Top story: యూఎస్‌కు తడిసిమోపెడవుతున్న ఖర్చు… యుద్ధంలో రోజుకు 7వేల కోట్ల వ్యయం…!

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం మరింతకాలం కొనసాగుతుందా ? అమెరికా అన్నింటికి సిద్ధమయ్యే వార్‌లోకి దిగిందా ? నాలుగు రోజులుగా యుద్ధం చేస్తున్న అమెరికాకు...ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయా ?

Post Published By: dialnews
Updated : 4 March 2026, 11:10 AM IST

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం మరింతకాలం కొనసాగుతుందా ? అమెరికా అన్నింటికి సిద్ధమయ్యే వార్‌లోకి దిగిందా ? నాలుగు రోజులుగా యుద్ధం చేస్తున్న అమెరికాకు...ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయా ? అగ్రరాజ్యంపై రోజుకు ఎంత భారం పడుతోందా ? నెల రోజుల పాటు కొనసాగితే...పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ?పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపు దాల్చుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉద్ధృతంగా సాగుతోంది. లెబనాన్‌ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బొల్లాపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇరాన్, దాని మిత్రదేశాలు, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి.

ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్ధం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారుచేయకుండా అడ్డుకొని తీరుతామని...ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై అవసరమైతే భూతల దాడులూ చేస్తామని..ఇరాన్‌పై దాడుల విషయంలో గల్ఫ్‌ దేశాలు తమ వెంటే ఉన్నాయని స్పష్టం చేశారు.

నాలుగు రోజులు అమెరికా, ఇజ్రాయెల్‌...ఇరాన్‌పై గగనతల దాడులు చేస్తున్నాయి. టెహ్రన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్దంతో అమెరికాకు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. గగనతల, సముద్ర దాడుల కోసం దాదాపు 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వినియోగిస్తోంది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ మొదలైన తర్వాత తొలి 24 గంటల్లో అగ్రరాజ్యం 779 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు చేపట్టాయి. ఇప్పటివరకు వందల సంఖ్యలో లక్ష్యాలపై దాడులు చేశామని, టెహ్రాన్‌కు చెందిన 11 నౌకలను ధ్వంసం చేశామని యూఎస్‌ మిలిటరీ వెల్లడించింది. ఖర్చు పరంగా చూస్తే అమెరికాకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే అగ్రరాజ్య రక్షణ బడ్జెట్‌ ప్రస్తుతం ట్రిలియన్‌ డాలర్ల పైనే ఉంది. ఇప్పుడు దానిని 1.5 ట్రిలియన్‌ డాలర్ల వరకూ పెంచే అవకాశం ఉంది. కానీ, సమస్య ఏంటంటే ఘర్షణల్లో అమెరికా ఆయుధాలను కోల్పోవడం మైనస్. ఏడాది కాలంగా అమెరికా...ఇరాన్‌ చుట్టూ ఉన్న తమ సైనిక స్థావరాల్లో బలగాలను సిద్ధం చేసింది.

యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక బలగాలను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. వీటి కోసం మరో 630 మిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 6వేల కోట్లు వ్యయం అవుతున్నట్లు రక్షణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధంలో ధ్వంసమైన ఆయుధ పరికరాల నష్టం అదనపు భారమే. ఈ ఘర్షణల సమయంలో కువైట్‌లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఉద్రిక్తతలు నిరవధికంగా కొనసాగితే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థలు పనిచేయడం కష్టమే. ఖర్చు పరంగా చూస్తే అమెరికాకు పెద్ద విషయం కాకపోవచ్చు.

ఎందుకంటే అగ్రరాజ్య రక్షణ బడ్జెట్‌ ప్రస్తుతం ట్రిలియన్‌ డాలర్ల పైనే ఉంది. ఇప్పుడు దానిని 1.5 ట్రిలియన్‌ డాలర్ల వరకూ పెంచే అవకాశం ఉంది. కానీ, సమస్య ఏంటంటే ఘర్షణల్లో అమెరికా ఆయుధాలను కోల్పోవడం మైనస్. యెమెన్‌, ఇరాన్‌, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా సాగిస్తోన్న ఆపరేషన్ల కోసం మరో 9.65 బిలియన్‌ డాలర్ల నుంచి 12.07 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే.. రెండేళ్లకు పైగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అమెరికాకు ఇప్పటివరకు 3 లక్షల కోట్లపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇరాన్‌ ఘర్షణలు మరింతకాలం కొనసాగితే.. ఈ ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Published : 
  • 4 March 2026, 11:10 AM IST