Top story:విజయ్ భార్య సంచలన నిర్ణయం… త్రిష రెండో భార్యగా ఉన్నా నాకు నో ప్రాబ్లం… విడాకులు క్యాన్సిల్, విజయ్ భార్యగా ఉంటా ప్లీజ్…!

తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ ఒక ప్రభంజనం సృష్టించారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ.. ఆయన గెలుపు సంబరాల కంటే ఇప్పుడు విజయ్

Post Published By: dialnews
Updated : 6 May 2026, 9:48 AM IST

తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ ఒక ప్రభంజనం సృష్టించారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ.. ఆయన గెలుపు సంబరాల కంటే ఇప్పుడు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ జరుగుతున్న చర్చలే హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత, నటి త్రిషల మధ్య జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతోంది. విజయ్, సంగీతాలది 26 ఏళ్ల అనుబంధం. ఒక అభిమానిగా విజయ్ జీవితంలోకి ప్రవేశించి, ఆయనకు తోడుగా నిలిచిన సంగీత.. గత కొన్నాళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నారు.ఫిబ్రవరి 2026లో సంగీత విడాకుల కోసం కోర్టు మెట్టు ఎక్కడం పెద్ద షాక్ ఇచ్చింది. 2021 నుంచే వీరి మధ్య దూరం పెరిగిందని, విజయ్ ఒక ప్రముఖ నటితో సన్నిహితంగా ఉండడమే దీనికి కారణమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

విజయ్ - సంగీతల విడాకుల కేసు విచారణ జూన్ 15, 2026కి వాయిదా పడింది. విడాకుల టాపిక్ నడుస్తుండగానే, విజయ్-త్రిషలు ఒక పెళ్లి వేడుకలో పక్కపక్కనే కనిపించడం అగ్నికి ఆజ్యం పోసింది. అయితే ఇప్పుడు.. విజయ్ సీఎం అవుతున్న నేపధ్యంలో.. సంగీత రూటు మార్చేసింది.నేను విజయ్ కు విడాకులు ఇచ్చేది లేదని చెప్పేసింది. "నేను విజయ్‌కి విడాకులు ఇవ్వట్లేదు.. త్రిష రెండో భార్యగా ఉండడానికి నాకు అభ్యంతరం లేదు" అనే తరహా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఇవి సంగీత అధికారికంగా చేసిన వ్యాఖ్యలా లేక సోషల్ మీడియా ప్రచారమా అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ, విజయ్ సీఎం అవగానే సంగీత తన నిర్ణయం మార్చుకుందని, ఆయనకు తోడుగా ఉండాలని భావిస్తోందన్న చర్చ నడుస్తోంది.

మొన్నటి వరకు విడాకుల విషయంలో పట్టుబట్టిన సంగీత, ఇప్పుడు హఠాత్తుగా 'విడాకులు ఇవ్వట్లేదు' అనడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా..? విజయ్ సీఎం అయ్యాక 'ఫస్ట్ లేడీ' హోదాను ఆమె వదులుకోవడానికి ఇష్టపడట్లేదా..? అందుకే త్రిష విషయంలో కూడా ఆమె సర్దుకుపోతామనే సంకేతాలు ఇస్తోందా..? విజయ్ రాజకీయాల్లోకి రాకముందు వరకు విడాకుల విషయంలో పట్టుబట్టిన సంగీత, ఇప్పుడు ఆయన గెలుపును చూసి మళ్ళీ దగ్గరవ్వాలని చూస్తున్నారా..? లేదా విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇద్దరూ సర్దుకుపోతున్నారా..? అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు త్రిష మాత్రం తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పితమని కొట్టిపారేస్తున్నారు. రాజకీయాల్లో ఒక గొప్ప సంప్రదాయాన్ని మొదలుపెట్టిన విజయ్, తన పర్సనల్ లైఫ్‌లో కూడా అదే హుందాతనాన్ని చూపిస్తారా..? సంగీత, త్రిషల విషయంలో వస్తున్న ఈ వార్తలపై దళపతి స్పందిస్తారా..? చూడాలి.

Published : 
  • 6 May 2026, 9:48 AM IST