నార్త్ ఇండియా మార్కెట్ ని ఎవరు కొల్లగొడితే, వాళ్లే పాన్ ఇండియా స్టార్.. ఆవిషయంలో 5 పాన్ ఇండియా హిట్లతో కింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్. అలాంటి రెబల్ స్టార్ సింహసనాన్నే లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొత్తగా ఈ అంశమే బాలీవుడ్ లో రీసౌండ్ చేయటానికి రీజన్,డ్రాగన్ గ్లింప్స్... తెలుగు లోనే ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్స్ అనుకుంటే, నార్త్ ఇండియాలో తనకి ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టుంది. డ్రాగన్ గ్లింప్స్ కి తెలుగు కంటే హిందీ వ్యూసే సడన్ గా పెరగటం చూస్తుంటే, డ్రాగన్ కోసం వాల్లెంత ఆత్రంగా వేయిట్ చేస్తున్నారో తెలుస్తోంది. డ్రాగన్ గ్లింప్స్ వచ్చిన వారం తర్వాత, అన్ని భాషల్లో వ్యూస్ కంటే, హిందీ గ్లింప్స్ వ్యూస్ ఐదు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి... దేవరతోనే నార్త్ లో ఎన్టీఆర్ కి భారీగా మాస్ ఫాలోయింగ్ ఉందని తేలింది.. ఇప్పుడు చూస్తే, డ్రాగన్ తో పాన్ ఇండియా కింగ్ పొషీజనే మారేలా ఉందా? ప్రభాస్ సింహాసనానికి ఎసరొచ్చేలా ఉందా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో ఫ్యాన్ బేస్, మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. తెలుగు ఫ్యాన్స్ నే మించేలా తన నార్త్ ఇండియన్ ఫ్యాన్ బేస్ నెక్ట్స్ లెవల్లోషాక్ ఇచ్చేలాఉంది. అంటే మన తెలుగు జనాలు మొత్తం కలిపినా 10 కోట్లుండరు... కాని హిందీ వాళ్లు 50 కోట్ల పైనే ఉంటారు కాబట్టి, ఆటోమేటిగ్గా వాళ్లకి ఎన్టీఆర్ నచ్చితే, వాళ్ల సంఖ్య కోర్ తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మించే ఛాన్స్ ఉంటుంది.అయితే ఈ విషయం డ్రాగన్ గ్లింప్స్ కొస్తున్న రెస్పాన్స్ తో రెండో సారి తేలింది. రీజన్ తెలుగు గ్లింప్స్ కి 60మిలియన్లు వస్తే, హిందీ గ్లింప్స్ కి మొదటి రోజు 40 మిలియన్స్ వచ్చాయి. కట్ చేస్తే రెండు రోజుల్లో 7 మిలియన్ల చొప్పున, అంటే 70 లక్షల చొప్పున మొత్తంగ కోటి నలభైలక్షల వ్యూస్ వచ్చాయి.. అది కూడా గ్లింప్స్ రిలీజైన 5 రోజుల తర్వాత..ఇప్పుడు ఏడు రోజుల టోటల్ వ్యూస్ చూస్తే, 180 మిలియన్లు, అంటే 18 కోట్ల వరకు అన్ని భాషల వ్యూస్ కనిపిస్తున్నాయి. మరో రెండు రోజులాగితే, 200 మిలియన్ల వ్యూస్ రికార్డు కూడా దక్కేలా ఉంది. నిజానికి ఇదేం కొత్త విషయం కాదు. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన దేవరతోనే నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కి ఊర మాస్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యిందని తేలింది.
ఏకంగా 670 కోట్లు దేవరకి వస్తే, అందులో 400 కోట్లు నార్త్ ఇండియానుంచే వచ్చాయంటే, ఎంతగా నార్త్ లో ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి తర్వాత వచ్చిన వార్2 మూవీ కథ ఏమాత్రం బాగున్నా, వెయ్యికోట్లు వరదొచ్చేది..హ్రితిక్ రోషన్ ఫేట్ మార్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కేది. కాని కథా లోపం ఉండటం, ఈ మూవీలో ఎన్టీఆర్ సపోర్టింగ్ రోలే చేయటంతో, ఇది పూర్తిగా ఎన్టీఆర్ సినిమా అనలేం.అయినా 400 కోట్ల వరకు వార్ 2 రాబట్టిందంటే, హ్రితిక్ కంటే ఎక్కువగా ఎన్టీఆర్ కి ఉన్న నార్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిపోతోంది. కాకపోతే డ్రాగన్ గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, లైక్స్ ని చూస్తుంటే, నార్త్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కున్న హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ నే ఎన్టీఆర్ మించేలా ఉన్నాడు.రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి రెండు భాగాలు హిట్ అయ్యాక కూడా, మరో హిట్ కోసం సాహో, రాధేశ్యామ, ఆదిపురష్ ఇలామూడు పంచ్ లు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆతర్వాతే కల్కీతో, సలార్ తో హిట్ పడింది.. ఏదేమైనా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్ రెస్పాన్స్ తో, ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ కిరీటం కొట్టేసేలా ఉన్నాడు. రెబల్ స్టార్ నేమించేలా కనిపిస్తున్నాడు.