లెక్కల మాస్టర్ సుకుమార్ మనసంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడా? ఇద్దరి కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో వచ్చింది. ఇప్పుడు పుష్పరాజ్ తర్వాత రామ్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు వారణాసి తర్వాత మహేవ్ చేయబోయే జేమ్స్ బాండ్ సినిమా తీసేది తనే అన్న ప్రచారం ఊపందుకుంది. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాని సుకుమార్ మనసులో ఎన్టీఆర్ మీద ప్రేమతో ఇంకేదో బలంగా నాటుకున్నట్టుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఎన్టీఆర్, సుకుమార్ మీటింగ్ జరగటం అందరిని షాక్ కి గురిచేస్తోంది. ప్రజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ రెండుభాగాలతో బిజీ. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. ఎలా చూసినా కనీసం మూడేళ్లు బిజీ... సుకుమార్ కూడా రామ్ చరణ్ మూవీ, మహేశ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు.. కాబట్టి 2029 వరకు తను ఖాలీగా ఉండే ఛాన్స్ లేదు..ఐతే 2030 కోసం ఎన్టీఆర్ తో సుకుమార్ ఏదో బలంగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.. 2029 లో అందుకు మొదటి అడుగు పడేలా ఉంది? ఇంతకి ఏంటది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్ కాంబినేషన్ ఎప్పడూ సెన్సేషనే.. కనీసం రాజమౌళి అయినా నాలుగు సార్లు ఎన్టీఆర్ తో సినిమా లు తీశాడు కాబట్టి, వాళ్ల కాంబో అంటే ఎప్పుడూ హిట్ అనొచ్చు.. కొరటాల శివ రెండు హిట్లు ఎన్టీఆర్ కి ఇచ్చాడు కాబట్టి, ఈ కాంబో వెరీ వెరీ స్పెషల్ అనొచ్చు.. కాని సుకుమార్ మాత్రం ఒకటంటే ఒకటే మూవీ నాన్నకుప్రేమతో తీశాడు.ఐనా జక్కన్న, కొరటాల శివ కంటే ఎక్కువ బాండ్ సుకుమార్ తో ఎన్టీఆర్ కి క్రియేట్ అయ్యింది. అందుక్కారణం తన తండ్రి మరణం తర్వాతే నాన్నకుప్రేమతోరావటం... ఆ కథ తనకి కనెక్ట్ అవటమే కాకుండా, అప్పటి వరకు ఎన్టీఆర్ అంటే మాస్ హీరో అనుకున్న వాళ్ళకి, తనలో క్లాస్ సైడ్ ని, స్టైలిష్ సైడ్ ని సుకుమార్ చూపించటం అక్కడి నుంచే ఎన్టీఆర్ కొత్త జెర్నీ మొదలైంది.
మరి అంతగా ఎన్టీఆర్ లోకొత్త కోణాన్నిచూపించిన సుకుమార్ ఎంతుకు మళ్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ తో మరో ప్రాజెక్ట్ కోసం ఇంతగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందంటే, అందరికి తెలిసిన కారణాలే రంగస్థలం, తర్వాత పుష్పరాజ్ రెండు భాగాలతో సుకుమార్ బిజీ అయ్యాడు. జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింత సమేత వీరరాఘవ హ్యాట్రిక్ హిట్ల తర్వాత త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశాడు. దేవరగా రాజమౌలి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు.సో ఇద్దరూ ఎవరి దారిలో వాళ్లుబిజీ,.. కాని ఇప్పుడీ ఇద్దరి మధ్య కనీసం ఐదు గంటల పాటు జరిగిన చర్చలు చూస్తే సమ థింగ్ ఫిషీ.. మూడునెల్లక్రితం ఇలానే కలిశారు. సుకుమార్ కూడా రామ్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తూనే, ఈమధ్య మహేవ్ బాబుతో రెండు సార్లు కథా చర్చలు చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఐదారు గంటల డిస్కర్షన్.. ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
ప్రజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాలతో ఈ ఏడాది ఎండ్ వరకు బిజీగా నే ఉంటాడు. ఇక దసరాకు గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ మొదలు పెట్టేఛాన్స్ఉంది. అది వచ్చే ఏడాది దసరా వరకు అనుకున్నా, 2027 లేద 2028 సమ్మర్ వరకు ఈ సినిమాలతోనే సరిపోతుంది. అప్పుడే దేవర 2 ఉండొచ్చు.. ఇక సుకుమార్ రామ్ చరణ్మూవీ ఈ జూన్ లో మొదలైనా, దసరాకే లాంచైనా, ఆతర్వాత మహేశ్ తో జేమ్స్ బాండ్ జోనర్ లో సినిమా ఉండే ఛాన్స్ఉంది. సో ఇటు సుకుమార్, అటు ఎన్టీఆర్ ఇద్దరు 2029 వరకు ఫుల్ బిజీ.. కాబట్టి 2029 లోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. 2030లో వీళ్ల కాంబో లో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ నడుస్తున్నట్టుంది.. ఆ విషయంలో కథా చర్చలు కొలిక్కి వచ్చాయి... ఎన్టీఆర్ కూడా సుకుమార్ కి చాలావరకు గ్రీన్ సిగ్నలే ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా 2016 తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే 2030 లోనే వచ్చే ఉంది. అంటే కనీసం 14 ఏల్ల గ్యాప్ తర్వాతే ఈ సెన్సేషనల్ కాంబో రిపీట్ అవుతున్నట్టు లెక్క.