యష్‌ సినిమాకు మరణ గండం.!

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రాక్ స్టార్ యశ్, చాలా గ్యాప్ తర్వాత టాక్సిక్‌ అనే యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 4 July 2026, 11:04 AM IST

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రాక్ స్టార్ యశ్, చాలా గ్యాప్ తర్వాత టాక్సిక్‌ అనే యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల కంటే ముందే పలు వివాదాల్లో చిక్కుకుని హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సినిమాలో మితిమీరిన శృంగార సన్నివేశాలు, హద్దులు దాటిన వైలెన్స్ ఉన్నాయనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల్లో వైలెన్స్ లేదా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే హిట్టవుతాయనే ట్రెండ్ నడుస్తోంది. 'టాక్సిక్' కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి మొదట విడుదలైన గ్లింప్స్ వీడియోలోనే వివాదం మొదలైంది. అందులో కారులో ఒక అమ్మాయితో యశ్ రొమాన్స్‌ చేసే సీన్‌ మోతాదుకు మించి ఉందంటూ విమర్శలు వచ్చాయి.

ఆ వివాదం సద్దుమణగక ముందే, తాజాగా సినిమాలో హీరోయిన్లను పరిచయం చేస్తూ 'లేడీస్ అండ్ లేడీస్' అనే మరో వీడియోను సినిమా యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో బోల్డ్‌నెస్ డోస్ మరింత ఎక్కువగా ఉండటంతో.. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. "ఇది మామూలు సినిమానా లేక బూతు చిత్రమా?" అంటూ మండిపడుతున్నారు. ప్రమోషన్ల కోసం సినిమా టీమ్ ఇలాంటి వీడియోలు వదులుతున్నప్పటికీ, వీటిని చూసిన తర్వాత ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ అంత సులభంగా రాదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆగస్టు 26, 2026 న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై సెన్సార్ బోర్డు కత్తెర పడటం ఖాయమని, అసలు బోర్డు ఎన్ని కట్స్ చెబుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కన్నడలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది.

అయితే, ఈ సంస్థకు సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో వీళ్లు నిర్మించిన 'జన నాయగన్' సినిమా.. సెన్సార్ సమస్యల వల్లే ఇంకా విడుదల కాలేదు. అలాగే 'కేడీ - ది డెవిల్' సినిమా కూడా అందులోని రస్టిక్ కంటెంట్ కారణంగా ఇలాంటి సెన్సార్ ఇబ్బందులనే ఎదుర్కొంది. ఇప్పుడు 'టాక్సిక్' వంతు వచ్చింది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు డైరెక్టర్‌. 1940 - 1970ల మధ్య గోవాలో సాగే క్రూరమైన డ్రగ్స్, మాఫియా సామ్రాజ్యం నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి టాప్‌ హీరోయిన్లు ఇందులో పవర్‌ఫుల్ రోల్స్‌ చేస్తున్నారు. ఎందరు స్టార్స్ ఉన్నా.. సినిమా అద్భుతంగా వచ్చినా, ఈ మితిమీరిన బోల్డ్ కంటెంట్, వైలెన్స్ అడ్డంకులను దాటి, సెన్సార్ కట్స్ లేకుండా నిర్మాతలు సినిమాను ఎలా బయటకు తీసుకువస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Published : 
  • 4 July 2026, 11:04 AM IST