డ్రాగన్ తాతపోలిక.. నట సార్వభౌముడయ్యేదప్పుడే..!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత నేత ఎన్టీఆర్ బర్త్ డే రోజు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్సనల్ లుక్ కిక్ ఇస్తోంది.. తాత పోలికలే తన ఫేట్ ని సగం మార్చేస్తే, నటుడిగా తన జర్నీ మిగతా సగం తన తల రాతనేమార్చేసింది.

Post Published By: dialnews
Updated : 29 May 2026, 7:15 PM IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత నేత ఎన్టీఆర్ బర్త్ డే రోజు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్సనల్ లుక్ కిక్ ఇస్తోంది.. తాత పోలికలే తన ఫేట్ ని సగం మార్చేస్తే, నటుడిగా తన జర్నీ మిగతా సగం తన తల రాతనేమార్చేసింది. ఐతే డ్రాగన్ మూవీలో మాత్రం తాతకుతగ్గ మనవడు కాదు, డైరెక్ట్ గా తాతగానే మారతున్నాడు ఎన్టీఆర్. బేసిగ్గా సీనియర్ ఎన్టీఆర్ అంటేనే గోట్ అనే అభిప్రాయముంది. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం... ఇప్పుడా గోట్ స్థానాన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ భర్తీ చేయాలంటే, తను తాత లాంటి పాత్రలు కాదు... తాతగానే మారాలని తేలిందా? అందుకే డ్రాగన్ లో ఈ నందమూరి మనవడు.. నందమూరి తాతగా మారిపోయాడా? అసలు సిసలు ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీలే చూపించబోతున్నాడా? రాజమౌళి వల్ల కానిది, ప్రశాంత్ నీల్ వల్ల అయ్యేల ఉందా? అదెలా?

డ్రాగన్ లో ఎన్టీఆర్ ఒక్కడు కాదుఇద్దరు.. ఇది ఒక్క సినిమా కాదు, రెండు భాగాలు.. ఇదిగ్లింప్స్ లో తేల్చకున్నా... పరోక్షంగా తేలింది. కారణం డ్రాగన్ గ్లింప్స్ లో లూగర్ పాత్రనే పరిచయం చేసిన ప్రశాంత్ నీల్, తనే డ్రాగన్ అని ఎక్కడా చెప్పలేదు.. అక్కడే విశ్వవిఖ్యాతనట సార్వ భౌమ సీనియర్ ఎన్టీఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న పోలిక,మెలికపెడుతోంది..ఆ విషయానికొస్తే, నిజానికి ఎన్టీఆర్ డ్రాగన్ లో తాత, మనవడి పాత్రలు వేశాడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. డ్రాగన్ టైటిల్ రోల్ మాత్రం తాత పాత్రలో కనిపించే ఎన్టీఆర్ దే అని ప్రచారం జరుగుతోంది. దీనికి సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న లింక్ ఒక్కటే, ఫేట్ ఛేంజింగ్ రోల్.. ఏజ్ కి మించి వేసే పాత్ర...ఔను తాతంతటి గొప్పోడు అవ్వాలంటే, ఏకంగా తాతపాత్రే వేసి, తాతని రీచ్ అయ్యే సాహసం చేస్తున్నాడు ఎన్టీఆర్...

ఔను డ్రాగన్ లో ఎన్టీఆర్ మనవడిగా లూగర్ పాత్రని, తాతగా డ్రాగన్ పాత్రని వేస్తున్నాడనే విషయం పరోక్షంగా కన్ఫామ్ అయ్యింది. గ్లింప్స్ లో ఇచ్చిన హింట్లతో తేలింది.. ఇప్పుడు తేలాల్సింది.. ఎన్టీఆర్ లో ఉన్న మరో కోణాన్ని, తన తలరాతని మార్చే మూవీని ఎవరిస్తారని... రాజమౌళి వల్ల కూడా కాని ఈ పనిని ప్రశాంత్ నీల్ పక్కాగా పూర్తి చేసేలా ఉన్నాడు.ఇంత ఖచ్చితంగా చెప్పడానికి రీజన్, రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ 4 సినిమాలు చేశాడు.. అన్నీ హిట్లే... కాని ఎన్టీఆర్ ఫేట్ మార్చే మూవీల లిస్ట్ లో అవి చేరవు... స్టూడెంట్ నెం1. సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్... నిజానికి త్రిబుల్ ఆర్ గ్లోబల్ హిట్ కావొచ్చు.. కాని అందులో కొమరం భీముడిగా ఎన్టీఆర్ కి ఇచ్చింది ఈ హీరో ఎన్నడూ వేయని పాత్ర లాంటిది కాదు.

కొమరం భీమ్ రియల్ రోల్ గొప్పదే.. అదే రీల్ లో అంతకంటే గొప్పగా చూపించారు.. ఎన్టీఆర్ కూడా పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.కాని ఎన్టీఆర్ ఫేట్ మార్చేంత అంటే, టెంపర్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ వేసిన పాత్రలాగా.. ఆదిలో ఎన్టీఆర్ వేసిన రోల్ లాగా... ఒకటి హిట్, మరొకటి ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన సినిమా.. ఇలా ఉండాలి.. అలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి.. జైలవకుశలో నెగెటీవ్ రోల్ కూడా అలాంటిదే.. కాబట్టే, తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలంటే, ఇలాంటి నెక్ట్స్ లెవల్ పాత్రలే వేయాలి.. అలాంటి పాత్రే డ్రాగన్ లో ఒకటి కాదు రెండు పడినట్టున్నాయి. కాబట్టే తాత స్థాయికి చేరేందుకు ఏకంగా తాత పాత్రకూడా వేసే సాహసం చేసిన ఎన్టీఆర్ అనంటున్నారు.

Published : 
  • 29 May 2026, 7:15 PM IST