Top story:ట్రంప్ కు మోడీ స్లిప్పర్ షాట్…ఇరాన్ యుద్ధం ఆపడానికే మోదీ వెళ్లారా..? గ్లోబల్ వార్ క్రైసిస్‌లో రంగంలోకి గ్లోబల్ లీడర్…!

అంతర్జాతీయ వేదికపై ఇప్పుడు ఒకే ఒక్క వార్త ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రపంచం ఒకవైపు ఇరాన్ యుద్ధ భయాలతో వణికిపోతుంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరు రోజుల పాటు 5 దేశాల మెరుపు పర్యటనకు ఢిల్లీ

Post Published By: dialnews
Updated : 16 May 2026, 5:49 PM IST

అంతర్జాతీయ వేదికపై ఇప్పుడు ఒకే ఒక్క వార్త ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రపంచం ఒకవైపు ఇరాన్ యుద్ధ భయాలతో వణికిపోతుంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరు రోజుల పాటు 5 దేశాల మెరుపు పర్యటనకు ఢిల్లీ నుండి యూఏఈ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పర్యటన వెనుక కేవలం వ్యాపార ఒప్పందాలు మాత్రమే ఉన్నాయా..? లేక ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధాన్ని ఆపడానికి మోదీ స్వయంగా రంగంలోకి దిగారా..? ప్రపంచ పోలీస్ అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పక్కన పెట్టేసి.. గ్లోబల్ లీడర్‌గా మోదీ చక్రం తిప్పబోతున్నారా..? ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఐదు దేశాలలో పర్యటించనున్నారు. ఆయన లిస్టులో యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ ఉన్నాయి. అధికారికంగా చూస్తే.. ఈ పర్యటన యొక్క ముఖ్య లక్ష్యాలు ఇంధనం, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక సహకారం మరియు పెట్టుబడులు అని చెప్తున్నారు. కానీ, సరిగ్గా మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన ఈ క్లిష్ట సమయంలో, గ్లోబల్ ఎనర్జీ సప్లై.. అంటే పెట్రోల్, డీజిల్ రవాణా దెబ్బతింటున్న తరుణంలో మోదీ ఈ పర్యటన చేపట్టడం వెనుక అంతర్జాతీయ దౌత్య వ్యూహాలు దాగున్నాయి.

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అయ్యే అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' ప్రమాదంలో ఉంది. ప్రపంచంలోని 20% క్రూడాయిల్ ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. మోదీ తన పర్యటనలో ఈ రూట్‌ను రక్షించడంపై బారతదేశం తరఫున పవర్‌ఫుల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు అని టాక్. యుద్ధం కారణంగా చమురు కంపెనీలు భారీగా నష్టపోవడంతో, కేంద్ర ప్రభుత్వం నిన్ననే లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 వరకు, సీఎన్‌జీపై రూ. 2 వరకు ధరలను పెంచింది. ఈ ఇంధన ధరల మంటను చల్లార్చడమే ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన యొక్క తక్షణ అత్యవసర ప్లాన్ గా కనపడుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తూ కూర్చుంటే.. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది. అందుకే మోదీ అమెరికా వ్యూహంతో సంబంధం లేకుండా, నేరుగా తానే రంగంలోకి దిగి అరబ్, యూరప్ దేశాలతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇరాన్ మరియు యూఏఈ రెండు దేశాలూ ఈ మధ్యే 'బ్రిక్స్' కూటమిలో చేరాయి. ఈ కూటమిలో భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి. ట్రంప్‌కు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపై పట్టు తగ్గుతున్న తరుణంలో, మోదీ 'బ్రిక్స్' లీడర్‌గా ఇటు ఇరాన్, అటు యూఏఈ దేశాల మధ్య రాయబారం నడిపి యుద్ధ మేఘాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు అసలు ప్రశ్న.. యుద్ధం ఆపడానికే మోదీ వెళ్లారా..? దీనికి అవుననే సమాధానం ఇస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఎందుకంటే, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో ఇంధన ధరలు పెరిగాయి. ఈ సంక్షోభాన్ని ముగించాలంటే ఇటు అరబ్ దేశాలతో, అటు యూరప్ దేశాలతో బలమైన సంబంధాలు ఉన్న ఏకైక నేత నరేంద్ర మోదీ మాత్రమే. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మోదీ చేసిన ప్రయత్నాలను ప్రపంచం చూసింది.ఇప్పుడు యూఏఈ వంటి కీలక అరబ్ దేశంతో మరియు యూరప్ దేశాలతో చర్చలు జరిపి, ఇరాన్ సంక్షోభానికి ఒక దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనేందుకే మోదీ ఈ శాంతి మిషన్ ప్రారంభించారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

మరి ఈ ప్రాసెస్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పక్కన పెట్టేసినట్టేనా..? సాధారణంగా ఇలాంటి గ్లోబల్ క్రైసిస్ వస్తే అమెరికా ముందుండి పంచాయితీ పెట్టాలి. కానీ, ట్రంప్ ప్రభుత్వం అంతర్గత నిర్ణయాలు, ఆంక్షలతో బిజీగా ఉండటం.. అమెరికా మాటను అరబ్ దేశాలు పెద్దగా నమ్మే పరిస్థితి లేకపోవడంతో గ్లోబల్ లీడర్‌షిప్ ఖాళీ అయింది.ఆ ప్లేస్‌ను మోదీ భర్తీ చేస్తున్నారు. అమెరికా ఆంక్షలు విధిస్తూ కూర్చుంటే.. మోదీ మాత్రం స్వయంగా దేశాల మధ్యకు వెళ్లి ఇంధన మరియు రక్షణ రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నారు. ట్రంప్‌తో మోదీకి మంచి స్నేహం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అమెరికా జోక్యం లేకుండానే, భారత్ తన సొంత దౌత్య నీతితో యూరప్, గల్ఫ్ దేశాలను ఏకం చేస్తూ ట్రంప్‌కు ఒక రకంగా షాక్ ఇస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. మోదీ చేపట్టిన ఈ 6 రోజుల 5 దేశాల పర్యటన కేవలం వ్యాపార పర్యటన కాదు.. ఇది ఒక కొత్త గ్లోబల్ ఆర్డర్‌ను సృష్టించే పర్యటన. ఇటు రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూనే, అటు యుద్ధ మేఘాలను విడగొట్టడానికి మోదీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Published : 
  • 16 May 2026, 5:49 PM IST