నెం.1 నువ్వొక్కడివే.. సూపర్ JAMES BOND…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసిలో రుద్రుడిగా, శివుడిగా, అలానే రాముడిగా కూడా కనిపించబోతున్నాడు. ఇవేవి రూమర్స్ కాదు. ఫిల్మ్ టీం ఆల్రెడీ ఇచ్చేసి క్లారిటీ. పాన్ వరల్డ్ లెవల్లో హాలీవుడ్ లుక్స్ ఉన్న మహేశ్ బాబు, ఇండియానాజోన్స్ లాంటి రోల్ వేయటం వరకు బానే ఉంది.

Post Published By: dialnews
Updated : 14 April 2026, 8:55 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసిలో రుద్రుడిగా, శివుడిగా, అలానే రాముడిగా కూడా కనిపించబోతున్నాడు. ఇవేవి రూమర్స్ కాదు. ఫిల్మ్ టీం ఆల్రెడీ ఇచ్చేసి క్లారిటీ. పాన్ వరల్డ్ లెవల్లో హాలీవుడ్ లుక్స్ ఉన్న మహేశ్ బాబు, ఇండియానాజోన్స్ లాంటి రోల్ వేయటం వరకు బానే ఉంది. ఆతర్వాత ఏంటనే ప్రశ్నకు జేమ్స్ బాండ్ సౌండే వస్తోంది. సుకుమార్ మేకింగ్ లో జేమ్స్ బాండ్ లాంటి మూవీ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అదే అక్షర సత్యంగా మారేలా ఉంది. రామ్ చరన్ కి సుకుమార్ కమిటైనా, మహేశ్ బాబు కి మాత్రం బాండ్ మంత్రం వేయటం చూస్తుంటే, రూమర్లన్నీ నిజమయ్యేలా ఉన్నాయి. 1400 కోట్లలో వారణాసి రాబోతోంది. 10 వేల కోట్ల వసూళ్లే అంచనాగా ఆ ప్రాజెక్ట్ పరుగులు తీస్తోంది.. ఇలాంటి టైంలో, ఆతర్వాత అంతకుమించే మూవీ రావాలంటే, బాండ్ జోనరే కరెక్టా? కాని వారణాసి కూడా మరో రకం బాండ్ మూవీనే అంటున్నారు.. అలా అయితే బ్యాక్ టు బ్యాక్ బాండ్ జోనర్ లో ఇండియన్ జేమ్స్ బాండ్ గా మహేశ్ బాబు కనిపిస్తాడా?

వన్ నేనొక్కడినే మూవీతో సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత మాస్ స్టార్ అయినా, కమర్శియల్ హీరో అయినా, తనతో కూడా కంటెంట్ డ్రివెన్ స్టోరీలు తీయొచ్చు..అలాంటి సాలిడ్ కంటెంట్ ఉన్న మూవీలతో బాక్సాఫీస్ ని షేక్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు సుకుమార్.అలాంటి తను ఇప్పడు మహేశ్ తో జేమ్స్ బాండ్ జోనర్ లో సినిమా కమిటయ్యాడన్నారు.ఐతే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ సంబందించిన స్క్రిప్ట్ రఫ్ వర్షన్ ని మహేశ్ బాబుకి వినిపించటం. ఔను ప్రజెంట్ తన శిష్యుడు బుచ్చిబాబు తీస్తున్న పెద్దీ సంబంధించిన వర్క్ కి సూపర్ విజన్ చేస్తున్నాడు సుకుమార్. పోస్ట్ ప్రొడక్షణ్ కరెక్షన్స్ కూడా చేస్తున్నాడు. అదవ్వగానే, రామ్ చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఆగస్ట్ లోగా వారనాసి మూవీ షూటింగ్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఆతర్వాతే, అంటే దసరాకే దాదాపుగా సుకుమార్, రామ్ చరణ్ మూవీ మొదలవ్వొచ్చు.. సంక్రాంతికి మహేశ్ బాబు, సుకుమార్ సినిమా లాంచ్ అవ్వొచ్చు.. రెండూ ఒకేసారి తీయకున్నా, రామ్ చరణ్ మూవీ తీస్తూనే, ప్యార్ లల్ గా మహేశ్ బాబు సినిమా పనులు మొదలౌతాయని తెలుస్తోంది. సంక్రాంతికి మహేశ్ బాబు సినిమా లాంచ్ చేసి, తన సినిమాకోసం హీరో లుక్ మార్పులు, ప్రీ ప్రొడక్షణ్ పనులు మొదలౌతాయని, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.ఐతే ఇదంతా మొన్నటి వరకు ప్రచారమే.. కేవలం రూమరేఅనుకున్నారు. కాని ఇప్పుడు వారణాసి సెట్ లో సుకుమార్ దర్శనమివ్వటం చూస్తుంటే, తనతో మూడుగంటలు ప్రత్యేకంగా తను మీట్ అవటం వెనక, స్టోరీ సిట్టింగ్సే కారనం అని తెలుస్తోంది. సో వీళ్ల కాంబోలో ప్లాన్ చేసిన మూవీకి ఆల్ మోస్ట్ అన్ని ఓకే అన్న మాటే నిజమయ్యేలా ఉంది. ఫైనల్ గా సంక్రాంతికి మహేశ్ మూవీని లాంచ్ చేసి, 2027 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

సంక్రాంతికి, జూన్ కి మధ్య 6 నెల్ల టైం ఉంది... సో జేమ్స్ బాండ్ తరహా మూవీ కాబట్టి లుక్ మార్చుకోవాల్సి ఉంటుందనే, కేవలం లుక్ చేంజ్ కోసం 6 నెల్ల టైం ఇచ్చాడట ఈ లెక్కల మాస్టారు. రామ్ చరన్ మూవీ దసరాకు మొదలుపెట్టి, 2027 ఆగస్ట్ లోగా పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఓరకంగా జూన్ లో మహేశ్ బాబు సినిమా మొదలైతే, ఈ రెండు సినిమాల ప్యారలల్ షూటింగ్ చేసినట్టౌతుంది... పరిస్తితి చూస్తుంటే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మహేశ్ డ్రీమ్ తో పాటు తన ఫ్యాన్స్ డ్రీమ్ కూడా ఈ జేమ్స్ బాండ్ జోనర్ తోనిజం కాబోతోంది. ఆల్రెడీ ఇదే పాత్ర లాంటి ఇండియానా జోన్స్ పాత్రని, వారణాసిలో వేస్తున్న మహేశ్, ఇప్పుడు ప్యూర్ జేమ్స్ బాండ్ గా కనిపించటం కూడా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్టే కనిపిస్తోంది.

Published : 
  • 14 April 2026, 8:55 PM IST