొదలు పెట్టేలా సుకుమార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.ఫైనల్ స్క్రిప్ట్ మీద మహేశ్ కి గురి కుదరటం, 150 రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చేయటం జరిగిపోయింది. మార్చ్ 2027 లో వారణాసి వస్తే, అదే ఏడాది దీపావలికి సుకుమార్ తో మహేశ్ బాబు చేసే సినిమా వచ్చేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రాజమౌళి ఏమైనా ట్విస్ట్ ఇచ్చి వారణాసి షూటింగ్ పొడిగిస్తే చెప్పలేం కాని, వచ్చే ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియాని, పాన్ వరల్డ్ ని షేక్ చేసే సాహసానికి రెడీ అయ్యాడు మహేశ్. పెద్ది రిపేర్లతో శిష్యుడికి సాయం చేస్తున్న సుకుమార్, చరణ్ తో అనుకున్న ప్రాజెక్ట్ ని కేవలం 5 నెలల్లో పూర్తి చేసి, వెంటనే మహేశ్ బాబుతో సినిమా చేస్తాడా అన్న డౌట్లున్నా, ప్లానింగ్ మాత్రం సాలిడ్ గానే జరుగుతోంది.

Published : 
  • 27 February 2026, 6:00 PM IST