దేశం దాటుతున్న చిన్నారి…!

తెలుగు ప్రేక్షకులకు 'చిన్నారి పెళ్లికూతురు'గా సుపరిచితురాలైన నటి అవికా గోర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమె, త్వరలో భారతదేశాన్ని వీడి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో శాశ్వతంగా స్థిరపడనున్నట్లు ప్రకటించారు.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 4:50 PM IST

తెలుగు ప్రేక్షకులకు 'చిన్నారి పెళ్లికూతురు'గా సుపరిచితురాలైన నటి అవికా గోర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమె, త్వరలో భారతదేశాన్ని వీడి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో శాశ్వతంగా స్థిరపడనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్ మాట్లాడుతూ, తన భర్త మిలింద్ చద్వానీతో కలిసి బ్యాంకాక్‌కు మకాం మారుస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అక్కడ ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. తన భర్తకు అక్కడ లభిస్తున్న మెరుగైన వ్యాపార అవకాశాల రీత్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వివరించారు. ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవించుకుంటూ, తమ భవిష్యత్తు కోసం ఈ అడుగు వేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.బ్యాంకాక్‌లో నివసించినప్పటికీ, నటనకు తాను స్వస్తి చెప్పడం లేదని అవికా స్పష్టం చేశారు.

షూటింగ్స్ ఉన్నప్పుడు ముంబై లేదా హైదరాబాద్‌కు రావడం తనకు పెద్ద ఇబ్బంది కాదని, ఇప్పటికే తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పు తన కెరీర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మిలింద్ చద్వానీ మరియు అవికా గోర్ లది ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం. మిలింద్ మొదట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి, ఆ తర్వాత సామాజిక సేవ మరియు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 'క్యాంప్ డెయిరీస్' అనే ఎన్జీవో ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. గతేడాది సెప్టెంబర్ 30న పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

చిన్న వయసులోనే 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా, ఆ తర్వాత 'ససురాల్ సిమర్ కా' వంటి సీరియల్స్ లో నటించారు. 2013లో 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఘనవిజయాన్ని అందుకున్నారు.
సినిమా చూపిస్త మావ,ఎక్కడికి పోతావు చిన్నవాడా,రాజు గారి గది 3, వంటి చిత్రాలతో తెలుగులో తనదైన నటనతో ఆకట్టుకుంది అవికా గోర్ప్రస్తుతం ఆమె నటించిన 'అగ్లీ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం అవికా గోర్ మాత్రమే కాదు, గతంలోనూ చాలా మంది హీరోయిన్లు కెరీర్ పరంగా కొందరు వ్యక్తిగత కారణాలతో కొందరు విదేశాల్లో సెటిల్ అయ్యారు.ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఎంజిల్స్‌లో ఉంటున్నారు. ఇలియానా, సోనమ్ కపూర్, మీనాక్షి శేషాద్రి, ప్రీతి జింటా వంటి నటీమణులు కూడా ప్రస్తుతం విదేశాల్లోనే నివాసం ఉంటున్నారు. షూటింగ్స్ లేదా ఇతర పనుల మీద మాత్రమే వీరు ఇండియాకు వస్తుంటారు. ఈ జాబితాలోకి ఇప్పుడు అవికా గోర్ కూడా చేరిపోయారు.

Published : 
  • 15 May 2026, 4:50 PM IST