Top story: సాంతం నాకేసింది… అషురెడ్డి హనీ ట్రాప్ దెబ్బకి 15 కోట్లు పోగొట్టుకున్న అమాయకుడు…

నాకేయడం అంటే అలా ఇలా కాదు.... ఏడేళ్ల పాటు ఓ ఎన్నారై నీ 15 కోట్లకు పైగా నాకేసింది సోషల్ మీడియా సెలబ్రిటీ అశురెడ్డి. ఈ మధ్యకాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ సెలబ్రిటీలు.... పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా ఎవ్వనిబడితే వాడిని దోచేస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 29 April 2026, 11:23 AM IST

నాకేయడం అంటే అలా ఇలా కాదు.... ఏడేళ్ల పాటు ఓ ఎన్నారై నీ 15 కోట్లకు పైగా నాకేసింది సోషల్ మీడియా సెలబ్రిటీ అశురెడ్డి. ఈ మధ్యకాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ సెలబ్రిటీలు.... పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా ఎవ్వనిబడితే వాడిని దోచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అశు రెడ్డి హనీ ట్రాప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. బాధితుడు వెంకట ధర్మేంద్ర అలియాస్ వెంకీ వైసిపి నేత తోట త్రిమూర్తులు కు బంధువు అవుతాడు. అమెరికాలో చదువుకున్నాడు. యూకే లో ఉద్యోగం చేస్తున్నా డు. టాలీవుడ్ లో చిన్న నటి అశు రెడ్డి తనను హాని ట్రాప్ చేసి 10 కోట్లు కొట్టేసిందని ధర్మేంద్ర మూడు నెలల క్రితమే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పూర్తిస్థాయి సమాచారం సేకరించిన తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో అషురెడ్డి ఓ వల్గర్ ఇంటర్వ్యూ చేసి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె నటించిన సినిమాలు ఏవి అంటే ఎవరికి తెలియదు. అంతకు మించిన పెద్ద హిస్టరీ కూడా లేదు. కానీ హైదరాబాదులో టాప్ క్లాస్ పబ్బులు, సెలబ్రిటీ పార్టీ ల లో మాత్రం అషురెడ్డి నిత్యం కనిపిస్తూ ఉంటుంది. గతంలో ఒకసారి డ్రగ్స్ కేసులో అషురెడ్డిని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఆ తర్వాత బిగ్ బాస్ లో స్థానం సంపాదించి పాపులర్ అయిపోయింది అషురెడ్డి.

వైసిపి నేత తోట త్రిమూర్తులకు బంధువైన వై వెంకట ధర్మేందర్, గతంలో షేక్పేట్ లో ఉండేవారు. మొదట అమెరికాలో, ఆ తర్వాత లండన్ లో నివసిస్తూ ఉండేవారు. ధర్మేందర్ ను వెంకీ అని పిలుస్తారు.2018లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ధర్మేందర్ కు అషు రెడ్డి పరిచయం అయింది. అమెరికాలో మాస్టర్స్ చేశానని, ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నానని చెప్పింది అషు రెడ్డి. పరిచయం అయినా రెండు నెలలకే, ధర్మేందర్ ని ముగ్గులోకి దింపింది. అతని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే తనకు అప్పటికే పెళ్లయిందని, డివోర్స్ కేసు నడుస్తుందని చెప్పాడు ధర్మేందర్. నీ గతం నాకు అవసరం లేదు... నేను నిన్ను ప్రేమిస్తున్నాను దట్స్ ఆల్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అది మాత్రం చెప్పు చాలు అంది.

