మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ తో వచ్చే ఏడాది జూన్ మీద దాడి చేయబోతున్నాడు. తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ తో దండెత్తుతాడు. అది మోస్ట్ లీ సంక్రాంతికి మొదలవ్వొచ్చు.. రెండూ కూడా పాన్ ఆసియా, పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టే ప్రయోగాలే.. అంతవరకు ఎన్టీఆర్ ప్లానింగ్ ఫ్యాన్స్ కి కూడా అర్ధమైపోతోంది. కాని ఆ తర్వాతేంటి? డ్రాగన్, మురుగన్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోంది? దేవర సీక్వెల్ ఎలాగూ ఉంటుందని ఆల్రెడీ అందరికీ క్లారిటీ ఉంది.. ఒక వేల అది ఇంకా హోల్డ్ లో పెట్టినా ఎన్టీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? సుకుమార్ సీన్ లోకి వస్తాడా? కథ చెప్పి పెట్టిన సందీప్ రెడ్డి వంగనే ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా? లేదంటే ఏదో మిరాకిల్ జరిగి ఐదో సారి రాజమౌళితో ఎన్టీఆర్ సినీ సునామీకి రెడీ అవుతాడా? ఏం జరగబోతోంది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నెక్ట్స్ అనే ప్రశ్నకు అర్ధం లేదు. ఎందుకంటే, డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మురుగన్ ఇలా రెండు ప్రాజెక్టులతో బీజ అవుతున్నాడు. ఆల్రెడీ డ్రాగన్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమాతోనే సరిపోతుంది. తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ మొదలౌతుంది.ఆవెంటనే దేవర సీక్వెల్ ఉంటుందా? మళ్లీ దాన్ని హోల్డ్ లో పెడతాడా అన్నది తేలాలి.. మోస్ట్ లీ గాడ్ ఆఫ్ వార్, దేవర పార్ట్ 2 ప్యార్ లల్ గా తెరకెక్కుతాయనే ప్రచారమే జరుగుతోంది. అదే కాస్త ప్రాక్టికల్ గా నిజానికి దగ్గరగా ఉన్నట్టనిపిస్తోంది.. ఐతే డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మురుగన్, దేవర2 వీటితర్వాత ఎన్టీఆర్ దారెటు.. నెల్సన్ దిలీప్ మూవీ అసలు వార్తల్లోనే లేదు కాబట్టి, మరో రెండేల్లతర్వాత ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం.
ఇక సందీప్ రెడ్డి, సుకుమార్, రాజమౌళి ఈ ముగ్గురిలో ఒకరితో మాత్రం ఎన్టీఆర్ సినిమా పక్కగా ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగన్ ఐదారు సార్లు ఎన్టీఆర్ ని కలిశాడు. కథ చెప్పాడు.. సో స్పిరిట్ అవగానే యానిమల్ 2 తీస్తాడా? అదయ్యాకే ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తాడా అన్నది, తను కమిటయ్యే సినిమాలు, ఎన్టీఆర్ డేట్స్ దొరికే అంశాలని బట్టి ఉంటుంది.ఇక సుకుమార్ చాలా కాలంగా నాన్నకు ప్రేమతో తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో కాంబినేషన్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు. ఆల్ మోస్ట్ పదిహేనేళ్లు దాటింది వీల్ల కాంబోలో ఆ సినిమా వచ్చి. సో రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా అయిపోయిన వెంటనే, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేఛాన్స్ కూడా పుష్కలంగానే కనిపిస్తోంది. కాని ఇక్కడే ఎన్టీఆర్ జర్నీని ఒక వ్యక్తి ఎఫెక్ట్ చేసేలా ఉన్నాడు. తనే దర్శక ధీరుడు రాజమౌలి.
రాజమౌలితో కూడా ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ అయ్యేలా ఉంది. స్టూడెంట్ నెం. 1, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ తర్వాత ఐదో మూవీగా ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు..అది కూడా వారణాసి లాంటి పాన్ వరల్డ్ మూవీ తో గ్లోబ్ మీద రాజమౌళి దాడి చేశాక, ఎన్టీఆర్ తో సినిమా తీస్తే లెక్కలు మారిపోతాయి. ఈలోపు తను కూడా డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మురుగన్ తో పాన్ ఆసియా మీద దండెత్తబోతున్నాడు. కాబట్టి ఇది సూపర్ జెంబో కాంబినేషన్ గామారొచ్చు.. సో రాజమౌళి నుంచి పిలువు వస్తే, సుకుమార్, సందీప్ రెడ్డిని హోల్డ్ లో పెట్టి ఎన్టీఆర్ దర్శక ధీరుడితోనే సినిమా చేసే ఛాన్స్ఉంటుంది. లేదంటే సందీప్, సుకుమర్ రెండు ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి.. ఇద్దరి ప్రాజెక్టులు ప్యార్ లల్ గా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.