బాలీవుడ్ దిమ్మతిరిగేలా డ్రాగన్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తోంది అంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘డ్రాగన్’

Post Published By: dialnews
Updated : 29 May 2026, 5:55 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తోంది అంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘డ్రాగన్’ పై ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ నుండి ఈ గ్లింప్స్‌కు ఊహించని రీతిలో మాస్ రెస్పాన్స్ లభిస్తుండటం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా గ్లింప్స్‌పై ఎలాంటి టాక్ ఉన్నప్పటికీ, నార్త్ ఆడియెన్స్ మాత్రం ఈ ‘డ్రాగన్’ గ్లింప్స్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే ఒక్క హిందీ వర్షన్‌లోనే ఈ గ్లింప్స్ ఏకంగా 40 మిలియన్ వ్యూస్ మార్కును క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 7 మిలియన్ వ్యూస్ రావడం ఈ సినిమాపై నార్త్‌లో ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. దీన్ని బట్టి హిందీ బెల్ట్‌లో ‘డ్రాగన్’ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పక తప్పదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు నార్త్‌లో వచ్చిన క్రేజ్ ఈ చిత్రానికి భారీగా ప్లస్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ డార్క్ థీమ్ యాక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మాస్ యాక్షన్ ఎలివేషన్లను మరింత పీక్స్‌కు తీసుకెళ్లనుంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘డ్రాగన్’ సినిమాను కేవలం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంచనాలన్నింటినీ మించిపోయేలా వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. గ్లింప్స్ క్రియేట్ చేసిన ఈ రేంజ్ ఇంపాక్ట్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్లతో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఎన్టీఆర్ మాస్ మేనియా, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 29 May 2026, 5:55 PM IST