365 రోజుల ముందే.. 10 వేల కోట్ల వార్నింగ్.. ఎవరికి?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ వారణాసి... ఈ సినిమా విషయంలో పాన్ ఇండియా స్టార్ హీరోలందరికీ రాజమౌలి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ వారణాసి… ఈ సినిమా విషయంలో పాన్ ఇండియా స్టార్ హీరోలందరికీ రాజమౌలి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు.. ఆ వార్నింగ్ ఖరీదు అక్షరాలా 10 వేల కోట్లు… అసలే 1500 కోట్ల బడ్జెట్ కాదు, 3 వేల కోట్ల వరకు బడ్జెట్ తో ఫిల్మ్ టీం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో కనివీనీ ఎరుగని మూవీ తీస్తున్నారు… అలాంటి మూవీతో పోటీకి ఎవరైనా దిగగలరా? ఈ ప్రశ్ననే ఒక్క ఎనౌన్స్ మెంట్ తో వేస్తోంది రాజమౌళి టీం… అంటే మార్చ్ నెలలో వారణాసి రావటం పక్కా అని చెప్పకనే తేల్చినట్టు.. 55 వేల థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మందికి వారణాసిని దగ్గర చేయటమే తన ప్లాన్.. దానికి ఏ సినిమా అడ్డు రాదు.. రాకూడాదనే వార్నింగ్ ఖర్చు పదివేల కోట్లు.. ఇంతకి ఈ వార్నింగ్ కి, ఆ ఎనౌన్స్ మెంట్ కి, పదివేల కోట్లకి ఉన్న లింకేటీ? ఎందుకు చాలా మంది స్టార్స్ తన వార్నింగ్ కి వెనక్కి తగ్గుతారు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ వారణాసి… వచ్చే ఏడాది సమ్మర్ లో అది ఉగాది ముందు రాబోతోందని ఫిల్మ్ టీం తేల్చింది. కాని రాజమౌళి సినిమాలేవి అనుకున్న టైం కి రావు.. కాబట్టి మార్చ్ 25 కి ఈ సినిమా రాకపోవచ్చని, చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ ఆ సీజన్ ని టార్గెట్ చేస్తున్నారు..కాని వాళ్లందరికి సాలిడ్ గా పదివేలకోట్ల వార్నింగ్ ఇచ్చనంతపని చేసింది వారణాసి టీం. ఇండియాలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలైనా రావొచ్చు… ఎన్ని పాన్ వరల్డ్ మూవీలైనా తెరకెక్కుతుండొచ్చు.. కాని 2027 లో వచ్చే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ రాజమౌళిదే.. అలానే అంచనాల భారం పెరుగుతోంది. అలానే ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే పాన్ ఇండిగా గేట్లు బద్దలు కొట్టిన వాడే, పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టబోతున్నాడనంటున్నారు.
1500 కోట్ల బడ్జెట్ కాదు అన్ లిమిటెడ్ బడ్జెట్ అన్నారు.. అంటే అవతార్ రేంజ్ బడ్జెట్ తో తొలి ఇండియన్ మూవీ అంటే వసూళ్లు కూడా అదే రేంజ్ లోరావాలి… రాబట్టుకోవాలి… అలా జరగాలంటే, వేల థియేటర్స్ లో రిలీజ్ కావాలి.. అలా జరగాలంటే, రిలీజ్ డేట్ ఒక టి చెప్పి, తర్వాత వాయిదా వేసి, రిలీజ్ చేస్తా అంటే వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ దొరకటం కష్టం..అందుకే 120 దేశాల్లో 30 భాషల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా సినిమాను తీస్తున్నాడంటే, రిలీజ్ డేట్ ఏడాది ముందే కన్పామ్ కావాలి. అందుకే అది వాయిదా పడదు, విడుదల తేదీ మారదనివారణాసి టీం ముందే తేల్చింది. నిజంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయితే, హాలీవుడ్ కి కూడా దక్కని ఘనత ఈ మూవీకి దక్కినట్టవ్వటమే కాదు, మొదటి రోజే 1000 కోట్ల నంచి 2500 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ఉంది
ఏమాత్రం టాక్ బాగున్నా, కనీసం నెలలో 10 వేల కోట్లు, లాంగ్ రన్ లో అవతార్ వసూళ్లైన 25 వేల కోట్లు రికార్డుని బద్దలు కొట్టొచ్చు.. అయితే ఇవన్నీ కేవలం అంచనాలే… తెలుగువాళ్లో, భారతీయులో ఈ సినిమాను చూస్తే ఇన్ని వసూల్లు కష్టం.. యూరోపియన్లు, అమెరికా, కెనెడాతోపాటు సౌత్ ఆసియన్లు, ఆఫ్రికన్లు, ఇలా ప్రపంచ వ్యాప్తంగా వారణాసికి హిట్ టాక్ రావాలి… అదే జరిగాలంటే, కంటెంట్ కి తగ్గట్టే ప్రమోషన్, దానికి తగ్గట్టే మార్కెటింగ్ ఉండాలి.. అందుకే రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు. కాబట్టి, ఎవరూ మార్చి జోలికి రావొద్దు మినిమమ్ 10 వేల కోట్ల వసూల్ల టార్గెట్ తో వస్తున్నామన్న కలెక్షన్స్ వార్నింగ్ ఇచ్చేస్తోంది వారణాసి టీం… ఇదోరకంగా మిగతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీల రిలీజ్ డేట్లు సరిచూసుకోమనే హెచ్చరికలాంటిదన్న డిస్కర్షణ్ మొదలైంది.











