టీవీ కే అధినేత, తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయనీ దేశం మొత్తం ఆకాశానికి ఎత్తేస్తుంది. పాలిటిక్స్ లో రియల్ హీరో అని పొగిడేస్తున్నారు అందరూ . అందరికీ హీరో అయిన విజయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మాత్రం విలన్ల మారిపోయాడు. దీనికి కారణం విజయ్ సాధించిన విజయంతో ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని పోలుస్తున్నారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలో విజయ్ టి వి కే పార్టీ అధికారంలోకి రావడం, అది కూడా ఎవరితో పొత్తులు లేకుండా , ఒంటరిగా పోటీ చేసి అధికారానికి చేరువవడం తో విజయ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అదే సమయంలో ఏపీలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ప్రతి ఒక్కరూ పవన్ తో విజయ్ ని పోలస్తున్నారు. దీనిని జనసేన రకరకాలుగా ఖండిస్తున్నప్పటికీ జనంలో చర్చ మాత్రం ఆగలేదు. అధికారంలోకి వచ్చిన రాకపోయినా పవన్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఏదో ఒక రోజు విజయ్ లాగా అధికారం దక్కేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.21 సీట్లకి కక్కుర్తి పడి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పదవి తీసుకొని....15 ఏళ్లు పొ త్తులు ఉంటాయని చెప్పడం ద్వారా.... తాను సెకండ్ గ్రేడ్ లీడర్ నేనని పవన్ చెప్పకనే చెప్పుకున్నాడు.
ముఖ్యమంత్రిగా ఎప్పటికీ కాలేనని కూడా పరోక్షంగా ఒక మెసేజ్ ఇచ్చేశాడు. 2014లో బిజెపి, టిడిపి లకి పవన్ మద్దతు ఇచ్చారు.2019లో ఆయన ఒంటరిగా పోటీ చేశారని కొందరు చెప్తున్నారు కానీ అది వాస్తవం కాదు.2019లో జనసేన, బీఎస్పీ , లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది.24 లో టిడిపి బిజెపితో కలిసి జనసేన పోటీ చేసింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ జనసేన ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేయలేదు. అందుకే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.... పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన తీరుని, విజయ్ ప్రచారం చేసిన తీరును కూడా పబ్లిక్ పోల్చుకుని చూస్తున్నారు. విజయ్ ఎవరిని బండ బూతులు తిట్టలేదు. అవాస్తవాలు ప్రచారం చేయలేదు. ఉక్రోషంతో రగిలిపోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదు. తన ప్రచారంలో కులాలు, మతాల గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నీ విమర్శించినప్పుడు కూడా స్టాలిన్ అంకుల్ అనే ప్రస్తావించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇందుకు పూర్తిగా విరుద్ధం. సుగాలి ప్రీతి ని పదిమంది రేప్ చేశారని... అన్ని తన కళ్ళతో చూసినట్లే ప్రచారం చేసాడు. ఈరోజు వరకు ఆ కేసుని తేల్చలేదు. ఏపీ నుంచి 30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారన్నాడు. అందులో ఒక్కరిని వెనక్కి తిరిగి తీసుకురాలేదు.
ఇక పవన్ నోట నిత్యం... తోలు తీసేస్తా.... గుడ్డలిప్పి పరిగెట్టిస్తా, ఛాలెంజ్ విసురుతున్న రండిరా నా కొడకల్లారా... ఇలాంటి మాటలు తరచూ వినే వాళ్ళం. విజయ్ ప్రచారం చేసిన తీరు చూసి అబ్బా పవన్ కళ్యాణ్ ఇంత ఘోరంగా మాట్లాడారా అని అందరికీ అనిపిస్తుంది. అన్నిటికన్నా ప్రధానమైన విషయం. విజయ్ తాను ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్నికల్లో పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పుకున్నాడు. అంటే తాను ఒకరిని ఓడించడానికి పనికొస్తాను తప్ప.... సీఎం మెటీరియల్ కాదు అని పవనే స్వయంగా చెప్పుకున్నట్లు. అంతేకాదు విజయ్ వ్యక్తిగత జీవితంపై రాజకీయ విమర్శలు చాలా వచ్చినా... ఆయన ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. దేనికి జవాబు ఇవ్వలేదు. చాలా పరిణితితో వ్యవహరించారు.
కానీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి ఎవరు మాట్లాడినా వెంటనే పవన్ రెచ్చి పోయేవాడు. ఇప్పుడు అందుకే ఏపీ జనం విజయ్, పవన్ ఇద్దరి వ్యక్తిత్వాన్ని పోల్చి చూసుకుంటున్నారు. అలా చూసుకున్నప్పుడు పవన్ గ్రాఫ్ దారుణంగా పడి పోతుంది. నాయకుడు అనే వాడు విజయ్ లా ఉండాలి కదా... పవన్ లా కాదు కదా అనే అభిప్రాయం క్రమంగా జనంలోకి వచ్చేసింది. అసలు విజయ్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా సక్సెస్ అవ్వకుండా ఉండి ఉంటే.... పవన్ పై ఏపీలో చర్చే ఉండేది కాదు. అన్నింటికీ మించి ఎందుకో తెలియదు గానీ ఈ విషయంలో ఎల్లో మీడియా కూడా పవన్ ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తుంది. చివరికి విజయ్ గెలుపు పవన్ పరువు తీసింది.