త్రివిక్రమ్ కి ఫైనల్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి మోక్షం దొరికినట్టేనా...? ఎందుకంటే కథ విషయంలో తనని వెన్నుపోటు పొడిచాడనే వివాదం, వంద మలుపులు తిరిగి.. మాటల మాంత్రికుడికే మంత్రం రివర్స్అయ్యింది. ఫైనల్ గా ఆ వివాదం ముగియటం, ఎన్టీఆర్ కొంత శాంతించటం జరిగింది. అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కటాక్షం మాటల మాంత్రికుడికి దొరికినట్టేనా అంటే.. ఇంచు మించు అదే నిజం... రాజమౌళి తో ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చు.. కాని వచ్చే ఏడాదే ఉంటుందా? ఏమైనా డేట్లు మారాతాయా అన్నది తేలట్లేదు.. కాకపోతే త్రివిక్రమ్ తో మూవీకి ఎన్టీఆర్ ప్లాన్ చేసుకోవచ్చని రాజమౌళి తేల్చాడట... తను ఏమాత్రం ప్లాన్ మార్చినా, తన మూవీ పట్టాలెక్కేందుకు ఎలాగూ టైం పడుతుంది కాబట్టి, మాటల మాంత్రికుడి సినిమాఈలోపు చేయమన్నట్టే తననుంచి సిగ్నల్స్ వెళ్లయంటున్నారు. అందులో ఎంతవరకు నిజముంది? ఇది త్రివిక్రమ్ కి గోల్డెన్ ఆపర్చునిటీనా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగా త్రివిక్రమ్ ని క్షమించాడా? ప్రొడ్యూసర్స్ జోక్యంతో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ వివాదం ముగిసిపోయిందా? ఈ ప్రశ్నలకు ఆల్ మోస్ట్ ఔననే సమాధానం వస్తోంది. కాకపోతే, త్రివిక్రమ్ అన్ని ప్రయత్నాలు కొంతవరకు ఎన్టీఆర్ ని కూల్ చేశాయని తెలుస్తోంది. డ్రాగన్ రెండు భాగాలు, దేవర సీక్వెల్ తర్వాత పట్టాలెక్కబోయేది మాత్రం గాడ్ ఆఫ్ వారే.కాని ఒకటే కండీషన్... ఒకవేళ రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ కోసం పిలుపు వస్తే, గాడ్ ఆఫ్ వార్ మూవీని మధ్యలోనే ఆపేయాలి... ఏం చేసినా రాజమౌళి సినిమా తర్వాతే... అలాంటి కండీషన్ కి ఒప్పుకుంటేనే త్రివిక్రమ్ తో మూవీ ఉంటుంది.. దానికి మాటల మాంత్రికుడు ఒప్పుకోవటం తప్ప మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే తన కథలో ఎన్నో మార్పులు ఎన్టీఆర్ తో సహా తన టీం చేశాకా, కథ రెడీ అయ్యాక, దాన్ని బన్నీ దగ్గరికి తీసుకెళ్లటం అన్నది వెన్నుపోటుగా భావిస్తున్నాడు ఎన్టీఆర్.
ఎంతగా ఈ వివాదం సద్దుమనిగినా, మోసం అన్నది ఎవరూ భరించలేరు. ఏదేమైనా గాడ్ ఆఫ్ వార్ విషయంలో ఎన్టీఆర్ కొంత కూల్ అయ్యి త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2027 మధ్యలో వీల్ల కాంబినేషన్ సెట్స్ పైకెళ్లొచ్చ... అలా వెళ్లాక రాజమౌళి సీన్ లో కి వచ్చి సినిమాచేద్దామని ఎన్టీఆర్ కి పిలుపు వస్తే, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగుతుంది.రాజమౌలి మూవీ పూర్తయ్యేవరకు మాటల మాంత్రికుడు వేయిట్ చేయాల్సి వస్తుంది.ఎందుకంటే కథ మీద కాపీ రైట్స్ ఎన్టీఆర్ దగ్గరే ఉండటంతో, గాడ్ ఆఫ్ వార్ మరోకరితో తీయలేడనంటున్నారు.
అలాని ఎన్టీఆర్ తో మూవీ చేసి ఈక్వెషన్ సెట్ చేసుకోకపోతే, వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా తనమీద పడ్డ మచ్చపోదని కామెంట్స్ పెంచారు. కాబట్టి రాజమౌళి ఇప్పుడు త్రివిక్రమ్ పాలిట విలన్ లా మారే ఛాన్స్ ఉంది.ఐతే రాజమౌలి ప్లానింగ్స్ ఎప్పుడూ లేటుంటాయి కాబట్టి, ఈలోపు త్రివిక్రమ్ తో ఎన్టీ ఆర్ ప్రాజెక్ట్ వేగంగా పూర్తైనా చెప్పలేం.. ఏదేమైనా పిలిచి ప్రాజెక్ట్ ఇస్తే, వెన్నుపోటు ప్లానింగ్ తో దెబ్బ తిని , ఇప్పుడు రక్త పోటు పెంచుకుంటున్న త్రివిక్రమ్ అన్నా మాటలు, ఈ మధ్య తూటాల్లా పేలుతున్నాయి.