Top story: రాములమ్మకి మంత్రి పదవి కొండా సురేఖ అవుట్.. విజయశాంతి ఇన్. రాములమ్మ కి త్వరలో మంత్రి పదవి..!

తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొద్ది రోజుల్లో కొండా సురేఖను తొలగించడం దాదాపు ఖాయం అయిపోయింది. ప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్న ఏసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇండియా తిరిగి రాగానే కొండా కి గుడ్ బై చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Post Published By: dialnews
Updated : 28 August 2026, 11:44 AM IST

తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొద్ది రోజుల్లో కొండా సురేఖను తొలగించడం దాదాపు ఖాయం అయిపోయింది. ప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్న ఏసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇండియా తిరిగి రాగానే కొండా కి గుడ్ బై చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే అనూహ్యంగా కొండ సురేఖ స్థానంలో... అదే బీసీ మహిళ క్యాటగిరిలో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు.చాలా రోజులుగా ఢిల్లీ ఐ కమాండ్ దగ్గర లాబీయింగ్ చేస్తున్న విజయశాంతికి చివరికి ఆలస్యంగా నైనా మంచి ఫలితం దక్కబోతోంది . బీసీ మహిళనీ పదవి నుంచి నుంచి తొలగించాము అనే అపవాదు రాకుండా అదే ప్లేస్ లో బీసీ మహిళ అయిన విజయశాంతితో భర్తీ చేయాలని అధిష్టానం దాదాపు నిర్ణయానికి వచ్చింది.

నిజానికి విజయశాంతి, తెలంగాణలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఎవర్ని పట్టించుకోరు. అసలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు. ఆమెకి తెలంగాణలో సొంత కార్యకర్తలు గాని, అనుచర గణం కూడా లేదు. 2023 ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ కి పెద్దగా ప్రచారం చేసింది కూడా ఏమీ లేదు. అయితే కాంగ్రెస్ కల్చర్ బాగా వంట పట్టించుకోవడం వలన ఢిల్లీ నాయకులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తోంది విజయశాంతి. అసలు హైదరాబాదులో ఉండే నాయకులు, తెలంగాణ స్థానిక నాయకులు అంతా నా ముందు ఆఫ్ట్రాల్ అనే ఫీలింగ్ లో ఉంటారు విజయశాంతి. నా వల్లే తెలంగాణ వచ్చింది అని కెసిఆర్ కూడా అంత ఘనంగా చెప్పుకోడు..... కానీ విజయశాంతి మాత్రం తెలంగాణ ఏర్పాటు నా ఘనతే అని నిర్మొహమాటంగా ప్రకటించుకుంటుంది.

తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో విజయశాంతిని ఎవరు పట్టించుకోలేదు. విజయశాంతి కూడా గాంధీభవన్ కి రాకపోకలు గాని... ప్రభుత్వ పథకాల ప్రచారంలో కానీ వేటితోనూ సంబంధం లేకుండా రెండేళ్లు గడిపేశారు. మొత్తానికి ఢిల్లీ లాబీయింగ్ బలంగా పనిచేసి.... విజయశాంతికి ఎమ్మెల్సీ దక్కింది.2023 ఎన్నికల్లో పెద్ద పొడిచిందిఏమీ లేకపోయినా, అప్పుడప్పుడైనా యాంటీ కేసీఆర్ వాయిస్ వినిపించింది కదా.... ఆమెకి ఎమ్మెల్సీ ఇద్దాం అని అధిష్టానం స్థానిక నాయకులకు సర్ది చెప్పింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా విజయశాంతి కౌన్సిల్లోనే రెండు.... మూడు సార్లు రేవంత్ సర్కార్ ని ఇరుకున పెట్టింది. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని విజయశాంతి విమర్శించారు. తద్వారా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే , లేకపోతే రోజు ఏదో ఒక రచ్చ చేస్తా అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా చెప్పారు విజయశాంతి.

అంతటితో ఆమె ఆగిపోలేదు. ఢిల్లీలో తనకు తెలిసిన ఒకరిద్దరు నేతలతో మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ గాని, మిగిలిన సీనియర్లుకానీ ఎవరికి ఇష్టం లేదు. కానీ అధిష్టానం ఇస్తే అడ్డుకోలేరు కూడా. అందుకే విజయశాంతి తన ప్రయత్నాలన్నీ ఢిల్లీకే పరిమితం చేశారు. ఇప్పుడు కొండ సురేఖనీ ఎలాగో అధిష్టానం సాగనంపాలని అనుకుంటుంది కనుక.... విజయశాంతి వేగంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆమెకు హామీ కూడా ఇచ్చి ఉంది కనుక, బిసి.. మహిళా ఈ రెండు సమీకరణాలను దృష్టి లో పెట్టుకొని విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే పర్యావసనాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఆలోచించి ఒక వారంలో నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ అధిష్టానం.

 

 

Published : 
  • 28 August 2026, 11:44 AM IST