3000 కోట్ల టార్గెట్.. డేంజర్ కాకున్నా డేంజర్ బెల్స్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్, రిలీజ్ డేట్ లో మార్పు, కొంత కన్ ఫ్యూజన్ కి కారణమౌతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2026 | 11:01 AMLast Updated on: Jan 23, 2026 | 11:01 AM

Intersting Facst About Ntr Dragon Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్, రిలీజ్ డేట్ లో మార్పు, కొంత కన్ ఫ్యూజన్ కి కారణమౌతోంది. సమ్మర్ పూర్తయ్యేలోగా డ్రాగన్ షూటింగ్ పూర్తి చేయాలి… కాని కథలో మార్పులు, పాన్ వరల్డ్ లెక్కలు, ఇవన్నీ మేకింగ్ కాస్త డిలే అయ్యేలా చేస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా డ్రాగన్ పాత్ర మీద పరించ ఫోకస్ పెంచాడు.. అంతగా పాత్రని ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. అంతా బానే ఉంది. కాని డ్రాగన్ కోరుకునే ఉగాది పచ్చడే కారంతో నిండిపోయేలా ఉంది. ఎందుకంటే, వచ్చే ఏడాది ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో వారణాసి రంగంలోకి దిగటం కన్పామ్ అని తేలింది.. కాని దసరాకో, దీపావలికో, రిలీజ్ కుదరక, పొంగల్ పోరులోకి దిగుతున్నాడు డ్రాగన్… ఎలా చూసినా వారణాసి రావటానికి రెండుమూడు నెలల ముందే తన సినమా వస్తోంది.. కాబట్టి నో ప్రాబ్లమ్.. కాని ఇక్కడ సమస్య ఏంటంటే, సంక్రాంతికి కూడా డ్రాగన్ రాకపోతే ఏంటి పరిస్థితి? మరో రిలీజ్ డేట్ అంటే మరో ఆరునెల్లు డౌటే…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ సంక్రాంతికి రాబోతోంది. పొంగల్ పోరుకి ప్రిపేర్ అవుతుంది. నిజానికి జూన్ 25 న ఈ సీనిమాను రిలీజ్ చేయాలని మొదట్లో అనుకున్నారు. కాని పాన్ వరల్డ్ లెవల్లో రెండు భాగాలుగా సినిమా కథ లో మార్పుల వల్లే, ప్లానింగ్ మారింది. కాబట్టే రిలీజ్ డేట్లు జూన్ నుంచి దసరాకు, అక్కడి నుంచి సంక్రాంతికి మార్చాల్సి వచ్చిందన్నారు..కట్ చేస్తే ఇప్పుడు సీన్లో వారణాసి వచ్చి కూర్చుంది.. వచ్చే ఏడాది మార్చ్ 25 కి వారణాసి రిలీజ్ అవటం ఖాయం.. అందులో ఎలాంటి డౌట్ లేదని రాజమౌళి టీం స్ట్రాంగ్ కమిట్ మెంట్ తో తేల్చింది.. కట్ చేస్తే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ తో డ్రాగన్ కి ఏమైనా సమస్యా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. కాని గ్రౌండ్ రియాలిటీ చూస్తే,
ఎలాంటి ఇబ్బంది లేదు…

ఎందుకంటే సంక్రాంతికి డ్రాగన్ రిలీజ్ అనుకున్నా, ఉగాది సీజన్ లో వాఱనాసి రాబోతోంది. సో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల మధ్య కనీసం మూడు నెల్లు అంటే 80 నుంచి 90 రోజుల గ్యాప్ ఉంటుంది.. ఆలోపు డ్రాగన్ హిట్టైతే, 3వేల కోట్లు రాబట్టడం కష్టమేమి కాదు… 30 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్న ఐడియాకు ఎలాంటి ఇబ్బంది రాదు..అసలు థియేటర్ల పంపకాల విషయంలో ఎలాంటి ఇష్యూ వచ్చేచాన్స్ లేదు.. కాని మేకింగ్ డిలే అవుతోందని, ఇలానే డ్రాగన్ ని దసరా, దీపావళి కూడా కాదని సంక్రాంతికి వాయిదా వేసినట్టే… ఆ సీజన్ నుంచి కూడా వాయిదా వేస్తే, అసలుకే ఎసరొస్తుంది.. ఎందుకంటే మార్చ్ 25న వారణాసి వస్తోందంటే, జనవరిలోనే ఏదైనా పాన్ ఇండియా మూవీ రావాలి.. ఆతర్వాత వస్తే థియేటర్ల సమస్య, ఒకవేళ ఫిబ్రవరిలో వచ్చినా, వసూల్లు మార్చ్ 25 లోపు వచ్చినవాటితోనే సరిపెట్టుకోవాలి..

తర్వాత అన్ని థియేటర్స్ ని వారణాసి కమ్మేస్తుంది… ఈ సినిమా ఇంపాక్ట్ కనీసం మరో రెండు నెలలపైనే ఉంటుంది కాబట్టి, జనవరిలో డ్రాగన్ రాకపోతే, జూన్ వరకు మళ్లీ విడుదల కష్టం… అదే జరిగితే, ఈ జూన్ లో రావాల్సిన సినిమా వచ్చే ఏడాది జూన్ లో విడుదలైనట్టవుతుంది. కాని ప్రశాంత్ నీల్ వేగం పెంచాడు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్లానింగ్ పెంచాడు.. కాబట్టి పొంగల్ కి డ్రాగన్ దరువుకి ఎలాంటి ఇబ్బంది లేనట్టే కనిపిస్తోంది.