క్లారిటీ ఇచ్చిన సామ్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూ ముంబైకే పరిమితమైన సామ్, ఈసారి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది.

Post Published By: dialnews
Updated : 27 May 2026, 10:55 AM IST

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూ ముంబైకే పరిమితమైన సామ్, ఈసారి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది. తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై సమంత స్వయంగా నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మే 25న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.అయితే, ఇటీవల సోషల్ మీడియాలో సమంతపై, ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో విభేదాలు ఉన్నాయంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యాంకర్ సమీరా భరద్వాజ్ అడిగిన ఒక ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ ఆ పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టింది.

"నా పక్కన ఇద్దరు దర్శకులు ఉన్నారు—ఒకరు రాజ్ గారు, ఇంకొకరు నందినీ గారు. వీరిద్దరిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏంటి అని అడిగితే.. నాకైతే వీరిద్దరిలో ఇరిటేట్ చేసే అంశాలేవీ కనిపించలేదు. నందినీకి నాకు దాదాపు 15 ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకవేళ ఆమెలో ఏదైనా ఇరిటేషన్ ఉన్నా అది నాకు అలవాటైపోయింది! ఇక రాజ్ గారితో నాకు ఇప్పటివరకు ఏ విషయంలోనూ, ఎప్పుడూ ఎలాంటి వాదనా జరగలేదు. రాజ్ గారు, నందినీ గారు ఇద్దరూ చాలా పర్ఫెక్ట్." అని సమంత స్పష్టం చేసింది.మరింతగా మాట్లాడుతూ.. ‘మా ఇంటి బంగారం’ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఇందులో డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని తెలిపింది. ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి జూన్ 19న ఈ సినిమాను తప్పకుండా చూడాలని సామ్ కోరింది.

నందినీ రెడ్డి మాట్లాడుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. జూన్ 19న థియేటర్లు రీసౌండ్ ఇవ్వడం ఖాయమని, ప్రేక్షకులు సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించడంతో, ఈ సరికొత్త ఫ్యామిలీ డ్రామాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ భారీ క్రేజ్ నెలకొంది. రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వురి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మొదట షెడ్యూల్ ప్రకారం మే 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ 19కి వాయిదా పడింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, ఈ ట్రైలర్ లాంచ్‌తో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. జూన్ 19న థియేటర్లలో ఈ 'బంగారం' ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.

Published : 
  • 27 May 2026, 10:55 AM IST