పొలిటికల్ రౌడీ.. 2030లో పొలిటికల్ భూకంపం…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల, 2030 లో పొలిటికల్ భూకంపం రాబోతోందా? ఔను ఈ భూకంప కేంద్ర విశాఖకి వందకిలోమీటర్ల దూరంలోనే ఉండొచ్చని తెలుస్తోంది. అంతా సుకుమార్ వల్లే అనంటున్నారు.

Post Published By: dialnews
Updated : 4 May 2026, 7:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల, 2030 లో పొలిటికల్ భూకంపం రాబోతోందా? ఔను ఈ భూకంప కేంద్ర విశాఖకి వందకిలోమీటర్ల దూరంలోనే ఉండొచ్చని తెలుస్తోంది. అంతా సుకుమార్ వల్లే అనంటున్నారు. ఈ లెక్కల మాస్టర్ కి, ఎన్టీఆర్ కి నాన్నకు ప్రేమతో మూవీ వల్ల ఏర్నడ్డ బందం చాలా స్పెషల్... అందుకే మళ్లీ కలిశాడో, చాలా గ్యాప్ అనుకోకుండా వచ్చిందని కథ చెప్పాడో కాని, ఎన్టీఆర్ చేతిలో పొలిటికల్ బాంబుని పెట్టేశాడట సుకుమార్. అందుతున్న సమాచారం బట్టి చూస్తుంటే, ఈ బాంబు 2030లో పేలేలా ప్లాన్ చేస్తున్నట్ట తెలుస్తోంది. పరిస్థితులు చూస్తే కూడా అలానే ఉన్నాయి. అసలే 2029 లో ఏపికి ఎలక్షన్స్ జరుగుతాయి.. అలాంట టైంలో పొలిటికల్ రౌడీగా ఎన్టీఆర్ మారితే, అగ్ని గుండం బద్దలైనట్టే... అసలే తాత దారిలో నడుస్తున్న మనవడిగా, ఎన్టీఆర్ పేరు చెబితే, పొలిటికల్ హీట్ పెరుగుతుంది.. అలాంటి తనతో, ఈ పరిస్థితులన్నీ తెలిసే సుకుమార్, పొలిటికల్ పంచ్ లు రెడీ చేస్తున్నాడా? అప్పటికి ఇదే సరైన సినిమానా?

జస్ట్ ఇమాజిన్ 2029 లో ఎన్టీఆర్ హీరోగా, సుకుమార్ తీయబోయేది ఒక పొలిటికల్ సెటైర్ అయితే ఎలా ఉంటుంది... ఆల్రెడీ ఏపీలో ఆ టైం కి ఎలక్షన్స్ బీపీ పెంచేస్తాయి... దీనికి తోడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఇప్పటికిప్పుడు స్పెక్కులేషన్స్ లేకున్నా, అలాంటి కంటెంట్ తో తను సినిమా తీస్తే, ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతంది.కాని ఎన్టీఆర్ మాత్రం సినిమాలమీదే ప్రస్థుతానికి ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే పొలిటికల్ రౌడీ గా మారలే ఉన్నాడు. ఔను డైరెక్టర్ సుకుమార్ నిజానికి ఎన్టీఆర్ తో ఊర మాస్ మూవీ తీయాలనే గతంలో ప్లాన్ చేశాడు. కాని తను చెప్పిన కథల్లో నాన్నకు ప్రేమతోనే అప్పట్లో ఎన్టీఆర్ నచ్చటం, ఆ కథనే చేయటంతో, స్టైలిష్ గా తన లుక్ మారింది.

లక్ మారింది.. అంతవరకు బానే ఉంది. కాని ఎన్టీఆర్ అసలు స్టామినాను బయటికి తేవాలంటే, పడాల్సిన పాత్ర పడాల్సిందే.. అందుకే ఈసారి సుకుమార్ పుష్పరాజ్, రంగస్థలం మించేలా ఊర మాస్ పాత్రలో ఎన్టీఆర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రజెంట్ రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న తను, తర్వాత మహేశ్ బాబుతో జేమ్స్ బాండ్ జోనర్ లో సినిమా తీసే ఛాన్స్ ఉంది.ఆతర్వాతే అంటే 2029 లో సుకుమార్ తో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ఉంది. అప్పుడే ఏపీలో ఎలక్సన్స్ ఉండొచ్చు.. దానికి దీనికి లింక్ ఉండకపోవచ్చు. కాని ఈ ప్రాజెక్ట్ మాత్రం అసేంబ్లీ రౌడీ ప్రేరణతో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ అన్న లీకులుపెరిగాయి. ఇంకా రామ్ చరణ్ తో సుకుమార్ తీసే సినిమా ఏంటో కన్ఫామ్ కాలేదు. ఆతర్వాత మహేశ్ తో తీసేది జేమ్స్ బాండ్ జోనర్ అన్ లీకులు తప్ప, అఫీషియల్ ఎనౌన్స్ మెంట్లు ఏవీ రాలేదు.

కాని ఆతర్వాత ఎన్టీఆర్ తో సుకుమార్ తీయబోయే సినిమా ఇదంటూ వస్తున్న లీకులు, కేవలం రూమర్లేనా అంటే, చెప్పలేం.. కాని ఎన్టీఆర్ తో సుకుమార్ పొలిటికల్ గేమ్ ఆడాలనే కోరిక ఉందని రెండు సార్లు ఇంటర్వూల్లో చెప్పాడు.. ఊర మాస్ పాత్ర పడాలంటే, అది పొలిటికల్ రౌడీ పాత్రే అన్న అభిప్రాయం ఉంది కాబట్టే, అలాంటి స్టోరీ లైన్ తో తనకి ఒక కథ కూడా నెరేట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏంటంటే, ఐదు సార్లు ఎన్టీఆర్ ని కలిసి సందీప్ రెడ్డి చెప్పిన కథ కూడా, ఇంచుమించు పొలిటికల్ షాకింగ్ స్టోరీనే అనంటున్నారు.తన సినిమాలు చూస్తే అర్జున్ రెడ్డి దారి తప్పిన డాక్లర్, యానిమల్ దారి తప్పిన బిజినెస్ మ్యాన్ కొడు, ఇక స్పిరిట్ స్టోరీలైన్ చూస్తే దారి తప్పని ఒక ఐపీఎస్ ఆఫీసర్... అలానే దారి తప్పిన పొలిటిషయన్ రోల్ లో ఎన్టీఆర్ ని సందీప్ చూపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.మరి ఈ రెండీట్లో ఏది నిజమన్నది తేలాలంటే రెండేళ్ల పైనే టైం పడుతుంది. కాని ఈ ఇద్దరి దర్శకులతో ఎన్టీఆర్ తీయబోయే సినిమాలకు బయటేమో పొలిటికల్ టచ్చే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.

Published : 
  • 4 May 2026, 7:15 PM IST