మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాక్టర్ గా మారబోతున్నాడు. నర్సుఅవతారం కూడా ఎత్తే పనిలో ఉన్నాడు. రెబల్ స్టార్ కూడా శంకర్ దాదా ఎమ్ బీబీఎస్ కోటు వేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరు కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయానికి మందు వేయబోతున్నారు. ఇదేదో సరదాగ కాదు, నిజంగా జరగబోతున్న సంఘటన... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కిందపడలేదు.. కనీనం కళ్లు తిరిగి పడ్డ సందర్భం కూడా కాదు.. అయినా తనకి మామూలుగా కాదు, గట్టిగనే గాయాలయ్యాయి.. ఎంతైన ప్రభాస్, ఎన్టీఆర్ కంటే పవన్ సీనియర్... అందుకే ఈ ఒక్కడికి, ఆ ఇద్దరు మందులు వేయబోతున్నారు. పవర్ స్టార్ కి అయిన పవర్ ఫుల్ గాయానికి ఈ ఇద్దరే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా..?
రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఈ ఇద్దరు రంగంలోకి దిగాలి.. అర్జెంట్ గా వాల్లు సీన్ లోకి రావాలి.. అనుకోని ప్రమాదం.. చెప్పలేనంత పెద్ద గాయం.. ఆగాయానికి మందు వేయాలంటే ఎక్స్ పర్ట్స్ రావాల్సిందే. ఏదో ఒకటి చేయాల్సిందే.. ఇదే మైత్రీ మూవీ మేకర్స్ కి కావాల్సింది.. ఆనిర్మాతలకు, హీరోతో పాటు చాలా పెద్ద గాయాలయ్యాయి..ఆ గాయాలకే మందేసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ల సాయం అవసరమొచ్చింది. దసరాకు సర్జికల్ ఆపరేషన్ షురూ అయ్యేలా ఉంది. ఎన్టీఆర్ డాక్టర్ కాదు.. రెబల్ స్టార్ ఎమ్ బీ బీఎస్ చేయలేదు. అయినా ఆపరేషన్ థియేటర్స్ లో ఈ ఇద్దరు ఆపరేషన్ చేయాలి.. హెవీ యాక్సిడెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ టీం కి అయిన గాయాలకు మందేయాలి.. ఇది ఇండైరెక్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ మీద వస్తున్న కామెంట్స్.
కథలో క్వాలిటీ లేదు.. కథనంలో జెన్యూనిటీ లేదు.. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ఆడట్లేదు.. లాంటి కామెంట్లు పెరిగాయి. పవన్ చెప్పాడని, అక్కరకు రాని పొలిటికల్ ఇష్యూస్ పెట్టి, కథని గాడి తప్పించారో... లేదంటే హరీష్ శంకర్ అతిగా ఆలోచించి, మెదడుని వాడకుండా, షార్ట్ కట్ తీసుకున్నాడో. కాని ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మారింది.అగ్నాత వాసినే మించిపోయింది. ఆ గాయమే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కి అయినట్టుంది. ఆ గాయానికి మందేయాలంటే, ఫౌజీ రంగంలోకి దిగాలి.. దసరాకే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఫౌజీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్లింప్స్ రాలేదు. పాట విడుదలైంది లేదు. టీజర్, ట్రైలర్ల ఊసేలేదు.. అసలు మోషన్ పోస్టర్ కూడా రాలేదు.ఐనా ఫౌజీ మాత్రం దసరా రిలీజ్ ని కన్పమా్ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ టీం... ఇక సంక్రాంతికి డ్రాగన్ రాక కూడా ఆల్ మోస్ట్ లాంచనమే.. ఈ రెండు వచ్చి వసూళ్ల వరద తెస్తే తప్ప, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఉస్తాద్ భగత్ సింగ్ తో అయిన గాయాలు మానవంటున్నారు. మొత్తానికి పాన్ ఇండియా లెవల్లో రెండు హిట్లు పడితే తప్ప, లోకల్ గా పడ్డ పంచ్ తాలూకు గాయాలు తగ్గేలా లేవన్న కామెంట్లు ఆగట్లేవు.