10Kకోట్ల WAR ఎఫెక్ట్… తప్పించుకున్న సూపర్ స్టార్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబుని, గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చే మూవీ వారణాసి. 1400 కోట్ల హై బడ్జెట్ తో వస్తున్న ఈసినిమా, కనీసం 5 వేలకోట్లు, కాలం కలిసొస్తే 10 వేల కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 5:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుని, గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చే మూవీ వారణాసి. 1400 కోట్ల హై బడ్జెట్ తో వస్తున్న ఈసినిమా, కనీసం 5 వేలకోట్లు, కాలం కలిసొస్తే 10 వేల కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి. ఇలాంటి సినిమాకో టెన్షన్ మొదలైంది. అదే మిడిలీస్ట్ వార్.. ఒకవైపు పెట్రోల్ క్రైసిస్ వల్ల, ఆర్దిక మాంధ్యం రాబోతోందని వార్తలొస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రైమ్ మినిస్టర్ పొదుపు సలహాలు, అందరినీ భయపడేలా చేస్తున్నాయి.. ఇదెలా ఉందంటే, త్రిబుల్ ఆర్ మూవీ టైంలో కోవిడ్ లాక్ డౌన్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు వారణాసికి వార్ ఇన్ ఇరాన్ వణికించేలా ఉంది. లక్కీగా ఈ సినిమా మొత్తం షూటింగ్ జైలైకి పూర్తవబోతుండటంతో, మేకింగ్ కష్టాలనుంచి అంతా గట్టెక్కుతున్నారు.. కాని మార్కెట్ కష్టాల నుంచి ఎలా బయటపడతారు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారాణాసికి ఇప్పుడు కొత్తా హెడ్డేక్ గా మారింది ఇరాన్ వార్. దాని ఎఫెక్ట్ తో వారణాసి షూటింగ్ కే కొన్ని దేశాల్లో బ్రేకులే పడే ఛాన్స్ఉందనంటున్నారు. ఐతే ఆల్రెడీ 80శాతం వారణాసి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన రాజమౌలి, పెండింగ్ షూటింగ్ లో మేజర్ పార్ట్ జులై లోగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు.ఇక మిగిలేది కేవలం ప్యాచ్ వర్కే.. అది పోస్ట్ ప్రొడక్షణ్ కంటిన్యూ చేస్తూ పూర్తి చేసే అవకాశం ఉంది. ఎలా చూసినా సెప్టెంబర్ కల్లా వారణాసి షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. కాబట్టి, వారణాసి షూటింగ్ అసలుఆగుతుందనో, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల సమస్యల వల్లే ఇబ్బంది పడుతుందనో కంగారు పడాల్సిన పనిలేదు. కాని మరోరకంగా వారణాసికి ఛాలెంజెస్ ఎదురయ్యేలా ఉన్నాయి.

అవే వసూళ్లు..? వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు... 55 వేల థియేటర్స్ నుంచి 70 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. 30 భాషలు 120 దేశాలు 100 కోట్ల ఆడియన్స్ ని రీచ్ అవ్వాలీ వారణాసి మూవీ. అందుకోసమే, మెక్సికో నుంచి పారిస్ వరకు ప్రమోషన్స్ ని ప్యార్ లల్ గా వారణాసి టీం చేస్తోంది. ఇది కూడా మంచి విషయమే..కాని ప్రజెంట్ ప్రపంచం మొత్తం పొదుపు మంత్రం జపిస్తోంది.. ఆల్రెడీ ఇండియాలో పెట్రోలుని పొదుపుగా వాడాలి, బంగారం కొనటం ఆపాలి, ఖర్చులు తగ్గించుకోవాలి.. లాంటి సలహాలు ప్రదాని మంత్రే ఇవ్వటంతో, ఒకరకంగా ఇది ఎకనామికల్ క్రైసిస్ కి ప్రారంభమా అనుకుంటున్నారు. మొదట్లో ఇరాన్ వార్ ఎఫెక్ట్ కొంతకాలమే ఉంటుందన్నారు . ఇరాన్, అమెరికా చర్చించుకుని వార్ ని ఆపేస్తే అంతా మారిపోతుందన్నారు.

కాని వరల్డ్ వైడ్ గా ఇక మీదట ఈ ప్రపంచం ఒకప్పటి లా ఉండటం కష్టంగా నే కనిపిస్తోంది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ పెట్రోల్, గ్యాస్ రేట్లు మండిపోయేలా చేసింది. దీంతో అన్నీరేట్లు పెరగటంతో, జనాలు కొనటం తగ్గించారు. దీంతో వ్యాపరం పడిపోతోంది.. దాని ఎఫెక్ట్ దేశ ఎకానమీ మీద పడుతుంది..ఇలాంటి చైన్ రియాక్షన్ ఏడాదికి పైనే సాగితే, ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్ టైన్ మెంట్ మార్కెట్ కి బ్రేక్ పడుతుంది.అంటే సినిమాలు, టీవీలు, షోలు, ఓటీటీలు ఇలాంటి మార్కెట్ లో మనీ ఫ్లో తగ్గి, ఆ ఆఎఫెక్ట్ తో వారణాసి వసూల్లకు చాలా ఇబ్బందుల వచ్చే ఛాన్స్ఉందనంటున్నారు. లాస్ట్ టైం లాక్ డౌన్ వల్ల ఏడాదిలో అవ్వాల్సిన త్రిబుల్ ఆర్ మూవీ మూడేళ్లు పట్టింది. ఇప్పుడు ఇరాన్ వార్ రాజమౌళి కొంపముంచేలా ఉంది. పరిస్థితి మెల్లిగా మార్కెట్ ని ప్రభావితం చేయటంతో, అస్సలు వార్ కి సంబంధం లేని సినీ ఇండస్ట్రీ ఈ ఎఫెక్ట్ కి గురవ్వక తప్పట్లేదు.

Published : 
  • 15 May 2026, 5:50 PM IST