3వ దేవర… దేవర2 కాదు కాబట్టే లేటా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, వెనకాల చాలా ముదురు లెక్కలుంటాయంటారు. మరి ఇది నిజమేనో, లేదంటే తన మీదున్న అభిమానంతో

Post Published By: dialnews
Updated : 17 March 2026, 6:55 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, వెనకాల చాలా ముదురు లెక్కలుంటాయంటారు. మరి ఇది నిజమేనో, లేదంటే తన మీదున్న అభిమానంతో, ఇండస్ట్రీలో కొందరు కావాలని హైప్ ఇస్తారో కాని... కొన్ని సార్లు ఈ మాటలు నిజమనిపించేలానే కనిపిస్తాయి.. అందులో భాగంగానే దేవర 2 ఎందుకు డిలే అవుతోంది అన్న అంశానికి రీజన్, రీసౌండ్ చేస్తోంది. బాలీవుడ్ మూవీ ధురందర్ 2 ఈ వారమే రాబోతోంది.. అలాంటి టైంలో ఆ దర్శకుడు అక్కడ బాంబు పేలిస్తే.. అది ఇప్పుడు దేవర సీక్వెల్ సెట్లో సౌండ్ తీసుకొచ్చింది. ఔను దేవర 2 ఎప్పుడో పట్టాలెక్కాలి.. కాని కథ రెడీగా ఉన్నా డిలే అవటానికి రీజన్... రెండో దేవర కాదు.. మూడో దేవర... ఐను మూడో దేవరే రెండో దేవరని ముందుకు వెళ్లనీయలేదట.. ఇంతకి ఎవరా మూడో దేవర..? తనకి హిందీ మూవీ ధురందర్ కి ఉన్న లింకేటి?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టే, కొరటాల శివ ఆపనులు మొదలు పెట్టాడన్నారు. డ్రాగన్ ఆల్రెడీ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఫ్యాన్స్ కి నిద్రపట్టనీయట్లేదు. అదే కిక్ అనుకుంటే, కిక్ లాంటి షాక్ ఇస్తోంది దేవర సీక్వెల్ టీం. ఇంతకాలం దేవర 2 షూటింగ్ ఎందుకు డిలే అయ్యిందన్న ప్రశ్నకు, మైండ్ బెండ్ అయ్యే సమాధానం దొరుకుతోంది. అదే మూడో దేవర..మూడో దేవర వల్లే రెండో దేవర సెట్లో అడుగుపెట్టేలేకపోయాడట. మూడో దేవర వల్లే కొరటాల శివ, ఎన్టీఆర్ మూడో సారి కాంబినేషన్ సెట్ అవ్వటంతో కాస్త డిలే అయ్యిందట. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇంతవరకు బాహుబలి రెండు భాగాలు, పుష్ప రెండు భాలే వచ్చింది. మూడు భాగాలుగా ఏ తెలుగు సినిమా రాలేదు..

ఆ రికార్డుని మూడో దేవర సొంతం చేసుకోబోతున్నాడు. దేవరకి అసలు రెండో సీక్వెల్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు మొన్నటి వరకు వినిపించాయి. కట్ చేస్తే, రెండో భాగం కాదు, ఏకంగా మూడో సీక్వెల్ కి కూడా ప్లానింగ్ జరుగుతోందన్న మాట, తూటా కంటే వేగంగా ఇండస్ట్రీలో దూసుకెళుతోంది. ఎన్టీఆర్ చాలా దూరద్రుష్టితో కొరటాల శివకి గట్టి సలహానే ఇచ్చాడని చాలా ఆలస్యంగా తెలుస్తోంది.కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగతోంది. జూన్ లోగా మొదటి భాగం, దసరా లోగా సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసి, 3 నెలల గ్యాప్ లో ఇద్దరు డ్రాగన్లను రెండు సార్లు రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ టీం ప్లాన్. ఇదే ప్లాన్ దేవర కి కూడా అప్లై చేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.

అంటే దేవర 2 తో పాటు దేవర 3 ని కూడా ఏకకాలంలో షూట్ చేసి, రిలీజ్ డేట్లు మాత్రం తన ప్లాన్ ప్రకారం సెట్ చేయాలనేది ఎన్టీఆర్ నిర్ణయమని తెలుస్తోంది. మరి ఇదే ప్లాన్ బాలీవుడ్ బ్యాచ్ కి కూడా వచ్చిందా? లేదంటే సుకుమార్ తో బన్నీ ప్లాన్ చేసిన పుష్ప 3 వ సీక్వెల్ వల్లే ఇలాంటి ఆలోచన వచ్చిందో కాని, ధురందర్ మూడో భాగాన్ని ఎనౌన్స్ చేశాడు ఆధిత్యాధర్. సో ఇదే నిజమైతే, పుష్ప3, దేవర 3, ధురంధర్ 3 ఇలా మూడు భాగాలుగా ట్రెండ్ సెట్ చేసిన ఫ్రాంచైజీగా ఈ మూడు మూవీలు హిస్టరీ క్రియేట్ చేసినట్టౌతుంది.

Published : 
  • 17 March 2026, 6:55 PM IST