బర్త్ డే బ్లాస్ట్.. Dragon ధూం ధాం…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేందుకు డ్రాగన్ టీం రెడీ అవుతోంది. మొన్నటి వరకు ఎప్పెడెప్పుడా డ్రాగన్ ప్రోమో అని ఎదురుచూశారు. లాస్ట్ ఇయరే ఎన్టీఆర్ బర్త్ డేకి డ్రాగన్ టీజర్ రావాలి. కాని వార్ 2 ప్రమోషన్ వల్లే ఆ అవకాశం లేకుండాపోయింది.

Post Published By: dialnews
Updated : 26 March 2026, 7:14 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేందుకు డ్రాగన్ టీం రెడీ అవుతోంది. మొన్నటి వరకు ఎప్పెడెప్పుడా డ్రాగన్ ప్రోమో అని ఎదురుచూశారు. లాస్ట్ ఇయరే ఎన్టీఆర్ బర్త్ డేకి డ్రాగన్ టీజర్ రావాలి. కాని వార్ 2 ప్రమోషన్ వల్లే ఆ అవకాశం లేకుండాపోయింది. కాని ఈసారి ఇలాంటి అడ్డంకులు లేవు. టీజర్ రాకను అడ్డుకునే అంశాలు లేవు.. అందుకే మే 20కి నెల ముందు నుంచే ఆ సందడి పెరిగేలా ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి సాలిడ్ ఎనౌన్స్ మెంట్ కన్ఫామ్ అయ్యింది. ఇంతకి వచ్చేది టీజరా? గ్లింప్సా...? లేదంటే మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టు, ఒకేసారి మూడు బంపర్ ఆఫర్స్ రెడీ అవుతున్నాయా? డ్రాగన్ లుక్కెలా ఉంటుందో బయట ఎన్టీఆర్ అప్పియరెన్స్ చూసి ఫ్యాన్స్ ఒక అంచనాకు వచ్చారు. కాని ఎంతైనా సినిమాలో తన లుక్ ఎలా ఉంటుందో తేలాలంటే పోస్టర్ రావాలి.. టీజర్ పేలాలి.. అప్పుడే ఆ కిక్ అర్ధమౌతుంది. అందుకే అంతా వేయిటింగ్.. మరి డ్రాగన్ నిప్పుల వర్షానికి ఎనౌన్స్ మెంట్ ఆజ్యం పోస్తుందా? ఎప్పుడు డ్రాగన్ రాక..?

ఎన్టీఆర్ ముందు 10 కిలోలు ఒక పాత్ర కోసం వేయిట్ తగ్గాడు. తర్వాత మరో పాత్రకోసం 4 కిలోలు.. మొత్తంగా 14 కిలోలు వేయిట్ లాస్ అయ్యి, హెల్త్ ని రిస్క్ లో పెట్టాడు. ఇదంతా డ్రాగన్ లో తను వేసిన డ్యూయెల్ రోల్స్ కోసమే చేశాడు. ఆల్రెడీ బక్కచిక్కిన తన లుక్ అందరూ చూశారు. ఏయిర్ పోర్ట్ వచ్చిపోతున్నప్పుడు, యాడ్స్ లో లేదంటే మరో చోట ఎన్టీఆర్ ఎంత సన్నబడ్డాడో కనిపిస్తోంది.కాబట్టి డ్రాగన్ లో తన లుక్ ఎలా ఉంటుందో అందరికీ ముందే క్లారిటీ ఉంది. అయినా డ్రాగన్ గా సినిమాలో తన లుక్ ఇంకెలా ఉంటుందనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది. తన ఫ్యాన్స్ లో మరింత ఎక్కువే కనిపిస్తోంది. ఐతే మే 20న తన భర్త్ డేకి టీజర్ బ్లాస్ట్ కన్పామ్ అని తెలుస్తోంది. ఫిల్మ్ టీం నుంచి హింట్స్ లాంటి ఫీలర్స్ పెరిగాయి. మొత్తానికి ఈ సమ్మర్ లో డ్రాగన్ నిప్పుల వర్షం కన్ఫామ్ అవుతోంది.

మే 20న బర్త్ డే స్పెషల్ గా డ్రాగన్ టీజర్ వస్తుందనే అంచనాలున్నాయి. కాకపోతే మరో రెండు అప్ డేట్స్ విషయంలో ప్రచారాలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. అవే గ్లింప్స్ తోపాటు టైటిల్ సాంగ్. ఇది కాకుండా మోషన్ పోస్టర్ మీద కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఐతే ఏప్రిల్ లో మాత్రం ముందు మోషన్ పోస్టర్ ని టైటిల్ ని రివీల్ చేస్తూ, బర్త్ డే బ్లాస్ట్ ని ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.అంటే ఎన్టీఆర్ బర్త్ డేకి కనీసం 40 రోజులు ముందే టీజర్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది. కాకపోతే మే 20 కి ఒకరోజు ముందు టైటిల్ సాంగ్ ని లాంచ్ చేయాలనే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడట. మే డే రోజున మాత్రం డ్రాగన్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ఉంది. దాన్ని కూడా బర్త్ డే బ్లాస్ట్ టీజర్ ఎనౌన్స్ మెంట్ కోసమే వాడబోతున్నారట. అంటే ఓరకంగా మే 20కి ముందు.. మూడు అప్ డేట్స్ కన్పామ్ అయ్యాయి.ఏప్రిల్ లో మోషన్ పోస్టర్ తో ఎనౌన్స్ మెంట్, మే డే రోజు గ్లింప్స్, బర్త్ డే కి ఒకరోజు ముందు టైటిల్ సాంగ్.. ఇవన్నీ వచ్చాకే మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టీజర్ ఉండొచ్చు.. ఇంతకాలం అప్ డేట్ లేకుండా డీలా పడ్డ ఫ్యాన్స్కి ఒకటి కాదు రెండు కాదు మూడు బంపర్ ఆఫర్లు.. మోషన్ పోస్టర్ తో వచ్చే ఎనౌన్స్ మెంట్ మాత్రం బోనస్.. మొత్తంగా డ్రాగన్ ధూమ్ దాం వచ్చే వారం నుంచే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 
  • 26 March 2026, 7:14 PM IST