బ్రేకింగ్: విచారణకు కేటీఆర్, తర్వాత కవితే..?
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణకు పిలిచారు.
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణకు పిలిచారు. నిన్న నంది నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన అధికారులు, నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని కోరారు. దీనితో నిన్నటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నిన్న సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు కేటీఆర్. ఈ కేసులో పట్టు లేదని సుప్రీంకోర్టు చెప్పిన రేవంత్ రెడ్డి వినడం లేదంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. ఇక ఈ కేసులో మొన్న మాజీ మంత్రి హరీష్ రావు అని కూడా అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరో రెండు మూడు రోజుల్లో మరి కొంతమంది కీలక వ్యక్తులను ఈ కేసులో విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఫోన్ టాపింగ్ సంబంధించి విమర్శలు చేశారు. తన భర్త ఫోన్ కూడా టాప్ అయిందంటూ ఆమె చేసిన విమర్శలతో.. ఆమెను ఆమె భర్తను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి.