ధర్మేందర్ అషురెడ్డి రింగ్ లో పడిపోయాడు. అక్కడి నుంచి మన వాడిని పిండేయడం మొదలుపెట్టింది. హైదరాబాదులో ధర్మేంద్ర పేరున షేక్పేట్ లో ఒక ఇల్లు ఉంది. అయినా సరే తనకంటూ ఒక ఇల్లు ఉండాలని ఇల్లు కొనిపించింది అషురెడ్డి. ఆ తర్వాత మరో రెండు కారులు, బంగారు ఆభరణాలు, డైమండ్స్ ఇలా ఒకటి కాదు ధర్మేంద్ర అలియాస్ వెంకీని శాంతం నాకేసింది. మొత్తంగా ధర్మేందర్ అకౌంట్ నుంచి అశురెడ్డికి 9 కోట్ల 80 లక్షలు రూపాయలు బదిలీ అయ్యాయి. అషు రెడ్డి చెల్లెలు కూడా మరో 50 లక్షలు తీసుకుంది. ఇవి కాకుండా ఫారెన్ టూర్లు, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు, హోటల్ బిల్స్, ఖరీదైన గిఫ్ట్లు, బ్రాండెడ్ వస్తువులు ఇలా ఒకటి కాదు. ఏడేళ్లలో పూర్తిగా నాకేసింది.
అ షు రెడ్డిని పెళ్లి చేసుకోవాలనే పిచ్చిలో ధర్మేందర్ లోన్లు తెచ్చి మరి డబ్బులు ఇచ్చాడు.

కొద్దిరోజుల తర్వాత అశు రెడ్డి ధర్మేందర్ ని కట్ చేయడం మొదలుపెట్టింది. మాట్లాడటం మానేసింది. అషు రెడ్డి కి సంబంధించి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నప్పటికీ, ధర్మేందర్ అవేమీ పట్టించుకోలేదు. పెళ్లి చేసుకుందాము అని అడగ్గానే మాట్లాడడం మానేసింది. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. రకరకాల మార్గాల్లో ప్రయత్నించి ఆమెని పట్టుకున్నాడు ధర్మేందర్.70 లక్షల రూపాయలు ఇస్తానని చెక్కులు ఇచ్చింది. తర్వాత నటి హేమ దగ్గర ఇద్దరికీ పంచాయతీ జరిగింది. హేమ ఎదురుగానే ఆ చెక్కులు కూడా చింపి పడేసింది అషు రెడ్డి.కొద్దిరోజుల తర్వాత ఆమె అక్క తల్లి ఇద్దరు ధర్మేందర్ కి కాల్ చేశారు. అషు రెడ్డి కి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని, ఆమెకి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పడంతో ధర్మేందర్ మళ్లీ ఆమెకు దగ్గరయ్యాడు. లక్షలు ఖర్చుపెట్టి అషురెడ్డికి సర్జరీ చేయించాడు.

అషురెడ్డి కోలుకున్నాక మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ధర్మేందర్ అతని మిత్రులు డ్రగ్స్ తీసుకుంటుండగా వీడియోలు తీసేనని... వాటిని బయట పెడతానని బెదిరించింది ఆమె. ఒక ప్రముఖ న్యాయవాది దగ్గరికి వెళ్లి అతనికి ఆ వీడియోలు చూపించి తన వ్యవహారం సెటిల్ చేయాలని కోరింది. అయితే ధర్మేందర్ వెంటనే తెలంగాణలో ఒక ప్రముఖ పొలిటిషన్ ని ఆశ్రయించాడు. ఆ పొలిటిషన్ న్యాయవాదిని పిలిపించి వాళ్ళిద్దరు వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో న్యాయవాది పక్కకు తప్పుకున్నాడు. మరికొన్ని రోజులు ధర్మేంద్ర, అతని ఫ్రెండ్స్ పై కూడా కేసులు పెడతానని బెదిరించింది అషు రెడ్డి. అంతేకాదు ఎమ్మెల్యే అయిన ప్రముఖ సీనియర్ హీరోని కూడా ఆశ్రయించింది. అతని ద్వారా ధర్మేంద్రను బెదిరించాలని చూసింది. కానీ ధర్మేంద్ర ఎమ్మెల్యే కం హీరో కి అషు రెడ్డి గురించి పూర్తి సమాచారం ఇవ్వడంతో అతను కూడా ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్నాడు.

