గ్లోబల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిజేమ్స్ బాండ్ గా చూపించేందుకు సుకుమార్ ఆల్ మోస్ట్ రెడీ... అందుకోసం స్టోరీ లైన్ చెప్పటం,మహేశ్ బాబు ఒప్పుకోవటం కూడా జరిగిపోయాయి. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగచెప్పిన కథని కూడా ఓకే చేసిన మహేశ్ బాబుకి, ఊహించని ఝలక్ ప్రశాంత్ నీల్ ఇచ్చినట్టున్నాడు. పర్ఫెక్ట్ మైథలాజికల్ డ్రామాని లార్డ్ కృష్ణ కోణంలో తను ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే, బ్రేకింగ్ న్యూస్ గా మారేలా ఉంది మహేశ్ బాడు జేమ్స్ బాండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇదేదో ఫిక్షనల్ కథకాదు.. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీయబోతున్నారని తెలుస్తోంది. హిందీ ధురందరన్ ని మించే మైండ్ బ్లాక్ కంటెట్ తో ఎటాక్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.. ఇంతకి రియల్ బాండ్ కథే ఎందుకు ఎంచుకుంటున్నారు? రా మాజీ ఏజెంట్లను సుకుమార్ కలిశాడా? తెరవెనక ఏం జరుగుతోంది?
వారణాసి తర్వాత మహేశ్ బాబు గేమ్ ప్లాన్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. రాజమౌలి లాంటి దర్శకుడితో, వారణాసి లాంటి పాన్ వరల్డ్ సినిమా చేశాక మహేశ్ బాబు పని ఔట్ అనుకున్నారు.. వారనాసి డెఫినెట్ గా హిట్ అవుతుంది. కేవలం హిట్ ఏంటి బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. గ్లోబల్ గా సూపర్ స్టార్ రేంజ్, మార్కెట్ పెరిగిపోతాయి. కాని ఆ తర్వాత అందుకు తగ్గ పాత్ర, కథ, సినిమా చేయటం కష్టం కాబట్టి, నెక్ట్స్ ఏం చేస్తాడో పాపం అన్నారు.కాని సూపర్ స్టార్ సెటైర్లు వేసినంత తేలిగ్గా, తన ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ సుకుమార్ మేకింగ్ లో జేమ్స్ బాండ్ లాంటి కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా పూర్తైన వెంటనే మహేశ్ బాబుతో జేమ్స్ బాండ్ జోనర్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఇంతవరకు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు ఇది ఏదో ఫిక్షనల్ కథతో కాకుండా, రియల్ కిక్ ఇచ్చే పాత్రతో మనముందుకు రాబోతున్నాడట మహేశ్ బాబు.
ఔను ఇండియన్ అయినా, పాకిస్థాన్ వెల్లి డిగ్రీలు, పీజీలు చేసి, అక్కడి ఆర్మీలో ఆపీసర్ గా మారిన ఒక ఇండియన్ రా ఏజెంట్ రియల్ స్టోరీతోనే జేమ్స్ బాండ్ లాంటి కథ సిద్దం చేశాడట సుకుమార్. నిజానికి బాలీవుడ్ లో ఆల్రెడీ ఇలాంటి సినిమా వచ్చింది. రాజస్టాన్ కి చెందిన రవింద్ర కౌశిక్ నే, బ్లాక్ టైగర్ అంటారు. తనే పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ గా ఎదిగి, అక్కడే స్థిరపడి, భారత్ కోసం పనిచేశాడు.అంత డెడికేటెడ్ రా ఏజెంట్ గా తన జర్నీని, పాత్రని బేస్ చేసుకుని సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ జిందాహై, ఏక్ థా టైగర్ వచ్చాయి.. అంతెందుకు ధురందర్ పాత్ర కూడా ఇలాంటి రియల్ ఏజెంట్స్ ని బేస్ చేసుకుని తీసిందే.. అందుకే సుకుమార్ కూడా బ్లాక్ టైగర్ పాత్రని బేస్ చేసుకునే, ఒక సాలిడ్ కథ రెడీ చేశాడట. అదే మహేశ్ కి చెప్పడం తను ఓకేచేయటం జరిగిందని ఈమధ్య ప్రచారం పెరిగింది.అయితే ఇందులో కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, సుకుమార్ ఓ మాజీ రా ఏజెంట్ ని కలవటం.. అలానే బ్లాక్ టైగర్ గా ఫోకస్ అయిన రా మాజీ ఏజెంట్ రవింద్ర కౌశిక్ తాలూకు కొన్ని లీగల్ కాపీ రైట్స్ సినిమాకు ఇబ్బంది కాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఇదేనిజమైతే, పుష్పని మించిన రియాల్ కిక్ సుకుమార్ డైరెక్షన్ లో మహేశ్ బాబు ఇవ్వటం ఖాయం. అది కూడా ఒక రియల్ పాత్రతో...!