ఈలోపు అశు రెడ్డి తండ్రి కొయ్య వెంకటకృష్ణారెడ్డి ఈ గొడవ పరిష్కరించడానికి ఇద్దరికీ పెళ్లి చేయాలని... ఈ పంచాయతీని వేణు స్వామి దగ్గరికి తీసుకెళ్లాడు. వేణు స్వామి దగ్గర కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ధర్మేంద్ర తాను అఫీషియల్ గా ఇచ్చిన తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు అ షురెడ్డి వెనక్కి ఇవ్వాల్సిందేనని, సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు... చాటింగ్సు అన్ని ముందు పెట్టాడు. అయినా అషురెడ్డి భయపడలేదు. పైగా ఎదురు కేసు పెడతానని ధర్మేందర్ని బెదిరించింది.

ధర్మేందర్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే అశు సినిమా ఇండస్ట్రీ కి చెందిన భూపాల్ అనే వ్యక్తితో ఉండేదనితెలుస్తోంది.శివ జయంత్ అనే ఎన్నారై తో ఇప్పటికే అశు రెడ్డి మరో ఎఫైర్ నడుపుతోంది. అతన్ని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అన్ని రకాలుగా ప్రయత్నించి.... వ్యవహారం సెటిల్ కాకపోవడంతో వై వెంకట ధర్మేందర్ చివరికి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసూరెడ్డికి ఇచ్చిన డబ్బులు వివరాలు బ్యాంక్ స్టేట్మెంట్లు, అన్ని పోలీసులు అందించారు. మూడు నాలుగు నెలలు సిసిఎస్ పోలీసులు దీనిపై ప్రాథమిక సమాచారం సేకరించిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ లోపు కేసు కాకుండా ఉండడానికి అషు రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ అవి ఏమీ ఫలించలేదు. ఇప్పుడు రేపో మాపో ఆమెని పోలీసులు ప్రశ్నించబోతున్నారు.

నిజానికి అసూరెడ్డిది ఒక మధ్య తరగతి కుటుంబం. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. కాస్ట్లీ లైఫ్ కి అలవాటు పడిపోయింది. అందుకోసం పరిచయాలు పెంచుకుంది. అందం ఆమెకు అడ్వాంటేజ్ అయింది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు , ఇన్స్టా యాప్ లో ఆమెని సెలబ్రిటీ చేశాయి. ఆమె వేసిన వలలో ధర్మేంద్ర అడ్డంగా చిక్కుకున్నాడు. తాను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు తోపాటు అప్పులు చేసి మరి ఆశు రెడ్డికి దారబోశాడు. చివరికి పరువు, డబ్బు రెండు పోగొట్టుకున్నాడు. అశు రెడ్డికి ఆమె తల్లి ,చెల్లి సపోర్టు ఉంది. వాళ్లే అసూరెడ్డిని తమ అవసరాల కోసం ఇలా పక్కదారి పట్టించారని ఆమె తండ్రి కృష్ణారెడ్డి కూడా చెప్తున్నాడు. అశు రెడ్డి అక్క దివ్య రెడ్డి కూడా ధర్మేంద్ర నుంచి ఒక 50 లక్షలు పిండేసింది. డబ్బులు ఒక్కటే కాదు... పార్టీలు, పబ్బులు, ఫారిన్ టూర్లు, బ్రాండెడ్ గూడ్స్ వీటన్నిటి కోసం ధర్మేందర్ ని పిండేసారు.... శాంతం నాకేశారు అషు రెడ్డి ఫ్యామిలీ.

ఇంత చేసి... చివరికి మళ్ళీ ఇప్పుడు అషురెడ్డిహైకోర్టును ఆశ్రయించింది. తన దగ్గర స్టేట్మెంట్ తీసుకోకుండా సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారంటూ ఆరోపిస్తుంది. కానీ ధర్మేంద్ర విడుదల చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లో అన్ని కోట్ల రూపాయలు నీకు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు మాత్రం ఆమె నుంచి సమాధానం లేదు. అంతేకాదు అషురెడ్డి ధర్మేంద్ర అలియాస్ వెంకీని బెదిరిస్తున్న ఆడియోలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. దీంతో అమ్మడు క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థం అయింది.

 

 

Published : 
  • 29 April 2026, 11:23 AM IST